ఒళ్ళు దగ్గర పెట్టుకోండి..! బాబు, పవన్ కు రోజా స్ట్రాంగ్ వార్నింగ్
Breaking News
‘మాకు పిల్లలు వద్దు.. ఇంట్లో రెండు కుక్కలు ఉన్నాయి’
Published on Fri, 10/02/2026 - 17:56
పెళ్లయిన తర్వాత పిల్లల గురించి ప్రశ్నలు ఎదుర్కోవడం సాధారణమే. అయితే పిల్లలు కావాలా? వద్దా? అనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని నటి వరలక్ష్మి శరత్‌కుమార్ స్పష్టం చేశారు. 2024లో ముంబైకి చెందిన వ్యాపారవేత్త, గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‌దేవ్‌ను వివాహం చేసుకున్న ఆమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను పిల్లలను కనాలని అనుకోవడం లేదని తెలిపారు.
రెండు కుక్కలు ఉన్నాయి..
‘నాకు పిల్లలు వద్దని నేనే వ్యక్తిగతంగా నిర్ణయించుకున్నాను. పిల్లలు పుట్టరని కాదు.. నాకు పిల్లలు వద్దు. ఇది చాలా స్పష్టమైన నిర్ణయం. నా భర్త కూడా అదే ఆలోచనతో ఉన్నారు. ఆయనకు గత వివాహం ద్వారా ఇప్పటికే ఒక కుమార్తె ఉంది. నేను ఆమెను ఎప్పుడూ నా కుమార్తెలాగే చూస్తాను. అలాగే మాకు రెండు కుక్కలు ఉన్నాయి. వాటిని కూడా నా పిల్లల్లాగే భావిస్తాను.
పిల్లలను పెంచడం అంటే ఎన్నో బాధ్యతలతో కూడుకున్న విషయం. ఆ బాధ్యతలకు సిద్ధంగా లేకపోతే పిల్లలను కనకపోవడమే మంచిది. అలా ఆలోచించడం కూడా ఒక మంచి పేరెంటింగ్ నిర్ణయమే’ అని పేర్కొన్నారు. ఇప్పుడీ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఇదీ చదవండి: కొడుకుతో కత్రినా ఆనందం.. ‘ఇంతకంటే ఇంకేం కావాలి’
Tags : 1