Breaking News

హైదరాబాద్‌కు ‘డోర్‌డాష్‌’.. 3000 ఉద్యోగాలు

Published on Wed, 09/30/2026 - 17:09

అంతర్జాతీయ ఫుడ్ డెలివరీ, లాజిస్టిక్స్ దిగ్గజం ‘డోర్‌డాష్‌’ భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. దేశంలోనే తొలి డెవలప్‌మెంట్ సపోర్ట్ కేంద్రాన్ని హైదరాబాద్‌లో బుధవారం ప్రారంభించింది. ఈ నూతన కార్యాలయాన్ని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు.

ఐటీ, గ్లోబల్ కార్యకలాపాలకు ఊతం

ప్రస్తుతం 500 మంది నిపుణులతో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ కేంద్రం రాబోయే కొద్ది సంవత్సరాల్లో తన ఉద్యోగుల సంఖ్యను 3,000 మార్కుకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ గ్లోబల్ సెంటర్ ప్రధానంగా రెండు విభాగాలపై దృష్టి సారిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా డోర్‌డాష్‌కి ఇది మూడో అతిపెద్ద కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఇంటిగ్రిటీ గ్లోబల్ సర్వీస్ సెంటర్ కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 5.6 కోట్లకు పైగా నెలవారీ యాక్టివ్ యూజర్లకు ఈ కేంద్రం ద్వారా సాంకేతిక సేవలు అందనున్నాయి.

హైదరాబాద్‌ గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్: మంత్రి

ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ‘ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న డోర్‌డాష్ సంస్థ వృద్ధికి హైదరాబాద్‌ను ఎంచుకోవడం నగరానికి దక్కిన గొప్ప గుర్తింపు. ఇది లోకల్ డిజిటల్ కామర్స్, హైపర్‌లోకల్ ఎకోసిస్టమ్‌ను మరింత బలోపేతం చేస్తుంది. స్విగ్గీ, జొమాటో వంటి భారతీయ యాప్‌లకు స్ఫూర్తినిచ్చిన డోర్‌డాష్ హైదరాబాద్‌లో అడుగుపెట్టడం ఇక్కడి ఐటీ ప్రతిభకు నిదర్శనం’ అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఈరోజు పెరిగినా రూ.లక్షన్నర కిందే బంగారం!

#

Tags : 1

Videos

వివేకా హత్య కేసులో ముసుగు తీసిన పచ్చ గొడ్డలి

ఆర్మీ జవాన్ కిషన్ మృతిపై YS జగన్ దిగ్భ్రాంతి

ప్రాణాలకు తెగించి అడ్డుకున్న ఇండియన్ పైలట్.. 180 మంది సేఫ్

9/11 తరహాలో కుట్ర జరిగిందా..? ఫ్లై దుబాయ్ ఎమర్జెన్సీ లాండింగ్ లో సంచలన విషయాలు

ఇదంతా నువ్వే చేయిస్తున్నావ్ అని నాకు తెలుసు.. వివేకా అల్లుడా నీకే చెప్తున్నా

ఫిలిం ఛాంబర్ లో సుమలత రచ్చ రచ్చ

వైఎస్ జగన్ ను కలిసిన లంకపల్లి రైతులు

జానీ మాస్టర్ ఏం తప్పు చేశాడు? చెప్పు తీసుకుని తరిమి తరిమి కొడతాం...

కోహ్లి నా బావ.. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్

రజనిపై పోలీసుల తీరు.. ఇచ్చిపడేసిన విశాఖ అడ్వకేట్స్

Photos

+5

భారత్‌ వర్సెస్‌ విండీస్‌ మ్యాచ్ హైలైట్స్ ఫోటోలు!

+5

హైదరాబాద్ ధూల్ పేట్ లో దుర్గమ్మ విగ్రహాలు (ఫొటోలు)

+5

డ్యాన్స్ అకాడమీలో మెరిసిన హీరోయిన్స్ నివేదా, ఈషా రెబ్బా.. ఫోటోలు

+5

'డోంట్ ‍ట్రబుల్ ద ట్రబుల్'తో రాబోతున్న ఈ పాప ఎవరో తెలుసా? (ఫొటోలు)

+5

నటుడు ప్రియదర్శిని అభినందించిన మాజీ మంత్రి హరీశ్ రావు (ఫొటోలు)

+5

నల్లటి చీరలో 'తత్వం' సినిమా హీరోయిన్ దశ్విక... ఈమె గురించి తెలుసా?

+5

చెమట చిందిస్తూ.. కండలు చూపిస్తూ తిలక్‌ వర్మ (ఫొటోలు)

+5

'డిసి' ఫేమ్ వామికా గబ్బి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

లేత గులాబీ రంగు చీరలో నిహారిక మెరుపులు (ఫొటోలు)

+5

వైరల్ మూవీ.. కీర్తి సురేశ్ 'డోరోతి' జ్ఞాపకాలు (ఫొటోలు)