Konda Surekha: వాళ్లని చిత్తు చిత్తుగా కొడతా..
Breaking News
మహేశ్‌బాబు, కృష్ణ కలిసి ఫైట్ చేస్తే ఎలా ఉంటుదో తెలుసా..?
Published on Tue, 09/29/2026 - 15:13
ఏఐ వచ్చాక అభిమానాన్ని చాటుకునేందుకు కొత్త కొత్త మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. కొందరు ఏఐని మంచి పనులకు ఉపయోగిస్తుంటే.. మరికొందరు తమ అభిమాన హీరోలను తమకు నచ్చిన విధంగా చూపించేందుకు వినియోగిస్తున్నారు. ముఖ్యంగా సినీ అభిమానులు ఏఐ సాయంతో తమ అభిమాన నటులకు సంబంధించిన ప్రత్యేక వీడియోలను రూపొందించి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు.
తాజాగా సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, ఆయన తండ్రి కృష్ణకు సంబంధించిన ఓ ఏఐ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇందులో తండ్రీకొడుకులను ఒకే ఫ్రేమ్‌లో యాక్షన్ సన్నివేశాల్లో చూపించారు. ఇద్దరూ కలిసి ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో ఊహిస్తూ ఓ అభిమాని ఈ వీడియోను రూపొందించాడు.
ఇలా చూసే అవకాశం దక్కిందంటూ
ఏఐ సాయంతో రూపొందించిన ఈ వీడియోలో మహేశ్‌బాబు, కృష్ణ యాక్షన్ సన్నివేశాల్లో కనిపించడంతో అభిమానులు ఆసక్తిగా వీక్షిస్తున్నారు. నిజ జీవితంలో తండ్రీకొడుకులను ఇలా ఒకే యాక్షన్ సీన్లో చూడలేకపోయినా.. ఏఐ వీడియో రూపంలో అయినా తమ అభిమాన హీరోలను ఇలా చూసే అవకాశం దక్కిందంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇదీ చదవండి: తారక్ దొరకడం నా అదృష్టం.. రాజీవ్ కనకాల ఎమోషనల్
Evadu chesado kani 🥵🤙 dinemma aa high 💥🔥 #MaheshBabu #Krishna 😎 pic.twitter.com/lpn9ihmJvT
— Victor (@victormodeon) September 28, 2026
Tags : 1