Breaking News

అలా అడవిలో ఓ రాత్రి..

Published on Tue, 09/22/2026 - 20:02

హైద‌రాబాద్‌: పట్టణాల సందడి దాటుకొని ములుగు జిల్లా తాడ్వాయి వైపు వెళ్తుంటే క్రమంగా అడవి మొదలవు తుంది. రహదారికి ఇరువైపులా కనిపించే పెద్దపెద్ద చెట్లు, అప్పుడప్పుడు వినిపించే పక్షుల కిలకిలా రావాలు, ఇక్కడ ప్రయాణానికి ప్రత్యేకతను తీసుకొస్తాయి. ఇలాంటి వాతావరణంలో ఒక రాత్రి గడిపే అవకాశం ఇప్పుడు ‘ది జెయింట్‌ స్క్విరెల్‌’ రిసార్ట్‌తో అందుబాటులోకి వచ్చింది.

శేరిలింగంపల్లి పరిధి కొత్తగూడలోని తెలంగాణ ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీజీఎఫ్‌డీసీ) ఎకో టూరిజం కార్యక్రమంలో భాగంగా తాడ్వాయిలో ఈ రిసార్ట్‌ను అభివృద్ధి చేసినట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘డెక్కన్‌ వుడ్స్‌ అండ్‌ ట్రైల్స్‌’ పేరుతో నిర్వహిస్తున్న ఎకో టూరిజం ప్రాజెక్టులో భాగంగా ‘ది జెయింట్‌ స్క్విరెల్‌’లో మొత్తం ఆరు హట్స్ నిర్మించారు. వీటిలో ఐదు హట్స్‌ పర్యాటకుల బసకు అందుబాటులో ఉన్నాయి. ప్రకృతికి దగ్గరగా ఉంటూనే సౌకర్యవంతమైన బసకు ఇక్కడ అవకాశం కల్పిస్తారు.  

బస ఇలా... 
తాడ్వాయి బసలో భాగంగా ఫారెస్ట్‌ డ్రైవ్, ఉదయం జంగిల్‌వాక్‌ , ఆ తర్వాత అడవికి దగ్గరగా తీసుకెళ్లే పలు కార్యకలాపాలను రూపొందించారు. ప్యాకేజీలో సఫారీ రైడ్, సన్‌ డౌనర్‌ వ్యూపాయింట్,  బ్లాక్‌బెర్రీ ఐలాండ్స్‌ సందర్శన ఉంటుంది.

ఇదీ చ‌ద‌వండి: బంతిపూల బొకేలు.. ఇండియాలో ఎందుకు ఉండవు? 

ప్యాకేజీలు ఇవే... 
తాడ్వాయి ఒక రాత్రి బస, పూర్తి ప్యాకేజీ ధర ఒకరికి రూ.5,500. ఇద్దరికి రూ.8 వేలు, ముగ్గురికి రూ.10,800 ఉంది. ప్యాకేజీలో వెల్‌కమ్‌ డ్రింక్స్, వెజ్, నాన్‌వెజ్‌ లంచ్, హైటీ, స్నాక్స్, సఫారీ రైడ్, సన్‌డౌనర్‌ వ్యూపాయింట్‌ వద్ద టీ, స్నాక్స్, వెజ్, నాన్‌వెజ్‌ డిన్నర్, ఉంటాయి. డెక్కన్‌ వుడ్స్‌ అండ్‌ ట్రైల్స్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో బసను బుకింగ్‌ చేసుకోవచ్చు.

Videos

2 షేర్లు.. ₹6.25 కోట్లు!టాటా సన్స్ IPO సంచలనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మిస్టరీగా నర్సింగ్ విద్యార్థిని మృతి

ఉద్యోగులకు భారీ బొనాంజా! కనీస వేతనం ₹63 వేలు!

సుమలతపై తోటి డాన్సర్ల దాడి...!

లోకేష్ రాజీనామా! గవర్నర్ ముందు లోకేష్ DSC స్కామ్ బండారం

ఎన్ని కేసులు పెడతావో.. పెట్టుకో నీ ఆటలు కట్టిస్తాం..

చంద్రబాబు అరాచకాలపై భారీ వర్షంలో జగన్ ఉగ్రరూపం

నానికి సీఎం రేవంత్ రిప్లై ఇదే

MLA చెప్పినవారికే పింఛన్లు.. బయటపడ్డ సంచలన ఆడియో క్లిప్

జానీ మాస్టర్ భార్య సుమలతకు బిగ్ షాక్

Photos

+5

ఫ్యామిలీతో జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాశ్.. ఫోటోలు

+5

గ్రాండ్‌గా స్టార్ డైరెక్టర్ కూతురి ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు

+5

ది ప్యారడైజ్‌ స్టైలిష్ లుక్‌లో హీరో నాని.. ఫోటోలు

+5

బ్లాక్‌డ్రెస్‌లో హీరోయిన్ రష్మిక గ్లామర్.. ఫోటోలు

+5

తిరుమల : వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం (ఫొటోలు)

+5

మధుబని ఓధనా చీరలో మిల్కీ బ్యూటీ తమన్నా బ్యూటిఫుల్‌ లుక్‌.. (ఫొటోలు)

+5

చీరలో ఉన్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

పట్టుచీర.. మల్లెపూలు.. మెరిసిపోతున్న హెబ్బా (ఫొటోలు)

+5

ఏపీలోని పలు జిల్లాల్లో వర్ష బీభత్సం (ఫొటోలు)

+5

తిరుమలలో తెలుగు హీరోయిన్ అద్భుతమైన డ్యాన్స్...ఎవరో తెలుసా? (ఫొటోలు)