Konda Surekha: వాళ్లని చిత్తు చిత్తుగా కొడతా..
Breaking News
రెస్టారెంట్ వ్యాపార వైఫల్యంతో ఇల్లే అమ్మేశాడు ..! కట్‌చేస్తే..
Published on Tue, 09/29/2026 - 12:42
వైఫల్యాన్ని విజయానికి సోఫానంగా మలుచుకోవడం అంటే మాటల్లో చెప్పినంత సులవు కాదు. ఆ ఓటమి పెద్ద ఎదురదెబ్బలా ప్రతి నిమిషం ఆత్మవిశ్వాసం సన్నగిల్లేలా భయపెట్టేస్తున్నా..దాన్ని దిగమించి మందుకు సాగడంలోంచే గెలుపు మొదలైనట్లు అని అంటారు మానసి నిపుణులు. ఇక్కడ ఈ వ్యక్తి కుటుంబ వ్యాపారంలో వెళ్లేలా అర్హతలు దక్కించుకుని మరి సక్సెస్‌ని అందుకుని విభిన్నంగా రెస్టారెంట్‌కి మళ్లడమే ఓటమికి దారితీసింది. అది కూడా కోలుకుని తిరిగి లేచి నిలబడలేనంతగా నష్టాల్లోకి కూరుకుపోయేలా చేసింది. అయినా సరే తట్టుకుని..మళ్లీ రివ్వున అంతకుమించిన రేంజ్‌లో సక్సెస్‌ని ఒడిసిపట్టి కోట్లాధికారిగా మారాడు.
అతడే వీబా ఫుడ్స్ వ్యవస్థాపకుడు విరాజ్ బహల్. అతని వ్యాపారంతో అనుభవం చిన్నతనంలోనే మొదలైంది. ఆయన తరుచుగా తన తండ్రి రాజీవ్ బహల్ ఫ్యాక్టరీని సందర్శించేవారు. ఆ తర్వాత ఢిల్లీలోని ఆహార్‌లో కుటుంబానికి చెందిన ఫన్ ఫుడ్స్ స్టాల్‌లో పనిచేశాడు. ఆ తర్వాత కుటుంబ వ్యాపారంలో చేరాలనుకున్నారు కానీ, తండ్రి ఒక షరతు పెట్టారు. ప్రస్తుతం పెరిగిన జీవన ప్రమాణాలకు అనుగుణంగా కుటుంబాన్ని పోషించగలను అనేలా సంపాదించగలను అని నిరూపించుకోవాలని అన్నారు.
ఆ సవాలును బహల్ స్వీకరించారు. అలా సింగపూర్ పాలిటెక్నిక్‌లో మెరైన్ ఇంజనీరింగ్ చదివి, సింగపూర్‌కు చెందిన ఒక మర్చంట్ నేవీ కంపెనీలో చేరారు. ఫెర్రీలు, ట్యాంకర్లు, కంటైనర్లపై పనిచేస్తూనే..కరస్పాండెన్స్ కోర్సుల ద్వారా తన విద్యను కొనసాగించారు. అలాగే తన చదవుకు స్వయంగా నిధులు సమకూర్చుకున్నారు.2002 నాటికి తన అద్భుతమైన పనితీరుతో ప్రమోషన్ల అదుకుని నెలకు రూ. 3 లక్షలు సంపాదించే రేంజ్‌కు చేరుకున్నారు. అలా 22 ఏళ్ల వయసులో 1983లో స్థాపించిన తన కుటుంబ వ్యాపారమైన ఫన్ ఫుడ్స్‌లో చేరారు.
ఈ కంపెనీ మయోన్నైస్, పిజ్జా టాపింగ్స్, ఓరియంటల్ సలాడ్లు,మసాలా దినుసులతో సహా ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తులను తయారు చేసి విక్రయించేది. అలా రాబోయే కొన్నేళ్లలోనే ఈ వ్యాపారం వేగంగా వృద్ధి చెందింది. అయితే అప్పుడే మంచి ఆఫర్ వచ్చింది. 2008లో, జర్మన్ ప్యాకేజ్డ్-ఫుడ్ కంపెనీ డాక్టర్ ఓట్కర్, ఫన్ ఫుడ్స్‌ను రూ. 110 కోట్లకు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. బహల్ దంపతులు రూ. 28 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైన ఈ కంపెనీ గణనీయమైన రాబడిని సంపాదించే పెట్టేది. అయితే దీన్ని అమ్మడానికి ఇష్టం లేకపోయినా..అమ్మక తప్పలేదు.
అలా ఫన్ ఫుడ్స్ నుంచి నిష్క్రమించిన తర్వాత బహల్ రెస్టారెంట్ వ్యాపారంలో ప్రవేశించి పాకెట్ ఫుల్‌ను ప్రారంభించారు. కానీ ఆ వ్యాపారం అనుకున్న విధంగా సాగలేదు. 2013 వరకు నాలుగేళ్లకు పైగా పోరాడిన ఫలితం శూన్యం. పైగా తన ఆరు అవుట్‌లెట్‌లన్నింటిని మూసేశారు. ఆ వైఫల్యం బహల్‌కి పెద్ద ఎదురుదెబ్బలానే మారింది. ఎందుకంటే ఆ తర్వాత మరో వ్యాపారం ప్రారంభించడానికి ఉన్ని ఇంటిని అమ్మకతప్పలేదు. అలా బహల్ గురుగ్రామ్‌లో శిల్పా మదన్‌తో కలిసి 2013లో వీబాను స్థాపించారు. ఈ కంపెనీ ప్రారంభంలో సాస్‌లు, డిప్‌లు, కాండిమెంట్‌లపై దృష్టి సారించింది.
ఆ ఉత్పత్తులను రిటైల్ వినియోగదారులకు, రెస్టారెంట్లు, కాఫీ చైన్‌ల వంటి సంస్థాగత కస్టమర్లకు సరఫరా చేసింది. అలా రెస్టారెంట్ వ్యాపారానికి భిన్నంగా ఆహార తయారీ రంగంలో తనకున్న అనుభవంతో వీబాను నిర్మించారు. ఈ కంపెనీ విస్తరిస్తున్న కొద్ది పెట్టుబడుదారులను విపరీతంగా ఆకర్షించింది. అలా ప్రసిద్ధ పెట్టుబడిదారులే ఉన్నారు ఈ కంపెనీకి. దాంతో వీబా ఆదాయం 2014లలో రూ. 5.41 కోట్లుగా ఉండగా, 2026కి అది కాస్తా రూ. 1051.60 కోట్లకు పెరిగింది.
నిజానికి వీబా వృద్ధి అనుకున్నంత త్వరిగతిన రాలేదు. మొదట్లో కంపెనీ బ్రాండ్ తన కార్యకలాపాలను విస్తరించడంలో పెట్టబడులు పెట్టడంతో నష్టాలు వచ్చాయి. అయతే 2020 నుంచి ఊపందుకుని లాభాలు అందుకోవడం ప్రారంభించి..వెనుతిరిగి చూడనంతగా మంచి లాభాలతో ముందుకు సాగడం విశేషం. అలాగే కంపెనీ ఉద్యోగుల సంఖ్య కూడా పెరిగింది. అలా బహల్ వైఫ్యలాన్ని అధిగమంచి ఎవర్‌గ్రీన్ సక్సెస్ అందుకుని ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లా దూసుకుపోతుండటం విశేషం.
ఇదీ చదవండి: "సెక్యూరిటీ గార్డు నుంచి పరాటా కింగ్ వరకు"
Tags : 1