Breaking News

రీచార్జ్‌ ప్లాన్‌ ఒక్కటే.. బెనిఫిట్స్‌లో ఏది బెస్ట్‌?

Published on Sun, 09/13/2026 - 17:55

దేశంలో టెలికాం రంగంలో రిలయన్స్‌ జియో (Reliance Jio), భారతీ ఎయిర్‌టెల్‌ (Bharti Airtel) మధ్య పోటీ కొనసాగుతోంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు రెండు సంస్థలు వివిధ రకాల ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఇందులో భాగంగా రెండు టెల్కోలు రూ.349 ధరతో 28 రోజుల వ్యాలిడిటీ కలిగిన ప్లాన్లను అందిస్తున్నాయి. ఈ రెండు ప్లాన్లలో అపరిమిత వాయిస్ కాలింగ్, ఎస్‌ఎంఎస్‌, 5జీ డేటా వంటి ప్రయోజనాలు ఉన్నాయి. అయితే రోజువారీ డేటా, ఓటీటీ, ఏఐ సేవలు వంటి అదనపు ప్రయోజనాల్లో తేడా ఉంది.

జియో రూ.349 ప్లాన్‌

జియో రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. అర్హత కలిగిన వినియోగదారులకు అపరిమిత 5జీ డేటా కూడా అందుతుంది.

అదనపు ప్రయోజనాల్లో భాగంగా జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 50జీబీ ఉచిత జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ లభిస్తుంది. అంతేకాకుండా 18 నెలల గూగుల్ జెమినీ ఏఐ ప్రో ప్లాన్‌ను కూడా అందిస్తోంది. దీని విలువ సుమారు రూ.35,100గా పేర్కొంటున్నారు.

అయితే గూగుల్ ఏఐ ప్రో ప్రయోజనాన్ని కొనసాగించాలంటే వినియోగదారులు ప్రతి రీచార్జ్‌కు రూ.349 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ప్లాన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఎయిర్‌టెల్ రూ.349 ప్లాన్‌

ఎయిర్‌టెల్ కూడా రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్‌ను 28 రోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, రోజుకు 1.5జీబీ డేటా లభిస్తుంది. అర్హత ఉన్న వినియోగదారులకు అపరిమిత 5జీ డేటా సదుపాయం కూడా ఉంది.

అదనపు ప్రయోజనాల్లో భాగంగా 12 నెలల అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. దీని విలువ సుమారు రూ.4,000. అలాగే యాపిల్ మ్యూజిక్ ప్రయోజనం కూడా ఉంది.

అయితే ఎయిర్‌టెల్ అందించే అపరిమిత 5జీ డేటాకు ఫెయిర్ యూసేజ్ పరిమితి వర్తిస్తుంది. ప్రతి 30 రోజుల వ్యవధిలో గరిష్ఠంగా 300జీబీ వరకు 5జీ డేటాను వినియోగించుకోవచ్చు.

ఏ ప్లాన్‌ మంచిది?

ధర, వ్యాలిడిటీ, కాలింగ్, ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలు రెండింటిలోనూ దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ.. అదనపు ప్రయోజనాలు, రోజువారీ డేటా పరంగా జియో రూ.349 ప్లాన్‌ ముందంజలో ఉంది. ఎయిర్‌టెల్ 1.5జీబీతో పోలిస్తే జియో రోజుకు 2జీబీ డేటాను అందిస్తోంది. అంటే 28 రోజుల్లో జియో ప్లాన్ ద్వారా మొత్తం 56జీబీ వరకు రోజువారీ డేటా లభిస్తుంది.

అదనంగా గూగుల్ జెమినీ ఏఐ ప్రో, జియో హాట్‌స్టార్, జియో ఏఐ క్లౌడ్ వంటి ప్రయోజనాలు కూడా ఉండటంతో.. అదనపు బెనిఫిట్స్ విషయంలో జియో ప్లాన్‌కు ఎక్కువ విలువ లభిస్తుంది.

Videos

ఎన్నికలకు ముందు ఒకరోజు జగన్ దగ్గరకి నేను పేర్ని నాని వెళ్లి... ఈ వీడియో చూస్తే చాలు

పండుగ రోజు గుడ్ న్యూస్ క్రీడాకారులకు జగన్ అభినందనలు

దుబాయ్ కి జంప్.? బయటపడ్డ NANDUS WORLD సీక్రెట్ స్కెచ్..!

ఫ్రీ హోల్డ్ భూముల పేరుతో కూటమి రైతుల జీవితాలతో చెలగాటం

కావాలని మహిళా బైకర్ ను ఢీ కొట్టిన కారు వైరల్ అవుతున్న వీడియో

యూపీలోని ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

అర్థరాత్రి పోలీస్ స్టేషన్ లోనే తన్నుకున్న TDP తమ్ముళ్లు

3లక్షల అమెరికన్ డైమండ్స్ తో గణపతి.. చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే

రఘు మాస్టర్ ని కలిశా నన్నే అన్ని చూసుకోమన్నారు

గంభీర్ సంచలన నిర్ణయం.. అభిషేక్ ఔట్ టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే

Photos

+5

హైదరాబాద్ : అబ్బా భలే ఉన్నాడే... గణేశుడు (ఫొటోలు)

+5

'ధురంధర్' భామ ఆయేషా బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ఆషికా.. బార్బీ డాల్‌కి ఏం తక్కువ కాదు! (ఫొటోలు)

+5

అందంతో టాప్ లేపిన మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

ఫ్యాన్స్‌ ఫైట్‌ చేస్తుంటే.. స్టార్స్‌ ఏం చేస్తున్నారో చూడండి! (ఫొటోలు)

+5

ఘనంగా ‘సైమా అవార్డ్స్ 2026’ సినీ స్టార్స్ సందడి (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి తొలిపూజకు వేళాయే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో వినాయక చవితి సందడి (ఫోటోలు)

+5

'మండాడి' సినిమా సక్సెస్ మీట్ (ఫోటోలు)

+5

విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం...చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫొటోలు)