Breaking News

ఈపీఎఫ్‌ వేతన పరిమితి పెంపు.. ఈడీఎల్‌ఐ పరిస్థితి ఏమిటి?

Published on Sat, 09/26/2026 - 15:36

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) పరిధిలోని వేతన పరిమితిని నెలకు రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. 2014 తర్వాత దాదాపు 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ కేంద్ర కార్మిక శాఖ సెప్టెంబర్ 17న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా సుమారు 50 లక్షల మందికి పైగా కొత్త ఉద్యోగులు సామాజిక భద్రతా పరిధిలోకి రానున్నారు. అయితే ఈ వేతన పరిమితి పెంపుతో ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఈడీఎల్‌ఐ) పథకం కింద పొందే ఉచిత జీవిత బీమా రక్షణ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

పీఎఫ్, పెన్షన్ విరాళాల్లో మార్పులు

నూతన నిబంధనల ప్రకారం, వేతన పరిమితి పెరగడంతో ఎంప్లాయర్ (యాజమాన్యం), ఉద్యోగి కాంట్రిబ్యూషన్లలో కీలక మార్పులు రానున్నాయి.

ఈపీఎఫ్ నిధి: బేసిక్ వేతనం ఆధారంగా పీఎఫ్ విరాళం లెక్కిస్తారు. వేతన పరిమితి రూ.25,000కు పెరగడం వల్ల గరిష్టంగా కంపెనీ విరాళం రూ.1,800 నుంచి రూ.3,000కు పెరుగుతుంది.

ఈపీఎస్ పెన్షన్: ఇదివరకు రూ.15,000 పరిమితి ప్రకారం పెన్షన్ ఫండ్‌కు వెళ్లే గరిష్ట మొత్తాన్ని రూ.1,250గా నిర్ణయించారు. కొత్త పరిమితి ఆధారంగా (8.33%) ఇది గరిష్టంగా రూ.2,083 వరకు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత లభించే నెలవారీ పెన్షన్ లబ్ధి చేకూరుతుంది.

ఇన్-హ్యాండ్ శాలరీపై ప్రభావం

కొత్త పరిమితి కారణంగా రూ.15,000 నుంచి రూ.25,000 మధ్య మూల వేతనం కలిగిన ఉద్యోగులకు ప్రతి నెలా పీఎఫ్ మినహాయింపు పెరుగుతుంది. సీటీసీ ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగుల నెలవారీ చేతికి వచ్చే జీతం (టేక్‌ హోమ్‌ సాలరీ) కొద్దిగా తగ్గినప్పటికీ సుదీర్ఘకాలంలో లభించే వడ్డీ, రిటైర్మెంట్ కార్పస్ పెరుగుతాయి.

ఈడీఎల్ఐ ఇన్సూరెన్స్ కవరేజ్ పరిస్థితి ఏమిటి?

ఈ వేతన పరిమితి పెంపుతో ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఈడీఎల్‌ఐ) పథకం కింద పొందే ఉచిత జీవిత భీమా రక్షణ మరింత ఎక్కువ మందికి విస్తరిస్తుంది. కొత్తగా పీఎఫ్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులందరికీ ఈ ఇన్సూరెన్స్ రక్షణ లభిస్తుంది. అయితే, ప్రస్తుత సమాచారం ప్రకారం ఈడీఎల్‌ఐ కింద లభించే గరిష్ట బీమా పరిమితి రూ.7 లక్షలుగా కొనసాగుతోంది. ప్రభుత్వ యంత్రాంగం వేతన పరిమితి ఆధారంగా ఈ ఉచిత ఇన్సూరెన్స్ క్లెయిమ్ గరిష్ట పరిమితిని పెంచే అవకాశం ఉన్నప్పటికీ దీనిపై ఇంకా అధికారిక మార్పు నోటిఫికేషన్ వెలువడాల్సి ఉంది.

ఇదీ చదవండి: ఆధార్ వ్యవస్థనే అబ్బురపరిచిన కవలలు

Videos

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

ఊహించని ఊచకోత.. అప్పుడే రూ.100 కోట్లు

దానంకు ఖైరతాబాద్ టికెట్ టెన్షన్

కర్నూలులో పట్టపగలే చోరీ.. రైతు బైక్ నుంచి రూ.2 లక్షలు మాయం

చింతమనేని నీకే చెప్తున్నా దెందులూరు గడ్డ సాక్షిగా.. నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

గణేష్ నిమజ్జనంలో దుమ్మురేపిన హైదరాబాద్ లేడీ పోలీస్ డాన్స్

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

మధుబాబును సస్పెండ్ చేసిన కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ఆగ్రహం

ఉండ్రాజవరంలో హైటెన్షన్.. పోలీసులకు వంగవీటి కూతురు మాస్ వార్నింగ్

Photos

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో సమ్మక్క పాత్ర.. నటి జ్ఞాపకాలు (ఫొటోలు)