Breaking News

భారత రోడ్లపై పుతిన్‌ కారు.. ప్రత్యేకతలు ఇవే!

Published on Sat, 09/12/2026 - 13:59

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత్‌ పర్యటన మరోసారి ఆయన ప్రత్యేక భద్రతా ఏర్పాట్లపై ఆసక్తిని పెంచింది. 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు న్యూఢిల్లీకి చేరుకున్న పుతిన్‌ వెంట భారీ భద్రతా కాన్వాయ్‌ కూడా వచ్చింది. ఆయన ప్రయాణించే ప్రత్యేక అధ్యక్ష విమానంతో పాటు, అత్యంత భద్రతతో కూడిన ఆరస్‌ సెనాట్‌ (Aurus Senat) లిమోసిన్‌ కూడా విదేశీ పర్యటనలకు తరలించడం రష్యా అధ్యక్షుడి భద్రతా వ్యవస్థలో కీలక భాగంగా మారింది.

ప్రపంచ దేశాల అధినేతలు విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు స్థానికంగా ఏర్పాటు చేసిన అధికారిక వాహనాలను ఉపయోగించడం సాధారణం. అయితే పుతిన్‌ మాత్రం విదేశీ పర్యటనల్లోనూ తన కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఆరస్‌ సెనాట్‌ వాహనాన్నే వినియోగిస్తారు. అత్యాధునిక రక్షణ వ్యవస్థలతో కూడిన ఈ లిమోసిన్‌ను అందుకే ‘ఫోర్ట్రెస్‌ ఆన్‌ వీల్స్‌’గా అభివర్ణిస్తుంటారు.

పుతిన్‌ కారు ప్రత్యేకత ఏంటి?

పుతిన్‌ కాన్వాయ్‌లో సాధారణంగా భారీ సంఖ్యలో వాహనాలు ఉంటాయి. విదేశీ పర్యటనల సమయంలో మాత్రం ఆయన ప్రయాణించే ఆరస్‌ సెనాట్‌కు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. బుల్లెట్‌ ప్రూఫ్‌, పేలుళ్లను తట్టుకునే సామర్థ్యం వంటి రక్షణ వ్యవస్థలతో ఈ కారును రూపొందించినట్లు తెలుస్తోంది.

ఆరస్‌ సెనాట్‌ను రష్యాకు చెందిన ఆరస్‌ మోటార్స్‌ అభివృద్ధి చేసింది. రష్యన్‌ స్టేట్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నామి, సోలర్స్‌ జేఎస్సీ, యూఏఈకి చెందిన తవాజున్‌ హోల్డింగ్‌ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. రష్యా ప్రభుత్వం దేశీయంగా అత్యాధునిక లగ్జరీ, రక్షణ వాహనాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో చేపట్టిన ‘కోర్టెజ్‌’ ప్రాజెక్టులో భాగంగా సెనాట్‌ రూపొందింది. 2018లో ఈ మోడల్‌ను పరిచయం చేశారు. దీని డిజైన్‌కు సోవియట్‌ కాలం నాటి ZIS-110 లిమోసిన్‌ నుంచి స్ఫూర్తి పొందినట్లు చెబుతారు.

ఇంజిన్‌.. వేగం

పుతిన్‌ ఉపయోగించే ఆరస్‌ సెనాట్‌లో 4.4 లీటర్‌ ట్విన్‌ టర్బోచార్జ్డ్‌ V8 ఇంజిన్‌, హైబ్రిడ్‌ వ్యవస్థతో కలిపి పనిచేస్తుంది. ఇది సుమారు 598 హార్స్‌పవర్‌, 880 ఎన్ఎం టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. 9-స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌తో ఈ కారు పనిచేస్తుంది.

సెనాట్‌ పొడవు సుమారు 5,630 మిల్లీమీటర్లు, వెడల్పు 2,000 మిల్లీమీటర్లు, ఎత్తు 1,700 మిల్లీమీటర్లుగా ఉంటుంది. గరిష్ఠంగా గంటకు 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల ఈ లిమోసిన్‌.. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని సుమారు 9 సెకన్లలో చేరగలదని సమాచారం.

భద్రతకు పెద్దపీట

రష్యా అధ్యక్షుడి కోసం రూపొందించిన ఈ ప్రత్యేక వాహనంలో అత్యున్నత స్థాయి భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేశారు. బుల్లెట్‌ ప్రూఫ్‌ రక్షణతో పాటు పేలుళ్ల నుంచి రక్షణ కల్పించేలా దీన్ని రూపొందించినట్లు సమాచారం. యాక్టివ్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌, లేన్‌ డిపార్చర్‌ వార్నింగ్‌, ఎలక్ట్రానిక్‌ ట్రాక్షన్‌ కంట్రోల్‌, అధునాతన బ్రేకింగ్‌ వ్యవస్థలు వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

భద్రతతో పాటు సౌకర్యాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. అధిక నాణ్యత కలిగిన లెదర్‌, వుడ్‌ ట్రిమ్‌, ఆధునిక ఇన్ఫోటైన్‌మెంట్‌ వ్యవస్థలతో కారు ఇంటీరియర్‌ను రూపొందించారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేసేలా ఈ వాహనాన్ని తీర్చిదిద్దినట్లు సమాచారం.

మూమూలు ప్రజలూ వాడొచ్చు!

ఆరస్‌ సెనాట్‌కు సాధారణ పౌరుల కోసం ప్రత్యేక వెర్షన్‌ కూడా ఉంది. అయితే దీని ఉత్పత్తిని పరిమిత సంఖ్యలోనే చేపడుతున్నట్లు సమాచారం. పౌర వెర్షన్‌ ధర సుమారు 18 మిలియన్‌ రూబిళ్లు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.2.5 కోట్లు.అయితే పుతిన్‌ ఉపయోగించే ప్రత్యేక అధ్యక్ష వెర్షన్‌ ధర, రక్షణ స్థాయి వంటి వివరాలు సాధారణంగా బహిరంగంగా వెల్లడించరు.

గత ఏడాది చైనాలో జరిగిన షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (SCO) శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పుతిన్‌తో కలిసి ఇదే ఆరస్‌ సెనాట్‌లో ప్రయాణించడం కూడా అప్పట్లో ప్రత్యేకంగా వార్తల్లో నిలిచింది. దీంతో రష్యా అధ్యక్షుడి ప్రత్యేక లిమోసిన్‌పై ప్రపంచవ్యాప్తంగా మరోసారి ఆసక్తి పెరిగింది.

Videos

10 వేలతో 9 లక్షల లాభం.. HDFC Flexi Cap Fund రికార్డ్ రిటర్న్స్

జగన్ లేకపోతే నేను లేను.. అందరి ముందు కన్నీళ్లు పెట్టుకున్న బద్దుకొండ అప్పలనాయుడు

2లక్షలు వసూలు చేసిన హిజ్రాలపై కేసు

చేసిందంతా ఆ ఇద్దరే! జూడో అసోసియేషన్ లీలలు

ముంచుకొస్తున్న 76 కిలోమీటర్ల ఉపద్రవం.. నాసా కెమెరాకు చిక్కిన సాక్ష్యం

పుష్ప రేంజ్ లో ఛేజింగ్.. పరారైన స్మగ్లర్లు

స్పిరిట్ ని తొక్కండి చూద్దాం... క్రిటిక్స్ కు వంగా తమ్ముడు సవాల్

భక్తుల దర్శనానికి సిద్ధమైన ఖైరతాబాద్ గణేషుడు

వాళ్ళు నా దగ్గర డబ్బు తీసుకుని ఒక్కటే హామీ ఇచ్చారు.. బాధితుడు షాకింగ్ నిజాలు

కార్యకర్తల కోసం కదిలిన జగనన్న.. గోల్డ్, సిల్వర్ కార్డ్స్

Photos

+5

'మండాడి' సినిమా సక్సెస్ మీట్ (ఫోటోలు)

+5

విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం...చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫొటోలు)

+5

వినాయక చవితి రోజు తప్పక సమర్పించాల్సిన 21 పత్రాలు.. (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత.. ఈ ఫోటోలు చూశారా?

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (సెప్టెంబర్ 13 -సెప్టెంబర్ 19)

+5

'ఎపిక్' షూటింగ్‌లో ఆనంద్-వైష్ణవి గ్యాంగ్ ఇలా (ఫొటోలు)

+5

వినాయకుడికి ఇష్టమైన 10 ప్రసాదాలు... మీరు ఓ లుక్ వేయండి (ఫొటోలు)

+5

సమంత స్టన్నింగ్‌ లుక్స్‌ అదుర్స్‌ (ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహాగణపతి ఆగమన కార్యక్రమం (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)