వివేకా హత్య కేసులో ముసుగు తీసిన పచ్చ గొడ్డలి
Breaking News
అదానీ కేసును క్లోజ్ చేసిన సెబీ
Published on Wed, 09/30/2026 - 09:16
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వినోద్ అదానీపై కేసును ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఆఫ్‌షోర్ ఫండ్స్‌ను నియంత్రిస్తున్నారనేందుకు ఎలాంటి ఆధారాలూ లభించలేదని తెలియజేసింది. డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీకి సోదరుడైన వినోద్ ఆఫ్‌షోర్ ఫండ్స్ ద్వారా నాలుగు గ్రూప్ కంపెనీలలో ఇన్వెస్ట్ చేశారన్న అభియోగాలు రుజువుకాలేదని స్పష్టం చేసింది.
వినోద్ అదానీతోపాటు మరో 11మందిపై అక్రమాల ఆరోపణ కేసును ఉపసంహరిస్తున్నట్లు 81 పేజీల తుది ఆదేశాలలో సెబీ పేర్కొంది. రెండు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు ఎమర్జింగ్ ఇండియా ఫోకస్ ఫండ్స్(ఈఐఎఫ్‌ఎఫ్), ఈఎం రిసర్జెంట్ ఫండ్(ఈఎంఆర్) పెట్టుబడి నిర్ణయాలను వినోద్ ప్రభావితం చేయలేదని తమ దర్యాప్తులో తేలినట్లు వివరించింది. అంతేకాకుండా అదానీ పవర్‌లో ఒపల్ ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టుబడి నిర్ణయాలలోనూ వినోద్ పాత్ర ఉన్నట్లు వెల్లడికాలేదని సెబీ హోల్‌టైమ్ సభ్యులు కమలేష్ చంద్ర వార్ష్‌నీ జారీ చేసిన ఆదేశాలలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కీలక వడ్డీ రేటు పెంపునకు ఆర్‌బీఐ సిద్ధం?
Tags : 1