Breaking News

ఉద్యోగులకు BMW కార్లు.. ఈమె ఎంత మంచి ‘బాసు’!

Published on Thu, 10/08/2026 - 15:35

సాధారణంగా ఉద్యోగులంటే యాజమాన్యాలకు చులకన. వారికి జీతం ఇవ్వడమే ఎక్కువ అనే ధోరణిలో చాలా యాజమాన్యాలు ఉంటాయి. ఇంక ఉద్యోగుల బాగోగులు ఏంటి, వారు కార్యాలయాలకు ఎలా వస్తున్నారు..  ఎంత ప్రయాసపడుతున్నారు... ఎవరు పట్టించుకుంటారు? కానీ, చైనాలో ఓ యజమాని పట్టించుకున్నారు. తమ ఉద్యోగులకు ఏకంగా బీఎండబ్ల్యూ కార్లు బహుమతి ఇచ్చారు.

ఉద్యోగుల కష్టాన్ని గుర్తించిన ఓ రెస్టారెంట్ యజమాని వారికి ఊహించని బహుమతి ఇచ్చారు. అత్యుత్తమ పనితీరు కనబరిచిన సిబ్బందికి ఏకంగా కొత్త బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా అందించి సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటున్నారు. చైనాలోని హెనాన్‌ ప్రావిన్స్‌ జియావోజువోకు చెందిన బీఫ్‌ హాట్‌పాట్‌ రెస్టారెంట్‌ చైన్‌ యజమాని మా యాన్లీ ఈ అరుదైన నిర్ణయం తీసుకున్నారు.

మా యాన్లీ తన సిబ్బందిలో చాలామంది ప్రతిరోజూ ఎలక్ట్రిక్‌ స్కూటర్లపై విధులకు వస్తున్న విషయాన్ని గమనించారు. ముఖ్యంగా చలి, వర్షం, బలమైన గాలులు వీచే సమయంలో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తించారు. ఓ రోజు చలి గాలులకు ఉద్యోగుల్లో ఒకరి ముఖం ఎర్రగా మారి పని ప్రదేశానికి చేరుకోవడం ఆమెను తీవ్రంగా కదిలించింది. తాను సౌకర్యవంతమైన కారులో ప్రయాణిస్తున్నప్పుడు, తన కోసం పనిచేసే ఉద్యోగులు మాత్రం ప్రతికూల వాతావరణంలో స్కూటర్లపై ఎందుకు ప్రయాణించాలన్న ఆలోచన ఆమెకు వచ్చింది.

ఈ క్రమంలో సెప్టెంబర్‌ 24న కొంతమంది ఉద్యోగులను సమావేశం ఉందంటూ బీఎండబ్ల్యూ డీలర్‌షిప్‌కు తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాతే అసలు విషయం వారికి తెలిసింది. ఎంపిక చేసిన అత్యుత్తమ ఉద్యోగులకు కొత్త బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించడంతో వారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఒక్కో కారు విలువ సుమారు 3 లక్షల యువాన్లు (దాదాపు రూ.43 లక్షలు)గా ఉన్నట్లు సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ తెలిపింది. ఈ కార్లను మా యాన్లీ రెండు వారాల ముందే పూర్తిగా చెల్లించి కొనుగోలు చేసినట్లు హెనాన్‌ టీవీ కథనాలను ఉటంకిస్తూ ఆ పత్రిక వెల్లడించింది. ఉద్యోగులు తమ జేబు నుంచి ఎలాంటి డబ్బూ చెల్లించాల్సిన అవసరం లేకుండానే కార్లను అందుకున్నారు.

ఈ అనూహ్య బహుమతిపై ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. “ఇంతటి బహుమతి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. బీఎండబ్ల్యూ షోరూమ్‌కు వెళ్తున్నప్పుడు బాస్‌ పెద్ద బొమ్మ ఇస్తానని మాత్రమే చెప్పారు” అని ఉద్యోగి లీ జీ పేర్కొన్నట్లు సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ తెలిపింది.

తన నిర్ణయానికి కారణాన్ని  మా యాన్లీ ఇలా వివరించారు. రెస్టారెంట్‌ అభివృద్ధి తన ఒక్కరి కృషితో సాధ్యపడలేదని, మొత్తం సిబ్బంది కలిసికట్టుగా పనిచేయడం వల్లే వ్యాపారం వృద్ధి చెందిందని చెప్పారు. తాను వ్యాపారం ద్వారా పొందుతున్న ఫలితాల్లో ఉద్యోగులు కూడా భాగస్వాములు కావాలని భావిస్తున్నట్లు తెలిపారు. “నేను సౌకర్యంగా ప్రయాణించగలిగినప్పుడు నా ఉద్యోగులు మాత్రం చలిలో ఎందుకు ఇబ్బంది పడాలి?” అన్నదే తన ఆలోచనగా ఆమె వివరించారు.

ఈ ఘటన చైనా సోషల్‌ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది. ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి ఇంత ఖరీదైన బహుమతి ఇవ్వడంపై పలువురు మా యాన్లీని ప్రశంసిస్తున్నారు. ఉద్యోగుల పనితీరును గుర్తించి యజమానులు ఏ విధంగా ప్రోత్సహించాలనే అంశంపై కూడా ఈ ఘటన చర్చకు దారితీసింది.

ఇదీ చదవండి: కొత్త జాబ్‌ బూమ్‌: ఆశలన్నీ ఈ ఉద్యోగాలపైనే!

Videos

తాడేపల్లి YSRCP పార్టీ ఆఫీస్ కూల్చివేత అంబటి స్టాంగ్ వార్నింగ్

జనసేన MLA చిర్రి బాలరాజు సన్నిహితురాలు సంచలన వీడియో

డార్లింగ్ ఫ్యాన్స్ కు పండగే..! ఫౌజీ నుంచి 3 నిమిషాల టీజర్..

ఏపీలో స్థానిక ఎన్నికలకు SEC రెడీ

Viral: చెన్నైలో షాకింగ్ ఘటన.. రోడ్డుపై భారీ గుంతలోకి దూసుకెళ్లిన కారు

జగ్గారెడ్డి దీక్ష.. రాజీనామా చేసే వరకు నా పోరాటం ఆగదు

సునీత కుటుంబానికి పదవులు? చంద్రబాబు ను కలవడానికి కారణం కూడా.. షాకింగ్ నిజాలు

YSRCP ఎమ్మెల్యే విరుపాక్షికి బెయిల్‌

వెనక్కి తగ్గిన కేంద్రం.. UPI చార్జీలు వాయిదా

YS జగన్ దృష్టిలో BC అంటే బ్యాక్ బోన్ క్లాసెస్

Photos

+5

రణబాలి మూవీ ట్రైలర్‌ లాంఛ్ ఈవెంట్‌లో స్పెషల్ మూమెంట్స్.. (ఫోటోలు)

+5

శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

జిమ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ దివి కసరత్తులు చూశారా?.. (ఫోటోలు)

+5

ది ప్యారడైజ్‌ ఏషనాగుల కట్టమీద సాంగ్‌ వర్కింగ్ స్టిల్స్.. (ఫోటోలు)

+5

హీరోయిన్ కామాక్షి భాస్కర్ల లేటెస్ట్ ఫోటోలు

+5

విజయవాడ : విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

తల్లికి బంగారు పతకం, తండ్రి, కుమార్తెకు పీజీ డిగ్రీలు (ఫొటోలు)

+5

తెరపై చూసిన నానా కాదు.. ఈ విలక్షణ ఫొటోలు చూడండి!

+5

హైదరాబాద్ : భళా..సరస్‌ మేళా (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)