Breaking News

మరోసారి పెరిగిన విమాన ఛార్జీలు!

Published on Mon, 10/05/2026 - 20:14

విమాన ప్రయాణం చేయాలనుకునే వారికి.. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ మరోసారి షాక్ ఇచ్చింది. విమాన ఇంధనం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు వరుసగా పెరుగుతుండటంతో దేశీయ, అంతర్జాతీయ విమానాలపై ఇంధన సర్‌ఛార్జ్‌ను పెంచుతున్నట్లు ఇండిగో ప్రకటించింది.

కొత్త ఛార్జీలు అక్టోబర్ 6 నుంచి చేసే అన్ని కొత్త బుకింగ్‌లకు వర్తించనున్నాయని సంస్థ పేర్కొంది. దీంతో ప్రయాణికులు టికెట్ కోసం గతంలో కంటే కొంత ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

ఇటీవల ఏటీఎఫ్ ధరలు వరుసగా పెరుగుతున్నాయి. గత వారంలోనే లీటర్ ఇంధన ధర రూ.16 మేర పెరగగా, అంతకుముందు ఆగస్టులో రూ.5, సెప్టెంబర్‌లో మరో రూ.6.28 చొప్పున పెరిగింది. విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ ఖర్చుల్లో ఇంధన వ్యయం దాదాపు 40 శాతం వరకు ఉంటుంది. దీంతో ఇంధన ధరలు పెరిగిన ప్రతిసారీ విమానయాన సంస్థలపై ఆర్థిక భారం పెరుగుతుంది. ఈ భారాన్ని కొంతవరకు తగ్గించుకునేందుకే ఇంధన సర్‌ఛార్జ్‌ను పెంచుతున్నట్లు ఇండిగో తెలిపింది.

దేశీయ విమానాల విషయానికి వస్తే.. ప్రయాణించే దూరాన్ని బట్టి ఛార్జ్ మారుతుంది. 500 కిలోమీటర్ల వరకు ఉన్న మార్గాలకు రూ.375, 1,000 కిలోమీటర్ల వరకు రూ.600, 1,500 కిలోమీటర్ల వరకు రూ.900, 2,000 కిలోమీటర్ల వరకు రూ.1,150 ఛార్జ్ వసూలు చేయనున్నారు. 2,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించాలనుకుంటే.. ఒక్కో ప్రయాణికుడిపై రూ.1,300 వరకు ఛార్జ్ పడనుంది. అంటే ప్రయాణ దూరం పెరిగే కొద్దీ టికెట్ ధర పెరుగుతుంది.

అంతర్జాతీయ ప్రయాణికులపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. సార్క్ దేశాలకు వెళ్లే విమానాలపై రూ.1,000 నుంచి రూ.3,000 వరకు ఛార్జ్ విధించనున్నారు. ఆఫ్రికా మార్గాల్లో రూ.6,000 వరకు, యూరప్ వెళ్లే విమానాలపై ఏకంగా రూ.10,000 వరకు అదనపు ఛార్జ్ ఉంటుంది.

ఇదీ చదవండి: జియో రీచార్జ్‌: 30 రోజుల ప్లాన్.. 25జీబీ డేటా!

Videos

నిన్నే అడుగుతున్న... పెనుకొండలో ఉషశ్రీ చరణ్ భారీ ధర్నా

రజినీతో క్లాష్ మిస్... దుల్కర్ తో క్లాష్ ఫిక్స్..

జూలైలోనే విమానం కూల్చేందుకు కుట్ర... సంచలన విషయాలు

రాయలసీమ ద్రోహి చంద్రబాబు

YSRCP నేతలను ఎన్నికల్లో పోటీ చేయకుండా కూటమి కుట్ర

బాల్కనీ నుంచి జారిన చిన్నారి.. చివరి క్షణంలో ఎలా కాపాడాడంటే!

సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో డెలివరీ బాయ్‌పై భార్యాభర్తల దాడి

ఫ్యాన్ కోసం సెక్యూరిటీని లెక్కచేయని ధావన్

తాట తీస్తాం చుట్టమల్లే డీప్ ఫేక్ పై నాగవంశీ వార్నింగ్

రాజకీయ ప్రయాణం బుక్ స్థితప్రజ్ఞుడు YS జగన్..

Photos

+5

మూవీ రిలీజ్ తర్వాత మళ్లీ ట్రెండింగ్‌లో నక్షత్ర (ఫొటోలు)

+5

ఎం.ఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్.. రష్మిక ఎమోషనల్ పోస్ట్ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్ కళ్యాణ్’మూవీ హీరోయిన్ మహిమ నంబియార్ (ఫొటోలు)

+5

యాంకర్ అనసూయ 'దేశీ గర్ల్' లుక్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్ : ఏపీలో ప్రసిద్ధి చెందిన అమ్మవారి ఆలయాలు...(ఫొటోలు)

+5

టెన్నిస్‌ కోర్టులో నటి వర్ష డిసౌజా.. (ఫొటోలు)

+5

రష్మిక రణబాలి లుక్‌.. అదిరిపోయిన స్టిల్స్(ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ భారత క్రికెటర్‌ శిఖర్ ధావన్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : దుర్గామాతకు జైకొడదాం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : సందడిగా దక్కన్‌ డెర్బీ మీట్‌ (ఫొటోలు)