నిన్నే అడుగుతున్న... పెనుకొండలో ఉషశ్రీ చరణ్ భారీ ధర్నా
Breaking News
గోల్డ్ రేటు మళ్లీ పెరుగుతుందా?.. HSBC అంచనా ఇదే!
Published on Mon, 10/05/2026 - 15:14
బంగారం ధరల్లో ఈ ఏడాది ప్రారంభం నుంచి ఊహకందని హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఒక దశలో ఔన్సుకు 5,450 డాలర్ల వరకు చేరిన గోల్డ్, తర్వాత పరిస్థితులు మారడంతో సుమారు 3,942 డాలర్లకు పడిపోయింది.
పసిడి ధరలలో ఈ మార్పులు రావడానికి ప్రధాన కారణం.. ఇరాన్ ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదల, అమెరికా డాలర్ బలపడటం, బాండ్ యీల్డ్స్ పెరగడం. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచవచ్చనే అంచనాలు.. పెట్టుబడిదారులను బంగారం నుంచి ఇతర పెట్టుబడుల వైపు మళ్లించాయి.
ప్రస్తుతం బంగారం ధరలపై ఎక్కువ ప్రభావం చూపుతున్న అంశం అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలే. వడ్డీ రేట్లు పెరిగితే బంగారం కంటే.. ఎక్కువ వడ్డీ వచ్చే పెట్టుబడులు ఆకర్షణీయంగా మారతాయి. ఈ కారణంగానే ప్రస్తుతం గోల్డ్ రేటు చాలా వరకు తగ్గుతోంది. అయితే అనుకున్న విధంగా ఫెడ్ వడ్డీ రేట్లు పెరిగే అవకాశం లేదని హెచ్‌ఎస్‌బీసీ భావిస్తోంది.
ఫెడ్ వడ్డీ రేట్లను పెంచకపోతే.. పెట్టుబడిదారులు మళ్లీ గోల్డ్ వైపు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.
ఇదే సమయంలో.. కేంద్రబ్యాంకులు విరివిగా బంగారం కొనుగోలు చేయడం కూడా ధరల మీద ప్రభావం చూపుతుంది. ఇప్పటికే అనేక దేశాల కేంద్ర బ్యాంకులు తమ నిల్వలను పెంచుకోవడానికి గోల్డ్ కొనుగోలు చేస్తున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి పెరుగుతున్న సమయంలో బంగారం ఒక సురక్షితమైన ఆస్తిగా కనిపిస్తోంది. అలాగే భారత్, చైనా దేశాల్లో బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. స్టాక్ మార్కెట్ నష్టాల్లో ఉన్నప్పుడు బంగారం ఒక ప్రత్యామ్నాయ పెట్టుబడిగా మారుతోంది.
ఇదీ చదవండి: పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సీరియస్.. ఈ సేవలన్నీ బంద్!
ఈ రోజు బంగారం ధరలు ఇలా..
భారతదేశంలో ఈ రోజు (సోమవారం) బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు స్థిరంగా ఉంది. కొత్త రేట్లు ఏ నగరంలో ఎలా ఉన్నాయో ఈ కింద చూడవచ్చు.
Tags : 1