ఎన్నికలకు ముందు ఒకరోజు జగన్ దగ్గరకి నేను పేర్ని నాని వెళ్లి... ఈ వీడియో చూస్తే చాలు
Breaking News
త్రిష రాగానే ముఖం పక్కకు తిప్పుకొన్న విజయ్
Published on Sun, 09/13/2026 - 13:47
తమిళ హీరో విజయ్ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నారు. కానీ చిన్న గ్యాప్ తీసుకుని లండన్ వెళ్లారు. అక్కడే సిల్వర్‌స్టోన్‌లో హీరో అజిత్ పాల్గొన్న రేసింగ్ ఈవెంట్‌ని వీక్షించారు. రేసింగ్ అనంతరం విజయ్-అజిత్ హగ్ చేసుకున్న ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అదే టైంలో విజయ్-త్రిష కలిసున్న ఫొటోలు, వీడియోలు కూడా కనిపించాయి.
(ఇదీ చదవండి: ముకేశ్ చాలా ఇష్టం.. కానీ చెప్పలేకపోతున్నా: దేబ్జానీ)
సీఎం కాకముందు వరకు పలు సందర్భాల్లో త్రిష-విజయ్ జంటగా కనిపించారు. కానీ తర్వాత వీళ్లిద్దరి గురించి పెద్దగా వార్తలు రాలేదు. మరోవైపు విజయ్ భార్య సంగీత.. విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఇది జరిగిన కొన్నాళ్లకు ఇప్పుడు విజయ్, త్రిష కలిసి రేసింగ్ ఈవెంట్ చూసేందుకు లండన్ వెళ్లారు. కాకపోతే త్రిష తన పక్కకు రాగానే విజయ్ ముఖం తిప్పుకోవడం ఇప్పుడు ట్విటర్లో హాట్ టాపిక్ అయిపోయింది.
ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయ్ పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేశారు. ఈయన చివరి సినిమా 'జన నాయగన్'.. రెండు నెలల క్రితం రిలీజైంది. ఇక త్రిష కెరీర్ విషయానికొస్తే ఈమె తెలుగులో చేసిన 'విశ్వంభర' విడుదల కావాల్సి ఉంది. మరోవైపు తమిళంలో వరస మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. మరోవైపు విజయ్ తప్పుకొన్న పెరంబూర్ స్థానంలో జరిగే ఉపఎన్నికల్లో ఈమె పోటీ చేస్తుందన్నారు గానీ ఆ విషయంలో ఇంకా క్లారిటీ రావట్లేదు.
(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన)
Thalapathy Vijay didn't expected her entry ? He looks UNCOMFORTABLE right after the moment trisha entered the frame 👀#Thalapathy #Vijay #Ajithkumar #TVK pic.twitter.com/2lDJpW5hnP
— Gokul (@ItzGokulVJ) September 12, 2026
Tags : 1