Breaking News

సింగపూర్ ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్‌లో నటి కరీనా లగ్జరీయస్‌ లుక్‌..! ఆ బ్యాగ్‌ ఏకంగా..

Published on Sun, 10/11/2026 - 13:20

బాలీవుడ్‌ అందాల భామ కరీనా కపూర్‌ ఎప్పుడూ తనదైన విలక్షణమైన స్టైల్‌తో అందర్నీ అలరిస్తుంటుంది. ఆమె ధరించి డిజైనర్‌వేర్‌లు ఫ్యాషన్‌ ప్రియులను తెగా ఆకర్షిస్తుంటాయి. ఈసారి తాజాగా సింగపూర్‌లోని ఎఫ్‌1 గ్రాండ్‌ ప్రిక్స్‌లో అద్భుతమైన లుక్‌తో మెరిసింది. అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో పంచుకుంది. అక్కడ అందరి దృష్టిని ఆకర్షించింది ఆమె హెర్మెస్‌ బ్యాగ్‌. కారులో కూర్చొని సింగపూర్‌ అద్భుతమైన స్కైలైన్‌ నేపథ్యంలో ఫోజులిస్తున్నప్పుడు ఆండ్రాయిడ్‌ చార్మ్‌తో అలంకరించిన బ్యాగ్‌తో కరీనా అత్యంత స్టైలిష్‌గా కనిపించింది. 

ఇది లక్షలు విలువ చేసే బ్యాగ్‌ అని సమాచారం. ఈ సెల్లియర్‌ బ్యాగ్‌ను టోగో లేదా ఎప్సమ్‌ లెదర్‌తో తయారు చేశారు. దీనికి గోల్డ్‌ హార్డ్‌వేర్‌ ఉంటుంది. సాధారణంగా హెర్మెస్‌ కెల్లీ బ్యాగుల ధర 3.8% నుంచి 8.9% వరకు పెరిగాయి. ఎప్సమ్ లేదా టోగో లెదర్‌తో చేసిన బ్యాగ్‌ ప్రారంభ దరే రూ. 13 లక్షల నుంచి ప్రారంభమవుతుందట. రీసెల్‌ మార్కెట్‌లో అదే బ్యాగ్‌ సుమారు రూ. 27 లక్షలు పైనే పలుకుతుందట. ఇక్కడ కరీనా ధరించి బ్యాగ్‌ వచ్చేసి సుమారు. రూ. 35 లక్షలు పైనే పలుకుతుందట. 

ఇక కరీనా సింగపూర్ ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్‌లో తన ఫ్యాషన్ స్టేట్‌మెంట్ కోసం..తెల్లటి ప్యాంటును ఎంచుకున్నారు, దానికి ఫిట్టెడ్‌ బాడీసూట్‌ని జత చేశారు. ప్రింటెడ్ సిల్క్ స్కార్ఫ్, బ్రౌన్‌ జాక్‌తో తన లుక్‌ని మరింత అందంగా కనిపించేలా చేశారామె. ఈ ముద్దుగుమ్మ బేబో రూ. 54 వేలు ఖరీదు చేసే స్టడెడ్‌ చెవిపోగులను ధరించింది. తేలికైన మేకప్‌తో అత్యంత నేచురల్‌గా కనిపించేందుకే ప్రయత్నిస్తుంటారామె. 

కాగా, సింగపూర్ F1 గ్రాండ్ ప్రిక్స్ అనేది ఫార్ములా వన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ఒక భాగమైన మోటార్ రేసింగ్ ఈవెంట్. ఈ రేసు సింగపూర్‌లోని మెరీనా బే స్ట్రీట్ సర్క్యూట్‌లో జరుగుతుంది. ఈ ఈవెంట్ 1966 నుంచి 1973 వరకు థామ్సన్ రోడ్‌లో నిర్వహించారు. మళ్లీ మూడు దశాబ్దాలకు పైగా విరామం అనంతరం..2008లో మెరీనా బేలో నిర్వహించారు. 

 

ఇదీ చదవండి: ఐదు పదుల వయసులోనూ అంతే గ్లామర్‌గా ఖుష్బూ సుందర్‌..! బ్యూటీ సీక్రెట్‌ ఇదే..
 

Videos

టీడీపీ నుండి YSRCP లోకి చేరిన వెంటనే వరాలు కురిపించిన రాచమల్లు

హీరోగా విజయ్ వారసుడు

నవరాత్రుల వేళ ఇదేం అపచారం..! పూజలు లేకుండానే అమ్మవారి నిమజ్జనం

5 నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది.. మేడ్చల్ బాలిక కేసులో షాకింగ్ నిజాలు..

నాడు తిట్లు.. నేడు ప్రశంసలు 'ది హిందూ'లో మోదీపై చంద్రబాబు ప్రేమలేఖ

మూఢ నమ్మకంతో డీజిల్ పోసి తల్లినే చంపిన కొడుకు

పుష్ప శ్రీవాణి సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

దుర్గ గుడిలో సౌకర్యాలపై కేశినేని చిన్ని ని కడిగిపారేసిన భక్తులు

బాహుబలి కిలికి భాష గుర్తుందా..! వారణాసిలో అంతకు మించి..!

అరెస్ట్ చేయలేదు.. నన్ను కిడ్నాప్ చేశారు.. ధృవ్ రాఠీ సంచలన వీడియో

Photos

+5

ఇంద్రకీలాద్రిపై తొలిరోజు (ఫొటోలు)

+5

మల్లెపూలతో మెస్మరైజ్ చేస్తోన్న మంగళవారం బ్యూటీ.. (ఫోటోలు)

+5

రంభ ఊర్వశి మేనక బ్యూటీ రాశి సింగ్ లేటెస్ట్ పిక్స్.. (ఫోటోలు)

+5

రైళ్లు కిటకిట (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా రవితేజ కొత్త సినిమా తులాభారం ప్రారంభం.. (ఫోటోలు)

+5

హైదరాబాద్ : డ్యాన్స్‌తో అదరగొట్టిన విద్యార్థులు (ఫొటోలు)

+5

హైదరాబాద్ షాన్-ఎ-దక్కన్ కార్ ర్యాలీ ప్రారంభించిన నటుడు సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)

+5

హీరో విజయ్ దేవరకొండ (ఫోటోలు)

+5

అందాల అర్చన.. ఆకట్టుకుందిలా.. (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (అక్టోబర్ 11 -అక్టోబర్ 17)