Breaking News

తమిళ రాజకీయాల్లోకి మరో హీరో.. పొలిటికల్‌ ఎంట్రీకి సిద్ధమా?

Published on Mon, 10/05/2026 - 15:45

తమిళనాడు రాజకీయాల్లో సినీ ప్రముఖుల ఎంట్రీపై ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే హీరో విజయ్‌ రాజకీయాల్లోకి వచ్చి తన  పార్టీతో రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. మరోవైపు ప్రముఖ కొరియోగ్రాఫర్‌, నటుడు రాఘవ లారెన్స్‌ సైతం తాను రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు గతంలో ప్రకటించారు. తాజాగా ఈ జాబితాలోకి హీరో శివకార్తికేయన్‌ పేరు కూడా వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో శివకార్తికేయన్‌ తన అభిమానులతో ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదివారం చెన్నైలోని పోరూర్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి సుమారు 3 వేల మంది అభిమానులు, ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ నిర్వాహకులు హాజరయ్యారు. అయితే శివకార్తికేయన్‌ తన రాజకీయ ప్రవేశంపై ఈ సమావేశంలో ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు.

బాగా చదవండి. మంచి డబ్బు సంపాదించండి.
అభిమానులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఈ స్థాయికి రావడానికి మీరే కారణం. ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే మన లక్ష్యంపై స్పష్టత ఉండాలి. విమర్శించే వాళ్లు ఎప్పుడూ ఉంటారు. వాటిని పట్టించుకోకుండా మన లక్ష్యం దిశగా ముందుకు సాగాలి’ అని సూచించారు.

విద్యార్థులతో మాట్లాడుతూ. ‘బాగా చదవండి. మంచి డబ్బు సంపాదించండి. మీ కుటుంబానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. మనం ఎంత ఎక్కువ చదివితే.. మన ఆలోచనా విధానం అంత మెరుగవుతుంది. తద్వారా సామాజిక మాధ్యమాలకు కూడా కొంత దూరంగా ఉండొచ్చు’ అని అన్నారు.

భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా?
అయితే భారీ సంఖ్యలో అభిమానులతో సమావేశం నిర్వహించడం, వారికి లక్ష్యం, క్రమశిక్షణ వంటి అంశాలపై సూచనలు చేయడంతో శివకార్తికేయన్‌ రాజకీయ రంగ ప్రవేశంపై మరోసారి చర్చ మొదలైంది. ప్రస్తుతం ఆయన సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
 ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: ఈ వారం నామినేట్ అయింది వీళ్లేనా?
 

Videos

నిన్నే అడుగుతున్న... పెనుకొండలో ఉషశ్రీ చరణ్ భారీ ధర్నా

రజినీతో క్లాష్ మిస్... దుల్కర్ తో క్లాష్ ఫిక్స్..

జూలైలోనే విమానం కూల్చేందుకు కుట్ర... సంచలన విషయాలు

రాయలసీమ ద్రోహి చంద్రబాబు

YSRCP నేతలను ఎన్నికల్లో పోటీ చేయకుండా కూటమి కుట్ర

బాల్కనీ నుంచి జారిన చిన్నారి.. చివరి క్షణంలో ఎలా కాపాడాడంటే!

సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో డెలివరీ బాయ్‌పై భార్యాభర్తల దాడి

ఫ్యాన్ కోసం సెక్యూరిటీని లెక్కచేయని ధావన్

తాట తీస్తాం చుట్టమల్లే డీప్ ఫేక్ పై నాగవంశీ వార్నింగ్

రాజకీయ ప్రయాణం బుక్ స్థితప్రజ్ఞుడు YS జగన్..

Photos

+5

మూవీ రిలీజ్ తర్వాత మళ్లీ ట్రెండింగ్‌లో నక్షత్ర (ఫొటోలు)

+5

ఎం.ఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్.. రష్మిక ఎమోషనల్ పోస్ట్ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్ కళ్యాణ్’మూవీ హీరోయిన్ మహిమ నంబియార్ (ఫొటోలు)

+5

యాంకర్ అనసూయ 'దేశీ గర్ల్' లుక్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్ : ఏపీలో ప్రసిద్ధి చెందిన అమ్మవారి ఆలయాలు...(ఫొటోలు)

+5

టెన్నిస్‌ కోర్టులో నటి వర్ష డిసౌజా.. (ఫొటోలు)

+5

రష్మిక రణబాలి లుక్‌.. అదిరిపోయిన స్టిల్స్(ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ భారత క్రికెటర్‌ శిఖర్ ధావన్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : దుర్గామాతకు జైకొడదాం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : సందడిగా దక్కన్‌ డెర్బీ మీట్‌ (ఫొటోలు)