ఒళ్ళు దగ్గర పెట్టుకోండి..! బాబు, పవన్ కు రోజా స్ట్రాంగ్ వార్నింగ్
Breaking News
ఫ్లైట్ అటెండెంట్‌గా 12 ఏళ్ల చిన్నారి..! ఎట్టకేలకు నెరవేరిన కల..
Published on Fri, 10/02/2026 - 12:14
ఓ చిన్నారి ఫ్లైట్ అటెండెంట్‌గా తన కోరిక నెరవేర్చుకుంది. ఇదేంటి ఇంత చిన్నవయసులో ఫ్లైట్ అటెండెంట్‌గా సేవలా అని విస్తుపోకండి. ఇది ఉద్యోగం కాదు..చావు అంచులదాక వెళ్లొచ్చి..అనారోగ్యాన్ని జయించినందుకు గుర్తుగా ఇలా ఫ్లైట్ అటెండెంట్‌గా సేవలందిస్తూ సెలబ్రేట్ చేసుకుంది తన పునరాగమనాన్ని. ఆమె కథ ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్న వాళ్లకు స్ఫూర్తి. ఆ చిన్నారి కథేంటో చూసేద్దామా..!
ఆ చిన్నారే 12 ఏళ్ల త్రిషా ఓంగ్. ఆమె ఒకరోజు పాటు క్వాంటాస్ ఫ్లైట్ అటెండెంట్‌గా మారింది. ఆమె బాల్యం అంతా అనారోగ్య సమస్యతో పోరాడటంతోనే సాగింది. ఆ చిన్నారి త్రిషా కేవలం నాలుగేళ్ల ప్రాయంలో తీవ్రమైన కిడ్నీ సమస్యలను ఎదుర్కొంది. జీవితం చాలా కష్టంగా ఉండేది. ప్రతి నిమిషం ఆస్పత్రులు, చికిత్సలు, నొప్పిలతో నరకంగా ఉండేది. అంతటి వేదనను తట్టుకోవడమే కాదు..ఇటీవలే కిడ్నీ మార్పిడి చికిత్స చేయించుకుని..ప్రాణాంత వ్యాధి నుంచి బయటపడింది.
చివరకు తనకలను నేరవేర్చుకుంది. అందుకు మేక్ ఏ విష్ ఆస్ట్రేలియా అండ్ క్వాంటస్ సహకారం అందించింది. ఇంతకీ ఏంటా చిన్నారి చిరు కోరిక అంటే ఫ్లైట్ అటెండెంట్ అవ్వడం ఆమె ఆశయం. ఆ కలన నెరవేర్చుకునేలా సదరు విమానాయన సంస్థ సహకారం అందించింది. అలా ఒక్కరోజు ఫ్టైట్ అటెండెంట్‌గా త్రిషా ఆ విమానంలో సేవలందించింది. అందుకోసం ప్రత్యేకంగా కుట్టిన అధికారిక క్వాంటాస్ యూనిఫాంలో వచ్చి మరి శిక్షణ, అత్యవసర విధానాల నుంచి విమానం నడపడంలో నైపుణ్యం,ప్రయాణికులకు సేవ చేయడం, సహాయపడటం వరకు ప్రతీది ఆస్వాదించిందామె.
ఈ మేరకు సదరు ఎయిర్‌లైన్ అందుకు సంబంధించిన ఫోటో తోపాటు "ఒక కోరిక. ఒక జత రెక్కలు. గుర్తుండిపోయే రోజు," అనే క్యాప్షన్ జోడించి మరి ఇలా రాసుకొచ్చింది. ఫ్లైట్ అటెండెంట్‌గా ఆమె ప్రతి క్షణాన్ని ఆస్వాదించింది. చివరి దశ కిడ్నీ వైపల్యాన్ని అధిగమించి, విజయవంతంగా అవయవ మార్పిడి చేయించుకున్న ఆ చిన్నారి బలం, సానుకూలదృక్పథం ప్రతి ఒక్కరిని ప్రేరరేపించింది.
ఆమె కోరికను నెరవేర్చడంలో భాగమైనందుకు మేము గర్వపడుతున్నాం". అని సదరు ఎయిర్‌లైన్ పేర్కొంది పోస్ట్‌లో. కాగా, చిన్నారి త్రిష అడిలైడ్‌కు వెళ్లే ఒక వాణిజ్య విమానంలో బయలుదేరడానికి ముందు, ఫ్లైట్అటెండెంట్గా నిర్వర్తించాల్సిన పనుల్లో సహాయపడటంతో పాటు, విమానం ఎక్కుతున్న ప్రయాణికులను పలకరించి, భద్రతా ప్రకటనలు చేసి, క్యాబిన్లో చిరుతిండి అందించడంలో కూడా సహాయపడటం విశేషం.
ఇదీ చదవండి: అక్కడ దేవుడికి వ్యర్థాల నైవేద్యం..! ఆ ఆచారం వెనుకు అసలు కథ ఇదే..
Tags : 1