Audio Viral: టీడీపీ కార్యకర్తలకే పింఛన్లు
Breaking News
జియో రీఛార్జ్ ప్లాన్స్: తక్కువ ధర, ఎక్కువ బెనిఫిట్స్!
Published on Thu, 09/17/2026 - 19:23
రిలయన్స్ జియో తన యూజర్ల కోసం అందిస్తున్న సరసమైన రీఛార్జ్ ప్లాన్లలో రూ.55, రూ.77, రూ.111 ఉన్నాయి. వీటి ద్వారా వినియోగదారులకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి?, వ్యాలిడిటీ ఎంత? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
రూ.55 ప్లాన్
ఇది రిలయన్స్ జియో బడ్జెట్-ఫ్రెండ్లీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్ . కేవలం రూ. 55 ధరతో లభించే జియోటీవీ ప్రో ప్యాక్, 30 రోజుల వ్యాలిడిటీతో పాటు, జియోటీవీ యాప్ ద్వారా 16కు పైగా భాషలలో 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెళ్లకు యాక్సెస్‌ను అందిస్తుంది. టీవీ ఛానెల్‌లతో పాటు, జియోటీవీ ప్రో ప్లాన్‌లో మొత్తం 3MB డేటా లభిస్తుంది. దీని వ్యాలిడిటీ కేవలం మూడు రోజులు మాత్రమే. అయితే ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా మీకు ఎలాంటి వాయిస్ కాలింగ్ సదుపాయం లభించదు.
రూ.77 ప్లాన్
ఇది ఒక డేటా వోచర్. ఈ ప్లాన్ అందించడం వెనుక ప్రధాన ఉద్దేశం ఓటీటీ ప్రయోజనాలను అందించడమే. ఎందుకంటే ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే కేవలం 3 జేబీ డేటా మాత్రమే లభిస్తుంది. ఇది కూడా కేవలం 5 రోజుల వ్యాలిడిటీ మాత్రమే. సోనీలివ్ ఓటీటీ 30 రోజుల పాటు ఉచితంగా లభిస్తుంది. సోనీలివ్ ద్వారా కంటెంట్‌ను చూడటానికి ఆసక్తి ఉన్న వినియోగదారులు జియోటీవీ యాప్ ద్వారా దానిని స్ట్రీమ్ చేసుకోవచ్చు. జియోటీవీ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంది.
రూ.111 ప్లాన్
ఇది ఒక ఫ్లెక్స్ యూత్ అండ్ గేమింగ్ ప్యాక్. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 28 రోజులు. ఇందులో మొత్తం 5 జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే 28 రోజుల సమయంలో 5జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చన్నమాట. ఈ ప్యాక్‌లో మరో ప్రత్యేకమైన బెనిఫిట్ కూడా ఉంది. ఇందులో రెండు ఆప్షన్లు ఉంటాయి. గేమింగ్ అంటే ఇష్టపడే వాళ్లు గేమింగ్ ప్యాక్ ఎంచుకోవచ్చు. దీనిలో జియో గేమ్ మొబైల్‌కు 56 రోజుల యాక్సెస్ లభిస్తుంది. మరోవైపు యూత్ ప్యాక్ ఎంచుకుంటే.. జియో గేమ్ మొబైల్‌తో పాటు, స్నాప్‌చాట్ ప్లస్ కూడా లభిస్తాయి. ఈ ఆప్షన్ వ్యాలిడిటీ 28 రోజులు.
Tags : 1