Breaking News

స్పామర్స్‌పై ట్రాయ్‌ కొరడా

Published on Wed, 09/30/2026 - 08:36

స్పామ్‌ కాల్స్‌ని కట్టడి చేసే దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది. ఇందులో భాగంగా, వినియోగదారులు ప్రత్యేకంగా ఫిర్యాదులు చేయాల్సిన అవసరం లేకుండా, అలాంటి స్పామర్స్‌ని సొంత ఏఐ ఆధారిత కాలర్‌ ఐడీ సిస్టం ద్వారా గుర్తించి, తగు చర్యలు తీసుకోవాలని టెల్కోలను ఆదేశించింది. దీనికి సంబంధించి సవరించిన టెలికం కమర్షియల్‌ కమ్యూనికేషన్స్‌ కస్టమర్‌ ప్రిఫరెన్స్‌ నిబంధనల నోటిఫికేషన్‌ ప్రకారం స్పామర్‌గా గుర్తించిన వారి వివరాల ధ్రువీకరణ (కేవైసీ) ప్రక్రియను టెల్కోలు మళ్లీ మొదటినుంచి చేపట్టాల్సి ఉంటుంది.

నిబంధనలను అతిక్రమించే వారి ఫోన్‌ కనెక్షన్‌ను అవసరమైతే డిస్కనెక్ట్‌ చేయాలి. పరిస్థితిని బట్టి దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు కూడా చేయాలి. గెజిట్‌ నోటిఫికేషన్‌ అనంతరం, సవరించిన నిబంధనలు 60–90 రోజుల వ్యవధిలో దశలవారీగా అమల్లోకి వస్తాయి. నిబంధనల ప్రకారం ఏదైనా ఇన్‌కమింగ్‌ కాల్‌ను ఏఐ ‘అనుమానాస్పద స్పామ్‌’ అని గుర్తించిన పక్షంలో దాన్ని అందుకున్న టెలికం సంస్థ, ఆ కాల్‌ను పంపిన టెల్కోకు (ఓఏపీ) వివరాలను అందించాల్సి ఉంటుంది. స్పామ్‌ కాల్‌ని గుర్తించిన రెండు గంటల వ్యవధిలో ఇది జరగాలి. సదరు ఓఏపీ, తమకు ఫిర్యాదు వచ్చిన ఒక్క రోజు వ్యవధిలో ఆ కాల్‌ చేసిన వారి కేవైసీ వివరాలను ఇతర టెలికం ఆపరేటర్లతో షేర్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆ తర్వాత టెల్కోలన్నీ కూడా గత పది రోజుల వ్యవధిలో సందేహాస్పద స్పామర్‌తో కనెక్ట్‌ అయి ఉన్న ఇతర కనెక్షన్లేవైనా ఉన్నాయేమో తమ తమ సిస్టమ్‌లలో పరిశీలించాలి. అయిదు లేదా అంతకు మించి సీఎల్‌ఐలను (కాల్డ్‌ లైన్‌ ఐడెంటిఫికేషన్‌) గుర్తించిన పక్షంలో అన్ని ఓఏపీలు కలిసి చర్య తీసుకోవాలి. నిబంధనల ప్రకారం మొదటి ఉల్లంఘనకు స్పామర్‌కి అన్ని టెల్కోలు 15 రోజుల పాటు సేవలు నిలిపివేస్తాయి. తదుపరి మళ్లీ ఉల్లంఘిస్తే సిమ్‌లు మొదలైన వాటిని ఏడాది పాటు డిస్కనెక్ట్‌ చేస్తాయి. ఈ వ్యవధిలో ఆ స్పామర్‌ను అన్ని టెల్కోలు బ్లాక్‌లిస్ట్‌లో ఉంచి, కొత్తగా ఎలాంటి టెలికం వనరులను ఇవ్వవు. అయితే, అత్యవసర సేవలకు మినహా ఔట్‌గోయింగ్‌ సేవలు ఉండని టెలిఫోన్‌ నంబరు మాత్రం ఇస్తాయి.  

కాల్‌ బ్లాకింగ్‌..

కాల్‌ మేనేజ్‌మెంట్‌ యాప్‌లు కాకుండా వినియోగదారులు తమ సొంత విచక్షణ మేరకు కాల్స్‌ని బ్లాక్‌ చేసేందుకు ఉపయోగపడే ఆప్షన్‌ కూడా ఉంటుంది. అన్ని కేటగిరీలకు చెందిన టెలీమార్కెటింగ్‌ కాల్స్‌ని వద్దనుకుంటే, 1909 నంబరుకు బ్లాక్‌ ప్రొమో(BLOCK PROMO) అనే కోడ్‌ని పంపించాలి. దీనివల్ల వాణిజ్యపరమైన, ప్రభుత్వపరమైన లావాదేవీలు, సర్వీసులకు సంబంధించిన కాల్స్‌కి ఎలాంటి ఆటంకం ఉండదు.

ఇదీ చదవండి: కీలక వడ్డీ రేటు పెంపునకు ఆర్‌బీఐ సిద్ధం?

#

Tags : 1

Videos

వివేకా హత్య కేసులో ముసుగు తీసిన పచ్చ గొడ్డలి

ఆర్మీ జవాన్ కిషన్ మృతిపై YS జగన్ దిగ్భ్రాంతి

ప్రాణాలకు తెగించి అడ్డుకున్న ఇండియన్ పైలట్.. 180 మంది సేఫ్

9/11 తరహాలో కుట్ర జరిగిందా..? ఫ్లై దుబాయ్ ఎమర్జెన్సీ లాండింగ్ లో సంచలన విషయాలు

ఇదంతా నువ్వే చేయిస్తున్నావ్ అని నాకు తెలుసు.. వివేకా అల్లుడా నీకే చెప్తున్నా

ఫిలిం ఛాంబర్ లో సుమలత రచ్చ రచ్చ

వైఎస్ జగన్ ను కలిసిన లంకపల్లి రైతులు

జానీ మాస్టర్ ఏం తప్పు చేశాడు? చెప్పు తీసుకుని తరిమి తరిమి కొడతాం...

కోహ్లి నా బావ.. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్

రజనిపై పోలీసుల తీరు.. ఇచ్చిపడేసిన విశాఖ అడ్వకేట్స్

Photos

+5

భారత్‌ వర్సెస్‌ విండీస్‌ మ్యాచ్ హైలైట్స్ ఫోటోలు!

+5

హైదరాబాద్ ధూల్ పేట్ లో దుర్గమ్మ విగ్రహాలు (ఫొటోలు)

+5

డ్యాన్స్ అకాడమీలో మెరిసిన హీరోయిన్స్ నివేదా, ఈషా రెబ్బా.. ఫోటోలు

+5

'డోంట్ ‍ట్రబుల్ ద ట్రబుల్'తో రాబోతున్న ఈ పాప ఎవరో తెలుసా? (ఫొటోలు)

+5

నటుడు ప్రియదర్శిని అభినందించిన మాజీ మంత్రి హరీశ్ రావు (ఫొటోలు)

+5

నల్లటి చీరలో 'తత్వం' సినిమా హీరోయిన్ దశ్విక... ఈమె గురించి తెలుసా?

+5

చెమట చిందిస్తూ.. కండలు చూపిస్తూ తిలక్‌ వర్మ (ఫొటోలు)

+5

'డిసి' ఫేమ్ వామికా గబ్బి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

లేత గులాబీ రంగు చీరలో నిహారిక మెరుపులు (ఫొటోలు)

+5

వైరల్ మూవీ.. కీర్తి సురేశ్ 'డోరోతి' జ్ఞాపకాలు (ఫొటోలు)