Breaking News

స్మార్ట్‌వాచ్ అసాధారణ గుండె లయను గుర్తించగలదా? వైద్యులు ఏమంటున్నారంటే..

Published on Tue, 09/29/2026 - 11:37

ఇప్పుడు స్మార్ట్‌వాచ్‌లు కేవలం అడుగులను లెక్కించడమే కాదు, నిద్రను సైతం కొలిచేస్తున్నాయి. మరికొన్ని పరికరాలు ఏకంగా నాడిని(పల్స్‌)ని ట్రాక్‌ చేయగలవు. మరికొన్ని అ‍డ్వాన్స్‌డ్‌ స్మార్ట్‌వాచ్‌లు. సింగిల్-లీడ్ ఎలక్ట్రోకార్డియోగ్రామ్ (ECG)ను కూడా రికార్డ్ చేయగలవు కూడా. ఇవి రోజువారీ జీవితంలో గుండె ఎలా కొట్టుకుంటుంది అనే దానిపై అవగాహన అందిస్తుంది. అంటే ఈ స్మార్ట్‌వాచ్‌కి నిజంగానే గుండె అసాధారణ లయను గుర్తించగలిగే సామర్థ్యం ఉందా..? అంటే..

చాలా స్మార్ట్‌వాచ్‌లు మణికట్టు వద్ద రక్త ప్రవాహంలో మార్పులను కొలవడానికి కాంతి ఆధారిత సెన్సార్‌ను ఉపయోగిస్తాయి. ఫోటోప్లెథిస్మోగ్రఫీ లేదా PPGగా పిలిచే ఈ సాంకేతిక గుండె కొట్టుకునే సమయాన్ని ట్రాక్‌ చేయగలదు, అలాగే క్రమరహితంగే కనిపించే నమునాను కూడా పరిశీలించగలదు. కొన్ని వాచీలు పరికరాన్ని వేలితో తాకడం ద్వారానే ఈసీజీ తీసుకునేలా అనుమతిస్తుంది. 

అంటే ఇది జస్ట్‌ గుండె కార్యకలాపాల చిన్న రికార్డింగ్‌నే ఉత్పత్తి చేయగలవట. అంటే గుండె పైగదులు క్రమరహితంగా కొట్టుకునే పరిస్థితి అయిన ఏట్రియల్ ఫిబ్రిలేషన్‌(ఏఎఫ్‌)ను గుర్తించగలదు. అంటే ఈ ఏఎఫ్‌ వల్ల గుండె దడ, ఆయాసం లేదా తల తిరగడం వంటివి సంభవించవచ్చు. కానీ కొంతమందిలో ఈ లక్షణాలు అస్సలు కనిపించవు. అలాగే ఒక్కోసారి ఒక అసాధారణమైన రీడింగ్‌ని చూపించినా..అందే గుండె లయ లోపంగా నిర్థారించలేం. ఎందుకుంటే వాచ్‌ మణి కట్టుకు ఉన్న తీరు, రక్త ప్రవాహంలో మార్పులు, అదనపు స్పందనలు వంటివి ఒక్కోసారి గుర్తించలేకపోవచ్చు. 

ఒక్కోసారి తెల్లవారుజామున 2 గంటలకు క్రమరహిత లయ హెచ్చరికను అందుకుని.. నిద్రలేచాక సాధారణంగా ఉండొచ్చు. ఒకవేళ ఆ వ్యక్తి తెల్లవారుజామున చూసిన రీడింగ్‌కి భయపడి క్లినిక్‌ చేరుకున్నాక..అక్కడ గుండె సాధారణ స్థితిలో గుండె కొట్టుకుంటూ ఉండొచ్చు. అయితే ఇక్కడ ఆ పేషెంట్‌కి అంతకముందు గుండె ఎలా కొట్టుకుందనే సమాచారం కార్డియాలజిస్టులకు ఉపయుక్తమై..తదుపరి వైద్య చికిత్సపై నిర్ణయం తీసుకునేలా అవగాహన కల్పిస్తుంది. 

ఇది జస్ట్‌ సాంప్రదాయ కార్డియాలజీకి పూర​కంగానే ఉంటుంది. అంటే ఇలా గుండెలోని మార్పుల రీత్యా ఆ రోగికి పర్యవేక్షణ అవసరమా కాదా అని నిర్థారించేందుకు ఉపయోగపడుతుంది. ఇక్కడ స్మార్ట్‌ వాచ్‌ సాంకేతికత జస్ట్‌ ముందస్తు పరీక్షలు, జాగ్రత్తలు తీసుకోవడానికి ఉపయోగపడుతుందే తప్ప..స్వీయంగా వ్యాధిని నిర్థారించుకోగలమని కాదని అంటున్నారు వైద్యులు. అంటే ఈ స్మార్ట్‌ వాచ్‌ ఇచ్చే వేరబుల్‌ డేటా వైద్యులకు ఎలాంటి చికిత్స అవసరం అనేదానిపై మార్గదర్శకం అందిస్తుంది. అంతేగాదు గుండెకు సంబంధించి..సంప్రదాయ వైద్య పరీక్షలతోనే సమస్యను నిర్థారించగలమని నొక్కి చెబుతున్నారు కార్డియాలజిస్ట్‌లు.

 ఆ వాచ్‌ మీ గుండె లయ తప్పుతోంది అప్పడప్పుడూ..జాగ్రత్తపడు అని ఒక హెచ్చరిక పంపుతుందే తప్ప..అదే గుండె జబ్బు అని కచ్చితంగా నిర్థారించదని తేల్చి చెబుతున్నారు. ఒక్కోసారి రక్తప్రవాహంలో మార్పుల వల్ల..రోగికి ఉండే వ్యాధుల వల్లో ఇలా ఒక్కోసారి జరుగుతంది దాన్ని హార్ట్‌ సమస్యగా నిర్థారించలేమని అంటున్నారు. 

అందువల్ల ఈ సాంకేతికను ముందస్తు హెచ్చరికగా మాత్రమే చూడాలని సూచిస్తున్నారు వైద్యులు. ఇది ఆ క్షణంలో మన గుండెలో ఏం జరుగుతుందో పట్టుకోవడానికే సహాయపడుతుంది, అలాగే వైద్యులకు ఎలాంటి కార్డియాలజీ చికిత్స అవసరం అనేదానిపై గైడెన్స్‌ అందిస్తుందని చెబుతున్నారు.

ఇదీ చదవండి: గుండెదడ గండమేనా? ఈ విషయాలు గుర్తుంచుకోండి!

 

Videos

Konda Surekha: వాళ్లని చిత్తు చిత్తుగా కొడతా..

TDP నేతల కంటే ఎక్కువ తిరుగుతున్నాడు మజ్జి శ్రీనుకు ఇచ్చిపడేసిన పేర్ని కిట్టు

పడిపోతున్న బంగారం ధరలు కొనాలా? వద్దా?

ఇప్పటికీ నా భార్య తిడతా ఉంది.. పేర్ని నాని నాన్ స్టాప్ సెటైర్లు

నిరసన చేస్తున్న లాయర్లను ఈడ్చిపడేసిన పోలీసులు

నాని మేడారం మొక్కులు

నీకు ఎన్ని బూతులు వచ్చో నాకు అంతకంటే ఎక్కువే వచ్చు.. నాని స్వీట్ వార్నింగ్

ఎవరా పోలీసులు.. గుర్తించండి..! మహినికలి MLAల ఘుటనపై హైకోర్టు సీరియస్

CHATGPTతో తిరుమల రూమ్ బుకింగ్... పేమెంట్ దశ వరకు వెళ్లి..!

గుంటూరులో ఘోర విషాదం.. కారులో మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనం

Photos

+5

YS జగన్‌ కోసం కదిలిన ఒంగోలు.. పోటెత్తిన అభిమానులు! (ఫొటోలు)

+5

మిస్‌ ఎర్త్‌ వాటర్‌ ఇండియాగా ఆదిలాబాద్ యువ‌తి (ఫొటోలు)

+5

‘తత్వం’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

మేడారం వనదేవతల సన్నిధిలో నాని (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు నవీన్ చంద్ర (ఫొటోలు)

+5

ఫేమస్ దేవాలయాలన్నీ తిరిగేస్తున్న 'జైలర్' భామ (ఫొటోలు)

+5

హ్యాపీ బర్త్ డే క్యూటీ.. భర్తకు ఆలియా భట్ లవ్‌లీ విషెస్ (ఫొటోలు)

+5

ప్రెగ్నెన్సీతోనూ జిమ్, గేమ్.. సమంత లేటెస్ట్ (ఫొటోలు)

+5

పెళ్లి వేడుక కోసం ముస్తాబైన హీరోయిన్ కళ్యాణి (ఫొటోలు)

+5

పూలతోటలో అనుపమ పరమేశ్వరన్ చిల్.. ఫోటోలు