Breaking News

ఏజ్‌ ఉంది.. ఓపిక ఉంది.. అన్ని నేనే చేశా : నాని

Published on Sun, 09/20/2026 - 17:34

స్టార్‌ హీరోల సినిమాల్లో యాక్షన్‌ సన్నివేశాలు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తెరపై హీరో ఎంత రిస్క్‌ తీసుకున్నట్లు కనిపించినా.. వాస్తవానికి కొన్ని యాక్షన్‌ సీన్లను డూప్‌ల సాయంతో పూర్తి చేయడం సాధారణమే. ముఖ్యంగా ప్రమాదకరమైన ఫైట్లు, హై-రిస్క్‌ స్టంట్స్‌ ఉన్నప్పుడు హీరోలకు బదులుగా డూప్‌లు రంగంలోకి దిగుతుంటారు. కానీ నేచురల్‌ స్టార్‌ నాని మాత్రం తన సినిమాల విషయంలో ఈ పద్ధతికి వీలైనంత దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడట. తనకు డూప్‌తో సన్నివేశాలు చేయించడం అసలు ఇష్టం లేదని చెబుతున్నాడు.

నాని నటించిన భారీ మాస్‌ యాక్షన్‌ చిత్రం ‘ది ప్యారడైజ్‌’ ఈ నెల 24న విడుదల కాబోతుంది.మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సినిమాలోని యాక్షన్‌ సీన్లను డూప్‌తో చేశారా? లేక మీరే చేశారా? అని ఓ విలేకరి ప్రశ్నించగా.. నాని ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు.

‘నాకిప్పుడు ఏజ్‌ ఉంది.. ఓపిక ఉంది..అందుకే అన్నీ నేనే చేశాను. 50 ఏళ్లు దాటిన తర్వాత డూప్‌ని పెడతానేమో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం నా సినిమాల్లో డూప్‌ని పెట్టడం నాకు నచ్చదు. నా సినిమాలో ఒక్క డూప్‌ షాట్‌ కనిపించినా ఎంజాయ్‌ చేయలేను. సినిమా చూస్తున్నప్పుడు ఆ షాట్‌ నాది కాదనుకోండి.. సినిమా చూస్తూ ఎంజాయ్‌ చేస్తూనే.. ఆ సీన్‌ రాగానే ‘అబ్బా.. డూప్‌ షాట్‌’ అనుకుంటా. దాన్ని నేను ఓన్‌ చేసుకోలేను. ప్రశంసలు కూడా తీసుకోలేను. ఎవరైనా ‘నాని బాగా చేశావ్‌’ అంటే.. ‘ఆ నాలుగు డూప్‌ షాట్లు తప్పితే’ అని నా మనసు నాకు చెబుతూనే ఉంటుంది. 

అందుకే చిన్న చిన్న లెగ్‌ షాట్స్‌ కూడా నేనే చేస్తా. ఒక్కోసారి అసిస్టెంట్‌ డైరెక్టర్లు ఇలాంటి సీన్లను డూప్‌తో చేద్దామని అనుకుంటారు. కానీ నేను ముందుగానే వాళ్లకు చెబుతా.. నా సీన్లన్నీ నేనే చేస్తానని చెప్పి క్యారవ్యాన్‌లోకి వెళతా. అయితే ఈ కసి, ఓపిక మరో పదేళ్ల తర్వాత కూడా ఇలాగే ఉంటుందో లేదో చెప్పలేను. ప్రస్తుతానికి మాత్రం సినిమాల్లో డూప్‌ లేకుండా వీలైనంత వరకు అన్ని సన్నివేశాలను నేనే చేయాలని అనుకుంటున్నాను’అని నాని చెప్పుకొచ్చాడు. 
 

Videos

నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై

టీడీపీ నేతపై జర్నలిస్ట్ హిమబిందు సంచలన ఆరోపణలు

రాకాతో హాలీవుడ్ ను టార్గెట్ చేసిన అల్లు అర్జున్?

తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు..

గుంటూరులో మరో లాకప్ డెత్.. అడ్వకేట్ రజిని స్ట్రాంగ్ వార్నింగ్

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆరోపణలపై ప్రసన్న ఫైర్

చంద్రబాబుకు బిగ్ షాక్.. తిరుమల లడ్డూపై ఈడీ సంచలన ప్రకటన

పద్థతి మార్చుకో.. MLAపై రెచ్చిపోయిన చంద్రబాబు

నిండా ముంచేసిన లలితా జువెల్లరీ స్టాక్.. అసలేం జరిగిందంటే?

అమలాపురంలో భారీ పేలుడు.. ఇల్లు ధ్వంసం

Photos

+5

హాఫ్ శారీలో మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ (ఫోటోలు)

+5

నాని ది ప్యారడైజ్ స్టైలిష్ లుక్‌.. (ఫోటోలు)

+5

గణేశుడి సన్నిధిలో విజయ్‌ దేవరకొండ..(ఫోటోలు)

+5

అందాల అషు.. (ఫోటోలు)

+5

కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు)

+5

ఎర్రచీరలో శోభిత ధూళిపాళ.. చూపుతిప్పుకోనివ్వని అందాలు (ఫోటోలు)

+5

గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు

+5

బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు)

+5

నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు)

+5

తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు)