Breaking News

ప్రముఖ నటుడు కన్నుమూత.. సంతాపం తెలిపిన రజినీకాంత్‌

Published on Sat, 09/12/2026 - 20:10

తమిళ పండితుడు, ప్రముఖ  నటుడు, టీవీ వ్యాఖ్యాత సోలమన్ పప్పయ్య (90) కన్నుమూశారు. మదురైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. శనివారం ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. అనారోగ్యం తీవ్రం కావడానికి కొద్దిరోజుల ముందు వినాయక చవితి సందర్భంగా ప్రసారం కానున్న ప్రత్యేక పట్టిమండ్రం కార్యక్రమాన్ని ఆయన రికార్డు చేశారు.
రజినీకాంత్ సంతాపం
తమిళ భాష, సాహిత్యంపై విశేష సేవలు అందించిన సోలమన్ పప్పయ్య.. ‘పట్టిమండ్రం’ను పండితుల చర్చా వేదిక నుంచి సామాన్యుల ఇళ్లలోకి తీసుకెళ్లిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయన మృతిపై సూపర్‌స్టార్ రజినీకాంత్‌ సంతాపం వ్యక్తం చేశారు.
అనుకోకుండా సినిమాల్లోకి.. 
సోలమన్ పప్పయ్యకు నటనపై ప్రత్యేక ఆసక్తి లేదు.  అయితే ఆయన విలక్షణమైన గొంతు, హావభావాలు, ప్రజల్లో ఉన్న ఆదరణ దర్శకులను ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి.  ‘మాప్పిళ్లై’, ‘పుదు వరుషం’ చిత్రాల్లో కనిపించిన ఆయనకు దర్శకుడు శంకర్‌ మరిన్ని అవకాశాలు ఇచ్చారు.
ఇదీ చదవండి:పెళ్లి ఇద్దరిదీ.. కానీ అమ్మాయిలకే ఎందుకు అలా: నమిత

1999లో వచ్చిన ‘ముదల్వన్’లో నటించిన పప్పయ్య.. ఆ తర్వాత ‘బాయ్స్’, ‘ఎస్ మేడమ్’ చిత్రాల్లోనూ కనిపించారు. అయితే రజినీకాంత్‌హీరోగా తెరకెక్కిన ‘శివాజీ: ది బాస్‌’ ఆయన సినీ ప్రయాణంలో ప్రత్యేకంగా నిలిచింది. ఇందులో థొండైమాన్ పాత్రలో రజినీకాంత్‌తో కలిసి చేసిన సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

200కు పైగా అవకాశాలు..
‘శివాజీ’ విజయం తర్వాత సోలమన్ పప్పయ్యకు ఏకంగా 200కు పైగా సినిమా అవకాశాలు వచ్చినట్లు సమాచారం. అయితే ఆయన ఒక్క అవకాశాన్నీ అంగీకరించలేదు. తన అసలు రంగమైన తమిళ సాహిత్యం, పట్టిమండ్రానికే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

‘శివాజీ’లోని అంగవై, సంగవై పాత్రలకు సంబంధించిన కామెడీ సన్నివేశంపై ఆయన తర్వాత పశ్చాత్తాపం వ్యక్తం చేశారట. అంగవై, సంగవై పేర్లు తమిళ చరిత్రలో ప్రత్యేక ప్రాధాన్యం ఉన్నవని, వాటిని అలాంటి హాస్య సన్నివేశానికి ఉపయోగించడం సరికాదని అభిప్రాయపడ్డారట. ఈ కారణంగానే సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: ఎంగిలి గ్లాసులు కడిగిన నాగార్జున.. ఆ ముగ్గురు ఫిదా!

పద్మశ్రీతో గౌరవం..
తమిళ భాష, సాహిత్యం, ప్రజా చైతన్యానికి చేసిన సేవలకు గుర్తింపుగా తమిళనాడు ప్రభుత్వం 2000లో సోలమన్ పప్పయ్యను ‘కలైమామణి’ పురస్కారంతో సత్కరించింది. 2021లో 85 ఏళ్ల వయసులో భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందించింది. ఆరు దశాబ్దాలకు పైగా తమిళ భాష కోసం సేవలందించిన ఆయన మృతి తమిళ సాహితీ, సాంస్కృతిక రంగానికి తీరని లోటుగా మారింది.

 

Videos

10 వేలతో 9 లక్షల లాభం.. HDFC Flexi Cap Fund రికార్డ్ రిటర్న్స్

జగన్ లేకపోతే నేను లేను.. అందరి ముందు కన్నీళ్లు పెట్టుకున్న బద్దుకొండ అప్పలనాయుడు

2లక్షలు వసూలు చేసిన హిజ్రాలపై కేసు

చేసిందంతా ఆ ఇద్దరే! జూడో అసోసియేషన్ లీలలు

ముంచుకొస్తున్న 76 కిలోమీటర్ల ఉపద్రవం.. నాసా కెమెరాకు చిక్కిన సాక్ష్యం

పుష్ప రేంజ్ లో ఛేజింగ్.. పరారైన స్మగ్లర్లు

స్పిరిట్ ని తొక్కండి చూద్దాం... క్రిటిక్స్ కు వంగా తమ్ముడు సవాల్

భక్తుల దర్శనానికి సిద్ధమైన ఖైరతాబాద్ గణేషుడు

వాళ్ళు నా దగ్గర డబ్బు తీసుకుని ఒక్కటే హామీ ఇచ్చారు.. బాధితుడు షాకింగ్ నిజాలు

కార్యకర్తల కోసం కదిలిన జగనన్న.. గోల్డ్, సిల్వర్ కార్డ్స్

Photos

+5

'మండాడి' సినిమా సక్సెస్ మీట్ (ఫోటోలు)

+5

విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం...చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫొటోలు)

+5

వినాయక చవితి రోజు తప్పక సమర్పించాల్సిన 21 పత్రాలు.. (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత.. ఈ ఫోటోలు చూశారా?

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (సెప్టెంబర్ 13 -సెప్టెంబర్ 19)

+5

'ఎపిక్' షూటింగ్‌లో ఆనంద్-వైష్ణవి గ్యాంగ్ ఇలా (ఫొటోలు)

+5

వినాయకుడికి ఇష్టమైన 10 ప్రసాదాలు... మీరు ఓ లుక్ వేయండి (ఫొటోలు)

+5

సమంత స్టన్నింగ్‌ లుక్స్‌ అదుర్స్‌ (ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహాగణపతి ఆగమన కార్యక్రమం (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)