Breaking News

రూ.750తో పెళ్లి.. విషాదమే వెంటాడింది.. నానా భార్య ఎవరో తెలుసా?

Published on Thu, 10/08/2026 - 12:35

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దిగ్గజ నటుడు నానా పటేకర్. దశాబ్దాల పాటు విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన ఆయన గురువారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతితో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. నానా పటేకర్ సినీ ప్రస్థానం గురించి చాలామందికి తెలుసు. కానీ ఆయన భార్య నీలకంటి పటేకర్ గురించి మాత్రం పెద్దగా తెలియదు.

ఐఐటీ ర్యాంకర్‌.. అయినా నటన వైపే
పుణేకు చెందిన నీలకంటి పటేకర్ చిన్నతనం నుంచే చదువులో ప్రతిభావంతురాలు. దేశంలోనే అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షల్లో ఒకటైన ఐఐటీ ప్రవేశ పరీక్షలో ర్యాంకు సాధించారు. మంచి విద్య, ఉద్యోగ అవకాశాలు ఆమె ముందున్నప్పటికీ.. నాటకరంగంపై ఉన్న ఆసక్తి ఆమెను కళల వైపు నడిపించింది. ఇంజినీరింగ్, సైన్స్ రంగాల్లో కెరీర్‌ను ఎంచుకునే అవకాశం ఉన్నా.. ఆమె థియేటర్ ఆర్టిస్ట్‌గా కొనసాగాలని నిర్ణయించుకున్నారు.

ఉత్తమ నటిగా గోల్డ్ మెడల్
సినిమాల్లోకి రాకముందే నీలకంటి మరాఠీ నాటకరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1973లో జరిగిన మహారాష్ట్ర స్టేట్ డ్రామా కాంపిటీషన్‌లో ఉత్తమ నటిగా గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఆ తర్వాత కూడా నాటకరంగంలో తన ప్రయాణాన్ని కొనసాగించారు. 1989లో సచిన్ పిల్గాంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆత్మవిశ్వాస్’ చిత్రంలో నటించారు. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రశంసలు దక్కగా.. మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ నటి పురస్కారం అందజేసింది.

నాటకాలతోనే నానాతో పరిచయం
నీలకంటి పటేకర్‌కు నాటకరంగంతో ఉన్న అనుబంధమే నానా పటేకర్‌తో పరిచయానికి కారణమైంది. నాటకాల సమయంలో ఏర్పడిన పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. 1978లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అత్యంత సాదాసీదాగా జరిగిన ఈ పెళ్లికి అప్పట్లో కేవలం రూ.750 మాత్రమే ఖర్చయిందట. అయితే పెళ్లి తర్వాత వారి జీవితంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వారి మొదటి కుమారుడు రెండున్నరేళ్ల వయసులోనే కన్నుమూశారు.  అనంతరం వారికి మల్హర్ పటేకర్ జన్మించారు.

ఛావా సినిమాతో..
కుటుంబ బాధ్యతల కారణంగా నీలకంటి పటేకర్ చాలా కాలం పాటు నటనకు దూరంగా ఉన్నారు. నాటకరంగంలో ప్రతిభను చాటిన ఆమె.. సినిమాలకు కూడా కొంతకాలం దూరమయ్యారు. అయితే ఇటీవలే ‘ఛావా’ సినిమాతో వెండితెరపైకి తిరిగి వచ్చారు. విక్కీ కౌశల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో ‘ధరావు’ పాత్రను పోషించారు. చాలా ఏళ్ల తర్వాత తెరపై కనిపించినప్పటికీ.. తన నటనతో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.

(ఇదీ చదవండి: నవరసాల నానా.. మీమ్స్‌లో ఎప్పటికీ కేరాఫ్‌! )

 

Videos

తాడేపల్లి YSRCP పార్టీ ఆఫీస్ కూల్చివేత అంబటి స్టాంగ్ వార్నింగ్

జనసేన MLA చిర్రి బాలరాజు సన్నిహితురాలు సంచలన వీడియో

డార్లింగ్ ఫ్యాన్స్ కు పండగే..! ఫౌజీ నుంచి 3 నిమిషాల టీజర్..

ఏపీలో స్థానిక ఎన్నికలకు SEC రెడీ

Viral: చెన్నైలో షాకింగ్ ఘటన.. రోడ్డుపై భారీ గుంతలోకి దూసుకెళ్లిన కారు

జగ్గారెడ్డి దీక్ష.. రాజీనామా చేసే వరకు నా పోరాటం ఆగదు

సునీత కుటుంబానికి పదవులు? చంద్రబాబు ను కలవడానికి కారణం కూడా.. షాకింగ్ నిజాలు

YSRCP ఎమ్మెల్యే విరుపాక్షికి బెయిల్‌

వెనక్కి తగ్గిన కేంద్రం.. UPI చార్జీలు వాయిదా

YS జగన్ దృష్టిలో BC అంటే బ్యాక్ బోన్ క్లాసెస్

Photos

+5

రణబాలి మూవీ ట్రైలర్‌ లాంఛ్ ఈవెంట్‌లో స్పెషల్ మూమెంట్స్.. (ఫోటోలు)

+5

శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

జిమ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ దివి కసరత్తులు చూశారా?.. (ఫోటోలు)

+5

ది ప్యారడైజ్‌ ఏషనాగుల కట్టమీద సాంగ్‌ వర్కింగ్ స్టిల్స్.. (ఫోటోలు)

+5

హీరోయిన్ కామాక్షి భాస్కర్ల లేటెస్ట్ ఫోటోలు

+5

విజయవాడ : విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

తల్లికి బంగారు పతకం, తండ్రి, కుమార్తెకు పీజీ డిగ్రీలు (ఫొటోలు)

+5

తెరపై చూసిన నానా కాదు.. ఈ విలక్షణ ఫొటోలు చూడండి!

+5

హైదరాబాద్ : భళా..సరస్‌ మేళా (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)