APలో ఉన్నది ఎల్ నినో కాదు.. ఎల్లో నినో ఎఫెక్ట్.. YS జగన్ కౌంటర్
Breaking News
‘ఎంఎస్ సుబ్బులక్ష్మి ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఎవరికీ తెలీదు’
Published on Thu, 09/17/2026 - 09:12
గౌతమ్ తిన్నునూరి దర్శకత్వంలో రష్మిక ప్రధాన పాత్రలో విద్యాంసురాలు ఎం.ఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం ‘ఎం.ఎస్’. అల్లు అరవింద్, రాక్‌లైన్ వెంకటేష్, బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. బుధవారం ఎంఎస్ సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను కమల్‌హాసన్ చేతుల మీదుగా లాంచ్ చేశారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ బయోపిక్ తీయాలని స్ఫూర్తి పొందాం
‘సుబ్బులక్ష్మి అమ్మ జీవితంలోని ఘటనల గురించి తెలిసిన తర్వాత ఈ బయోపిక్ తీయాలని మరింతగా స్ఫూర్తి పొందాం. నాలుగు భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఎంఎస్ అమ్మ ఎంత ఇబ్బందికరమైన జీవితాన్ని అనుభవించారో చాలా మందికి తెలీదు. అమ్మ సంగీతాన్ని రీక్రియేట్ చేసేంత గొప్పవాళ్లం కాదు. అందుకే అనిరుధ్ సంగీతంతో ఓ గొప్ప బయోపిక్ తీయాలని నిర్ణయించుకున్నాం’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు.
కాగా చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో రష్మికపై చిత్రీకరించిన ఓ సన్నివేశానికి కమల్‌హాసన్ క్లాప్ ఇచ్చారు. ఈ వేడుకలో సినీ ప్రముఖులతో పాటు ఎంఎస్ సుబ్బులక్ష్మి మనవడు చంద్రశేఖర్, ఆయన భార్య మణిమాల పాల్గొన్నారు.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో ఎగిరిపడ్డ కంటెస్టెంట్లు! ఆడపిల్లని కూడా చూడలేదు..!)
Tags : 1