Breaking News

నానా పటేకర్‌ ఒక్క రాత్రిలో ధూమపానం ఎలా మానేశారంటే..!

Published on Thu, 10/08/2026 - 13:07

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు, చిత్ర నిర్మాత నానా పటేకర్‌ గోవాలో తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. తన విలక్షణ నటనతోనే కాకుండా దాతృత్వ సేవలతో అందరి ఆదరాభిమానాలను అందుకున్న రియల్‌ హీరో. ఏడు పదుల వయసులోనూ చురుగ్గా ఉంటూ వర్కౌట్లతో అభిమానులను ఆశ్చర్యపర్చడమే కాకుండా ఆరోగ్య స్పృహ కలిగించే ప్రయత్నం చేసిన నటుడు. ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగత అలవాట్లకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందామా..!.

ఆయన ఒకప్పుడు చైన్‌ స్మోకర్‌ అట. రోజుకు 60 సిగరెట్లుపైగా కాల్చేవారట. అలా 56 ఏళ్ల వయసు వరకు ధూమపానం అలవాటు ఉందట. అలాంటి తాను ఒక్క రాత్రిలో ఆ అలవాటుని దూరం చేసుకున్నానని అన్నారు. ఎలా ధూమపానాన్ని మానేశారో కూడా పంచుకున్నారు. 

ఎలా అంటే..
2007-08లో ధూమపానం మానేశానని అన్నారు. అది చాలా ఆకస్మికంగా వచ్చిన మార్పు అని అన్నారు. ఆ రోజు ఉదయం నిద్రలేచి ఇక సిగరెట్టు వద్దు అని అనుకున్నాను..మళ్లీ ఇప్పటి వరకు ముట్టలేదన్నారు. అదెలా సాధ్యమైందంటే..

తాను దర్శకుడు ప్రియదర్శన్‌కు ధూమపానం మానేయమని సలహా ఇచ్చిన సంఘటన గురించి చెబుతూ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో 'పర్సెప్ట్ పిక్చర్స్' వారి 'కమాల్ ధమాల్ మలమాల్' చిత్రం కోసం ఆయన ప్రియదర్శన్‌తో కలిసి పనిచేస్తున్నారు. నానా పటేకర్ ప్రియదర్శన్‌ను ధూమపానం మానేసేలా ఒప్పించారు. ఆ తర్వాత తాను ఆ అలవాటుకి దూరం అయ్యాను అని చమత్కారంగా చెప్పారు. అలాగే మరొక కారణం వల్ల కూడా ఈ దురఅలవాటుని వదులుకున్నట్లు పేర్కొన్నారు. 

తన స్నేహితుడి భార్య తనకు సోదరికంటే ఎక్కువని, ఆమె కొడుకుని పొగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉంది. అలాగే ఆ టైంలో తాను దగ్గుతూ తడబడుతూ మాట్లాడుతుండే వాడినని అన్నారు. ఒకరోజు ఆమె తన వద్దకు వచ్చి ఏడుస్తూ ఇంకా ఏం బాధలు చూడాలో చెప్పు అని కోపంగా నిలదీసింది. ఆ రెండు ఘటనలతో రాత్రికే రాత్రి ఆ దురఅలవాటుని మానేయాలని స్ట్రాంగ్‌గా డిసైడయ్యానని ఆయనే స్వయంగా వెల్లడించారు ఒక మీడియా ఇంటర్వ్యూలో. 

అలాగే తన సహ నటులకు సైతం ఈ దుర అలవాట్లను వదులుకోమని సలహా ఇవ్వడమే కాదు దాన్నుంచి బయటపడేలా కొన్ని సలహాలు సూచనలు సైతం ఇచ్చారు. ముఖ్యంగా బాలీవుడ్‌ విలక్షణ నటుడు అమీర్‌ ఖాన్‌కి కూడా నానా సలహా ఇచ్చారు. 

అమీర్‌కి నానా ఇచ్చిన సలహా..
అమీర్‌ ఖాన్‌, నానా పటేకర్‌ మద్యపానం, ధూమపానం గురించి మనసు విప్పి మాట్లాడుకున్నారు. త్రీ ఇడియట్స్‌ స్టార్‌ అమీర్‌ తాను సిగరెట్లు తాగుతానని, అయితే మద్యం మానేశానని అన్నారు. ఒకప్పుడు రాత్రి పగలు తేడా లేకుండా ఫుట్‌గా ఆల్కహాల్‌ సేవించేవాడినని అన్నారు. ఏ అలవాటైన మితిమీరితే ఆరోగ్యానికి హానికరంగా మారుతుందని నానా రిప్లై ఇవ్వగానే అమీర్‌ తాను ఆ అలవాట్ల విషయంలో తీవ్రవాదినని నవ్వుతూ అన్నారు. 

తనకు ఒక అలవాటు అనారోగ్యకరమని తెలిసినప్పటికీ..దాన్ని మానుకోవడం తనకు అత్యంత కష్టంగా ఉంటుందని బదులిచ్చారు. నటులకు సినిమాలే మంచి మెడిసిన్‌ అని అన్నారు. ఆ చెత్త అలవాట్లకు దూరంగా ఉండాలంటే మీరు సినిమాలు చేస్తూనే ఉండాలని అమీర్‌కి సూచించారు నానా. దాంతో అప్పటి నుంచే ప్రతి ఏడాది కనీసం తనది ఒక్క సినిమా అయినా ఉండేలా చూసుకుంటున్నానని అన్నారు అమీర్‌ ఖాన్‌. 

కాగా, నానా గోవాలోని తని ఇంట్లోనే స్పృహ కోల్పోయి కనిపించడంతో హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ఆయన్ను బతికించే ప్రయత్నంలో వైద్యులు 45 నిమిషాల పాటు సీపీఆర్‌ చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఇవాళ అక్టోబర్‌ 8వ తేదీ ఉదయం 5.20 గంటలకు ఆయన మరణించినట్లు ధృవీకరించారు వైద్యులు.

 

ఇదీ చదవండి: 'గంఛా' ధరించి వర్కౌట్లు చేస్తున్న నానా పటేకర్‌..! వీడియో వైరల్‌

 

Videos

తాడేపల్లి YSRCP పార్టీ ఆఫీస్ కూల్చివేత అంబటి స్టాంగ్ వార్నింగ్

జనసేన MLA చిర్రి బాలరాజు సన్నిహితురాలు సంచలన వీడియో

డార్లింగ్ ఫ్యాన్స్ కు పండగే..! ఫౌజీ నుంచి 3 నిమిషాల టీజర్..

ఏపీలో స్థానిక ఎన్నికలకు SEC రెడీ

Viral: చెన్నైలో షాకింగ్ ఘటన.. రోడ్డుపై భారీ గుంతలోకి దూసుకెళ్లిన కారు

జగ్గారెడ్డి దీక్ష.. రాజీనామా చేసే వరకు నా పోరాటం ఆగదు

సునీత కుటుంబానికి పదవులు? చంద్రబాబు ను కలవడానికి కారణం కూడా.. షాకింగ్ నిజాలు

YSRCP ఎమ్మెల్యే విరుపాక్షికి బెయిల్‌

వెనక్కి తగ్గిన కేంద్రం.. UPI చార్జీలు వాయిదా

YS జగన్ దృష్టిలో BC అంటే బ్యాక్ బోన్ క్లాసెస్

Photos

+5

రణబాలి మూవీ ట్రైలర్‌ లాంఛ్ ఈవెంట్‌లో స్పెషల్ మూమెంట్స్.. (ఫోటోలు)

+5

శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

జిమ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ దివి కసరత్తులు చూశారా?.. (ఫోటోలు)

+5

ది ప్యారడైజ్‌ ఏషనాగుల కట్టమీద సాంగ్‌ వర్కింగ్ స్టిల్స్.. (ఫోటోలు)

+5

హీరోయిన్ కామాక్షి భాస్కర్ల లేటెస్ట్ ఫోటోలు

+5

విజయవాడ : విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

తల్లికి బంగారు పతకం, తండ్రి, కుమార్తెకు పీజీ డిగ్రీలు (ఫొటోలు)

+5

తెరపై చూసిన నానా కాదు.. ఈ విలక్షణ ఫొటోలు చూడండి!

+5

హైదరాబాద్ : భళా..సరస్‌ మేళా (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)