Breaking News

సత్య సాయిబాబా బయోపిక్‌ చేయలేను, కారణం ఇదే : విజయ్‌ దేవరకొండ

Published on Sun, 10/11/2026 - 12:06

‘‘మన చరిత్రలో ప్రజల కోసం నిలబడిన గొప్ప వీరులు ఉన్నారు. ఆ వీరుల్లో చాలామంది మూడు పదుల వయసులోనే చనిపోయారు. అలాంటివారే మా ‘రణబాలి’ సినిమాకు స్ఫూర్తి. ఆ వీరుల గొప్పదనం, మన పూర్వీకులు ఎదుర్కొన్న దారుణాలు, బ్రిటిషర్స్‌ ఈ విశాల దేశాన్ని ఎలా ఆక్రమించుకున్నారు? వీటన్నింటినీ మేం ‘రణబాలి’ సినిమా ద్వారా బిగ్‌ స్క్రీన్‌ పై ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చూపించబోతున్నాం’’ అని విజయ్‌ దేవరకొండ అన్నారు. విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రణబాలి’. టీ సిరీస్‌ సమర్పణలో రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండ చెప్పిన సంగతులు... 

→ మన చరిత్ర గురించి మనం తెలుసుకోవాలనే ఆలోచనతో ‘రణబాలి’ సినిమా తీశాం. అనంతపురంలో జరిగే ఓ జాతరలో కొంతమంది వీరుల గురించి విన్న బుర్రకథల ఆధారంగా దర్శకుడు రాహుల్‌ ఈ కథను రెడీ చేశారు. ‘రణబాలి’ ఓ బుర్రకథతోనే ప్రారంభం అవుతుంది. మన దేశ భవిష్యత్‌ గురించి మనం ఆలోచించాలంటే చరిత్ర తెలియడం ముఖ్యం. మన చరిత్రలో మనకు తెలియకుండా రహస్యంగా మిగిలి΄ోయిన అధ్యాయాలను సినిమా మాధ్యమం ద్వారా వెలికి తీసే ప్రయత్నాలు జరుగుతుంటాయి. లేదంటే ఇంకెవరూ ఇలాంటి కథల్ని ముట్టుకోరు.

→ ఈ సినిమాలో కొన్ని యాక్షన్‌ సన్నివేశాలు ఉన్నాయి. అయితే ఒకప్పుడు బ్రిటిషర్లు చేసిన దారుణాల కంటే మా సినిమాలో చూపించనవి తక్కువే. ఇది సాఫ్ట్‌గా చెప్పే కథ కాదు, సాఫ్ట్‌గా చూపించే ప్రపంచం కాదు. ఈ సినిమా కోసం యాస, గుర్రపు స్వారీ నేర్చుకోవడం చాలెంజింగ్‌గా అనిపించింది. నేను పుట్టపర్తిలో చదువుకున్నాను కాబట్టి రాయలసీమ యాస కొంత పరిచయమే. అయితే ఈ సినిమా కోసం పర్ఫెక్ట్‌గా ఉండేలా నేర్చుకున్నాను.  

→ నేను హీరోగా చేసే సినిమాల్లో హీరోయిన్‌గా రష్మిక పేరును దర్శకులు సూచిస్తుంటారు. అయితే నాకు ‘రణబాలి’లోని జయమ్మ పాత్రకు రష్మిక అయితే కరెక్ట్‌ అనిపించింది. ఎందుకంటే ఈ సినిమాలో రణబాలి, జయమ్మ (రష్మిక పాత్ర పేరు) పాత్రల మధ్య మంచి ఎమోషనల్‌ డ్రామా ఉంది. మేమిద్దరం చేయడం వల్ల ఈ పాత్రలకు ఇంకాస్త ఎమోషనల్‌ డెప్త్‌ వచ్చింది. ఆ పాత్రలపై మా రియల్‌ లైఫ్‌ ఇంపాక్ట్‌ కూడా పడుతుంది. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఇదే ఫీల్‌ అవుతారు. 

→ సినిమా టికెట్‌ ధరల పెంపు నాకు ఎప్పట్నుంచో ఇష్టం లేదు. కానీ ఇది నిర్మాతలకు సంబంధించిన విషయం. అయితే ప్రొడ్యూసర్‌కు కంట్రోల్‌ ఉన్నంతవరకు నేను హీరోగా చేసే ఏ సినిమాకు టికెట్‌ రేట్స్‌ హైక్‌  వద్దనే చెబుతాను. ‘బిజి నెస్‌ పరంగా మనం వర్కౌట్‌ చేసుకుందాం. నేను తక్కువ చేయడం (పారితోషికం ఉద్దేశించి కావొచ్చు), లాభాల్లో వాటా గురించి మాట్లాడుకోవడం వంటివి మనం చూసుకుందాం’ అని నిర్మాతలతో అంటుంటాను. విజయ్‌ దేవరకొండ సినిమాకు టికెట్‌ రేట్స్‌ హైక్‌ అనేది ఉండదు. ఒకవేళ నేను రాజమౌళిగారితో సినిమా చేస్తే అప్పుడు తెలియదు. ఇది ఇప్పుడే ఎందుకు చెప్తున్నానంటే ‘రణబాలి’ సినిమా అప్పుడు విజయ్‌ అలా చెప్పాడు. మళ్లీ ఇప్పుడు ఇలా ఏంటి? అనే చర్చ జరగకూడదు. ఇక ‘రణబాలి’ సినిమాకు రావాల్సిన డబ్బులు వస్తాయి. అయితే ఆ డబ్బులు ఎక్కువగా ఈ సినిమాను థియేటర్స్‌లో చూసి, ప్రేక్షకుల నుంచి వస్తే మంచిదని భావిస్తున్నాను. ఎందుకంటే ‘రణబాలి’ సినిమా ఉద్దేశం అందరికీ తెలియాలి. 

→ తెలంగాణను ఎక్కువగా విలన్‌ క్యారెక్టర్స్‌కు చూపించారు. ఒక స్లాంగ్‌ను ఎక్కువగా కామెడీగా చూపించారు. రాయలసీమ స్లాంగ్‌ను విలన్, ఫ్యాక్షన్‌కు చూపించారు. రాహుల్‌ ‘రణబాలి’ చేశాడు. దర్శకుడు రవికిరణ్‌ నాతో గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో ‘రౌడీ జనార్ధన’ సినిమా చేస్తున్నాడు. ఈ ఇద్దరూ ఆ ప్రాంతాల యాసల్లోని హీరోయిజం కనిపించేలా సినిమా చేస్తామని చెప్పారు. ఈ రెండు సినిమాలూ అలానే ఉంటాయి.

→ బయోపిక్‌ చేయాలనే ఆకాంక్ష ఉంది. అయితే సత్య సాయిబాబా బయోపిక్‌కు న్యాయం చేయలేను. అందుకు కారణం ఆయనలో ఉన్న స్వచ్ఛత, సున్నితత్వం నాలో లేవన్నది నా ఫీలింగ్‌. నేను చేయగలిగే బయోపిక్‌లు వస్తే తప్పక చేస్తాను. 

Videos

టీడీపీ నుండి YSRCP లోకి చేరిన వెంటనే వరాలు కురిపించిన రాచమల్లు

హీరోగా విజయ్ వారసుడు

నవరాత్రుల వేళ ఇదేం అపచారం..! పూజలు లేకుండానే అమ్మవారి నిమజ్జనం

5 నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది.. మేడ్చల్ బాలిక కేసులో షాకింగ్ నిజాలు..

నాడు తిట్లు.. నేడు ప్రశంసలు 'ది హిందూ'లో మోదీపై చంద్రబాబు ప్రేమలేఖ

మూఢ నమ్మకంతో డీజిల్ పోసి తల్లినే చంపిన కొడుకు

పుష్ప శ్రీవాణి సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

దుర్గ గుడిలో సౌకర్యాలపై కేశినేని చిన్ని ని కడిగిపారేసిన భక్తులు

బాహుబలి కిలికి భాష గుర్తుందా..! వారణాసిలో అంతకు మించి..!

అరెస్ట్ చేయలేదు.. నన్ను కిడ్నాప్ చేశారు.. ధృవ్ రాఠీ సంచలన వీడియో

Photos

+5

ఇంద్రకీలాద్రిపై తొలిరోజు (ఫొటోలు)

+5

మల్లెపూలతో మెస్మరైజ్ చేస్తోన్న మంగళవారం బ్యూటీ.. (ఫోటోలు)

+5

రంభ ఊర్వశి మేనక బ్యూటీ రాశి సింగ్ లేటెస్ట్ పిక్స్.. (ఫోటోలు)

+5

రైళ్లు కిటకిట (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా రవితేజ కొత్త సినిమా తులాభారం ప్రారంభం.. (ఫోటోలు)

+5

హైదరాబాద్ : డ్యాన్స్‌తో అదరగొట్టిన విద్యార్థులు (ఫొటోలు)

+5

హైదరాబాద్ షాన్-ఎ-దక్కన్ కార్ ర్యాలీ ప్రారంభించిన నటుడు సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)

+5

హీరో విజయ్ దేవరకొండ (ఫోటోలు)

+5

అందాల అర్చన.. ఆకట్టుకుందిలా.. (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (అక్టోబర్ 11 -అక్టోబర్ 17)