వివేకా హత్య కేసులో ముసుగు తీసిన పచ్చ గొడ్డలి
Breaking News
రెండు దశాబ్దాల సెలబ్రిటీ టాక్ షోకు ఎండ్ కార్డ్.. హోస్ట్ ఎమోషనల్
Published on Wed, 09/30/2026 - 15:56
బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తన 22 ఏళ్ల టాక్ షోకు గుడ్ బై చెప్పనున్నారు. దాదాపు రెండు దశాబ్దాలక పైగా సాగి ఈ టాక్ షోకు కరణ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ పాపులర్ సెలబ్రిటీ టాక్ షోలో ఎన్నో కాంట్రవర్సీలు, ఆసక్తికరమైన కామెంట్లు, వైరల్ మూమెంట్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. అయితే, ఇప్పుడు ఈ షో ప్రయాణానికి ముగింపు పలకనున్నట్లు కరణ్ జోహార్ తాజాగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎమోషనల్ వీడియోను పంచుకున్నారు. ఈ టాక్ షోతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
కరణ్ వీడియోలో మాట్లాడుతూ..'2004లో నేను సెలబ్రిటీల టాక్ షో ప్రారంభించాలని మా నాన్నతో చెప్పా. అప్పుడాయన చాలా కంగారు పడ్డారు. ఇలా చేస్తే నీకు డబ్బులు ఎక్కడనుంచి వస్తాయన్నారు. అదే నెలలో ఆయన కన్నుమూశారు. ఆయనతో చివరిసారిగా చర్చించిన ప్రాజెక్ట్ ఇదే. కొన్ని ప్రయాణాలను మనం ముగించాలని అనుకోం. కానీ, వాటికి కూడా ఎండ్‌కార్డు వేసే సమయం వస్తుంది. కాఫీ విత్ కరణ్ నా జీవితంలో ఎంతో ముఖ్యం. నాకు ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చింది. ఈ టాక్‌షోపై వివాదాలు వచ్చినప్పటికీ.. ఆదరణ మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. నేను బయట కనిపించినప్పుడు నా సినిమాల అప్‌డేట్‌ల కంటే.. ఈ టాక్ షో తర్వాతి సీజన్ ఎప్పుడనే అందరూ అడుగుతారు. అలాంటి ఈ గొప్ప షోను ఇక ముగిస్తున్నా' అంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ షో చివరి సీజన్ అక్టోబర్ 14 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. ఇప్పటిదాకా ఈ షోలో 8 సీజన్‌లు, 161 ఎపిసోడ్‌లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తైనట్లు కరణ్ వెల్లడించారు.
Tags : 1