వివేకా హత్య కేసులో ముసుగు తీసిన పచ్చ గొడ్డలి
Breaking News
తెలుగు ఇండస్ట్రీ నా తల్లి లాంటిది: సుమ ఎమోషనల్ పోస్ట్
Published on Wed, 09/30/2026 - 17:06
టాలీవుడ్‌లో యాంకర్ సుమ పేరు తెలియనివాళ్లు ఉండరు. ఆమె స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తెలుగింటి కోడలిగా అడుగుపెట్టింది. టాలీవుడ్‌లో యాంకరింగ్ చేస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకుంది. తెలుగులో సుమ లేకుంటే ఈ ఈవెంట్‌లో ఏదో మిస్సయినట్లు అనిపించేలా గుర్తింపు తెచ్చుకుంది. అలా స్టూడెంట్ నంబర్ వన్ సినిమాతో మొదలైన ఆమె జర్నీ నేటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సుమ కనకాల ఎమోషనల్ పోస్ట్ చేసింది.
తాజాగా ఫాహద్ ఫాజిల్ నటించిన డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ఈవెంట్‌లో సుమ జర్నీ వీడియోను ప్రదర్శించారు. ఈ వేదికపై ప్రదర్శించిన ఆడియో విజువల్ నన్ను పాత జ్ఞాపకాలలోకి తీసుకువెళ్లిందని సుమ ఎమోషనలైంది. స్టూడెంట్ నెం 1 గా 25 ఏళ్లు.. నేను ఫిల్మ్ ఈవెంట్స్ హోస్ట్‌గా 25 ఏళ్లు.. ఈ సందర్భంగా రాజమౌళి సార్‌కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఆ రోజు నా గురించి మీరు చెప్పిన ఈ మాటలు నా గ్రాడ్యుయేషన్ వేడుకలా అనిపించాయని భావోద్వేగానికి గురైంది.
నా ఆడియో విజువల్ చేయించడానికి మీరు పడిన శ్రమకు.. నా ప్రోగ్రామ్ షీట్‌లో దాచడానికి మీరు చేసిన అదనపు ప్రయత్నానికి లక్ష్మి అండ్ నా బృందానికి ధన్యవాదాలు.. అలాగే స్టూడెంట్ నెం 1 హీరో ఎన్టీఆర్.. నా ప్రియమైన భర్త రాజీవ్ కనకాలకి అభినందనలు అంటూ రాసుకొచ్చారు. రాజీవ్‌తో పాటు గొప్ప వ్యక్తులందరినీ నా జీవితంలోకి తీసుకువచ్చిన తెలుగు చిత్ర పరిశ్రమకు, తెలుగు సినీ అభిమానులకు ధన్యవాదాలు.. మీరు లేకపోతే నేను ఒక హోస్ట్‌గా ఇక్కడ ఉండేదాన్ని కాదు. నన్ను తెలుగు నేర్చుకునేలా చేసి, ఏ కెరీర్‌కైనా కష్టపడటం, పట్టుదల, నిరంతర అభ్యాసమే కీలకం అని నేర్పిన ఇండస్ట్రీ నాకు తల్లితో సమానమని సుమ రాసుకొచ్చారు. ఎల్లప్పుడూ నీ ఉత్సాహాన్ని పంచుతూ.. అమ్మకు పని చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్న రోషన్, మానస్‌కు కూడా ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాజమౌళితో దిగిన ఫోటోను పంచుకున్నారు.
The av played on dttt stage took me through a memory lane . 25yrs of student no 1 and 25yrs of me hosting film events . My heartfelt thanks to @ssrajamouli , these words about me coming from you felt like my graduation ceremony sir and @ssk1122 we are gen z🤩 , Walls and trends… pic.twitter.com/E9hNuGjtje
— Suma Kanakala (@ItsSumaKanakala) September 30, 2026
Tags : 1