Breaking News

అమ్మా.. రూ. 12 లక్షలు కాదు.. రూ.1.2 కోట్లు! వైరల్‌గా ఐఐటీ గ్రాడ్యుయేట్‌ స్టోరీ..

Published on Fri, 10/02/2026 - 16:05

సాధారణ కుటుంబ నేప‍థ్యం నుంచి వచ్చిన..కలలో కూడా ఊహించనంత ప్యాకేజ్‌ అందుకుని తల్లిదండ్రులనే సంభ్రమాశ్చర్యాలకు లోనుచేశాడు. అతడు తన వేతనం ఎంతో చెబుతున్నప్పుడు తల్లి అమాయకంగా అడిగిన ప్రశ్న..ప్రతి ఒక్కరి మనసుని కదలిస్తుంది. ఆ యువకుడి విజయగాథ పేదరికం ప్రతిభకి అడ్డంకి కాదని నిరూపించిన స్ఫూర్తిదాయక కథనం.

అతడే శశాంక్‌ అగర్వాల్‌. రాజస్థాన్‌లోని బారన్‌కి చెందిన శశాంక్‌ కుటుంబ నేపథ్యం ఆర్థికంగా అంతంత మాత్రమే. అతడి తండ్రి నెలకు రూ. 3 వేలు సంపాదించేవారు. కానీ కుమారుడిని మాత్రం తమ శక్తికి మించి మంచి విద్యను అందించేలా చదవించడం విశేష. ఆ కష్టమే ఇవాళ ఫలించి ఎదిగొచ్చిన కొడుకుగా, మంచి ప్రయోజకుడిగా నిలబెట్టింది. అతను ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆల్‌ ఇండియా ర్యాంక్‌ సాధించి ఐఐటీ బొంబాయిలో చదువుకుని టెక్నాలజీ అండ్‌ క్వాంటిటేటివ్ ఫైనాన్స్‌లో పనిచేశాడు. 

ఆ తర్వాత అతనికి ప్రతిష్టాత్మక క్వాడైలో కంపెనీలో ఏకంగా రూ. 1.2 కోట్లు ప్యాకేజ్‌ పొందాడు. ఆ విషయాన్ని తన తల్లితో చెప్పగానే ఆమె రూ. 12 లక్షలా అని అమాయకంగా అడగగా..లేదు అమ్మా..రూ.1 కోటి 20 లక్షలు అని బదులివ్వడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. అరకొర సంపాదనతో గడిపే ఆ పేరెంట్స్‌ తమ బిడ్డ ఆ రేంజ్‌లో వేతనం సంపాదించడాన్ని కలా నిజమా అని ఉబ్బితబ్బిబవుతున్నారు. శశాంక్‌ మాత్రం ఈ అద్భుతమైన ప్యాకేజ్‌ తన కష్టానికి వచ్చిన ఫలితం అని అంటున్నాడు. 

ప్రతిదానికి కష్టపడాలని..అదే మనల్ని విజయతీరాలకు చేరుస్తుందని అంటుఉన్నాడు. తాను కూడా ఇంటర్‌లో బాగా ఆటలు ఆడేవాడినని, మొబైల్‌ గేమ్స్‌ అంటే పిచ్చి అని చెప్పుకొచ్చాడు. ఒక దశలో తన ప్రిపరేషన్‌ చాలా అసంపూర్ణంగా ఉండేదని, గుర్తుచేసుకున్నాడు. అయితే గురవులు, తల్లిదండ్రలు మార్గదర్శకత్వంలో తన దృక్పథం మార్చుకుని లక్ష్యంపై ఫోకస్‌ పెట్టినట్లు చెప్పుకొచ్చాడు. తనలా ఇంటర్‌లో సరిగా ఫోకస్‌ పెట్టలేనట్లయితే బాధపడుతూ కూర్చోవద్దు..ప్రయత్నించండి, కనీసం బాగా చదవి ఆ బాధను అధిగమించేలా చూడండి అని సూచిస్తున్నాడు. 

ఏ ప్రయత్నం చేయకుండా వృధా చేశాననే బాధ కెరీర్‌లో ఒకానొక దశలో ఎవ్వరికైనా కలుగుతుంటుంది. దానికి ఒక్కటే మార్గం కష్టపడి చదవడం ద్వారానే ఆ సమస్యను అధిగమించగలరని అంటున్నాడు. అలాగే చదవడానికి ఎప్పటికీ ఆలస్యం ఉండదు. కేవలం మన దృక్పథమే మారాలని నొక్కి చెబుతున్నాడు.

ఇదీ చదవండి: Swara Bhasker: పెళ్లికి ముందే రెండుసార్లు IVF ఫెయిల్‌.. పెళ్లైన తొమ్మిది నెలల్లోనే బిడ్డ..

 

Videos

ఒళ్ళు దగ్గర పెట్టుకోండి..! బాబు, పవన్ కు రోజా స్ట్రాంగ్ వార్నింగ్

టైగర్ టైగర్ అని అరవకండయ్యా బాబు.. పవన్ కళ్యాణ్ కు తెలిస్తే బోను పంపించి..

ధురంధర్ హీరోతో కల్యాణి..

మహిళల 75 కిలోల బాక్సింగ్ లో లవ్లీనాకు స్వర్ణం

ఆ క్షణం నేను ఆలోచించింది ఇదే.. పైలెట్ స్మిట్‌ మచ్చార్‌ తో మోదీ వీడియో కాల్

నగరిలో చంద్రబాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేత

తన స్వార్ధం కోసం నన్ను ఇరికించాడు

బీసీ రిజర్వేషన్ల విషయంలో జగన్ ను ప్రశ్నిస్తే బాబుకే నష్టం..

కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ దంపతులు

10,000 అడుగుల ఎత్తులో మనుషులే లేని చోట రాతి గోడలు

Photos

+5

అందంతో ఆకట్టుకుంటున్న కయాదు.. ఫొటోలు వైరల్‌

+5

అదిరిపోయే లుక్స్‌తో రాశి ఖన్నా..(ఫొటోలు)

+5

సెప్టెంబర్ జ్ఞాపకాలు షేర్ చేసిన అనసూయ.. (ఫోటోలు)

+5

చుడీదార్‌లో బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య.. (ఫోటోలు)

+5

కాంతారాకు ఏడాది.. హీరోయిన్‌ ఎమోషనల్‌ పోస్ట్ (ఫొటోలు)

+5

నడవలేని స్థితిలో సీనియర్ నటి శారద.. ఇలా మారిపోయిందేంటి? (ఫోటోలు)

+5

ఎల్లో కలర్ శారీలో విమలా రామన్ స్టన్నింగ్‌ లుక్స్‌.. (ఫొటోలు)

+5

చాన్నాళ్లకు కనిపించిన విజయ్‌ భార్య‌ సంగీత, కూతురు దివ్య (చిత్రాలు)

+5

తిరుపతి : వైభవంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర (ఫొటోలు)

+5

తెలంగాణ : నిర్మల్ లో సందడి చేసిన ప్రముఖ నటి శ్రీలీల (ఫొటోలు)