Breaking News

మరో ఐదేళ్లు.. ఆయనే టాటా సన్స్‌ ఛైర్మన్‌!

Published on Thu, 09/17/2026 - 15:25

టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ విషయంలో అనూహ్యమైన మార్పు చోటుచేసుకుంది. తన పదవీకాలం 2027 ఫిబ్రవరి 20న ముగిసిన తర్వాత మరోసారి ఛైర్మన్‌గా కొనసాగాలని తాను కోరుకోవడం లేదని చంద్రశేఖరన్ గతంలోనే ప్రకటించారు. టాటా గ్రూప్‌లో 40 ఏళ్ల వృత్తి జీవితాన్ని పూర్తి చేశానని, ఈ సంస్థకు సేవ చేసే అవకాశం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు. 

అయితే తాజాగా.. జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో చంద్రశేఖరన్‌కు మరో ఐదేళ్ల పదవీకాలం ఇవ్వడానికి బోర్డు ఆమోదం తెలిపింది. ఈ తీర్మానానికి నోయెల్ టాటా వ్యతిరేకంగా ఓటు వేయగా, మిగిలిన బోర్డు సభ్యులందరూ అనుకూలంగా ఓటు వేశారు.

స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్
ఈ మొత్తం వ్యవహారంలో మరో పెద్ద అంశం.. టాటా సన్స్‌ను స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేయాలా లేదా అన్నది. టాటా సన్స్‌ను రిజర్వ్ బ్యాంక్ ఒక అప్పర్ లేయర్ NBFCగా వర్గీకరించిన నేపథ్యంలో, సెప్టెంబర్ 11న దాని NBFC రిజిస్ట్రేషన్‌ను వదులుకోవడానికి చేసిన దరఖాస్తును RBI తిరస్కరించింది. దీంతో టాటా సన్స్‌ను భవిష్యత్తులో మార్కెట్‌లో లిస్టింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం పెరిగింది. ఈ లిస్టింగ్ అంశంపై టాటా ట్రస్ట్స్, టాటా సన్స్ బోర్డు మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు గతంలో నివేదికలు వచ్చాయి. అందుకే తాజా బోర్డు సమావేశం ఛైర్మన్ పదవితో పాటు టాటా సన్స్ భవిష్యత్ దిశకు కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.

చంద్రశేఖరన్ మొదట పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. టాటా ట్రస్ట్ కూడా ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తూ కొత్త ఛైర్మన్ ఎంపికపై దృష్టి పెట్టింది. కానీ తాజాగా.. జరిగిన బోర్డు సమావేశంలో పరిస్థితి మారి, ఆయనకు మరో ఐదేళ్ల ఆమోదించబడినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే చంద్రశేఖరన్ తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నారనే విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు. సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇదీ చదవండి: UPI ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన!

Videos

రోహిత్ & వంశీ మధ్య బిగ్ ఫైట్ కెప్టెన్‌గా చరణ్..!

కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడానికి ఎలా వస్తున్నాయి..? డబ్బులు లేవని చెప్పడానికి సిగ్గులేదా..!

మధుకర్ మహా మాయగాడు నందు కేసులో కొత్త ట్విస్ట్..!

పోరాటం ఫలించింది.. సాక్షి టీవీ దెబ్బకు దిగొచ్చిన కూటమి సర్కార్‌

సాయికృష్ణ కేసులో మరో నిందితుడు సరెండర్

PM Modi: బెంగాల్ మహిళలకు గుడ్ న్యూస్

మల్లారెడ్డిపై బీఆర్‌ఎస్‌ నేతల తిరుగుబాటు? ఫ్లెక్సీలు చించివేత

కరువు పరిస్థితులపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం

లోకేష్‌ పర్యటనలో కోటంరెడ్డికి పరాభవం?.. మంత్రి పదవి ఆశలకు బ్రేక్‌ పడినట్టేనా?

ఖమ్మంలో విషాదం... తండ్రి నిర్ణయానికి ఇద్దరు చిన్నారులు బలి..

Photos

+5

పదేళ్ల ప్రేమ.. పెళ్లి చేసుకున్న హీరోయిన్ (ఫొటోలు)

+5

సందడిగా సమంత సీమంతం వేడుక (ఫొటోలు)

+5

హైదరాబాద్ : అబ్బా భలే ఉన్నాడే... గణేశుడు (ఫొటోలు)

+5

'ధురంధర్' భామ ఆయేషా బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ఆషికా.. బార్బీ డాల్‌కి ఏం తక్కువ కాదు! (ఫొటోలు)

+5

అందంతో టాప్ లేపిన మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

ఫ్యాన్స్‌ ఫైట్‌ చేస్తుంటే.. స్టార్స్‌ ఏం చేస్తున్నారో చూడండి! (ఫొటోలు)

+5

ఘనంగా ‘సైమా అవార్డ్స్ 2026’ సినీ స్టార్స్ సందడి (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి తొలిపూజకు వేళాయే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో వినాయక చవితి సందడి (ఫోటోలు)