Breaking News

‘డాల్ఫిన్‌ గార్డ్‌’..! ఆరేళ్ల చిన్నారి ఘనత..

Published on Thu, 09/10/2026 - 13:34

సముద్రంలో మనుషుల కార్యకలాపాలు పెరుగుతున్నకొద్దీ అందులోని జీవుల మనుగడకు ముప్పు ఏర్పడుతోంది. ముఖ్యంగా పడవలు తిరిగే ప్రాంతాల్లో డాల్ఫిన్లు ప్రమాదకర పరిస్థితుల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇందుకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో ఏదైనా పరిష్కారం చూపించగలమా? అనే ప్రశ్న ఓ ఆరవ తరగతి బాలికను ఆలోచింపజేసింది. అలా ఆమె ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిందే డాల్ఫిన్‌ గార్డ్‌ ప్రాజెక్ట్‌. అదే పరిశోధన ఆమెను బుల్లిశాస్త్రవేత్తగానూ, స్టేట్‌ విన్నర్‌ గానూ నిలిచేలా చేసింది.

అమెరికాలోని వర్జీనియా బీచ్, ఓల్డ్‌ డొనేషన్‌ స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్న ఇషాన్వి సఖార్పే రూపొందించిన ‘డాల్ఫిన్‌ గార్డ్‌’ అనే ప్రాజెక్ట్‌ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఆవిష్కరణకు గాను ఆమెకు 2026 వర్జీనియా రాష్ట్ర ప్రతిభా పురస్కారం, ప్రత్యేక గుర్తింపు లభించాయి. డాల్ఫిన్‌లు ప్రమాదంలో చిక్కుకున్న తర్వాత రక్షించడం కంటే.. అసలు ప్రమాదమే జరగకుండా ముందుగానే చర్యలు తీసుకోవడం మంచిదన్నది అసలు డాల్ఫిన్‌ గార్డ్‌ ప్రాజెక్ట్‌ ముఖ్య ఉద్దేశం.. 

పడవల ప్రొఫెల్లర్లు, చేపల వలలు వంటి వాటి వల్ల డాల్ఫిన్లకు తీవ్రమైన ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సముద్రంలో మానవ కార్యకలాపాలు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య కూడా పెరుగుతోంది. అందుకే ప్రమాదాన్ని గుర్తించి, అది తీవ్రమయ్యేలోపే తగ్గించే మార్గం గురించి ఇషాన్వి తన ప్రాజెక్ట్‌లో పరిశోధించింది. అదే డాల్ఫిన్‌ గార్డ్‌ ప్రత్యేకత. 

అయితే ఇషాన్వి ప్రాజెక్ట్‌ సాధారణ స్కూల్‌ సైన్స్‌ ప్రాజెక్ట్‌గా మిగిలిపోలేదు. అమెరికాలోని మిడిల్‌ స్కూల్‌ విద్యార్థుల కోసం నిర్వహించే ప్రతిష్టాత్మక ‘3ఎం’ యంగ్‌ సైంటిస్ట్‌ ఛాలెంజ్లో ఆమె ఇదే కాన్సెప్ట్‌తో పాల్గొంది. ఈ పోటీలో విద్యార్థులు తమ శాస్త్రీయ ఆలోచన లేదా ఆవిష్కరణను చిన్న వీడియో ద్వారా పరిచయం చేయాలి. కొత్త ఆలోచన, శాస్త్రీయ పరిజ్ఞానం, సమస్య పరిష్కార సామర్థ్యం, కమ్యూనికేషన్, ప్రదర్శన వంటి అంశాల ఆధారంగా ప్రాజెక్టులను పరిశీలిస్తారు. 

అయితే ఇషాన్వి రూపొందించిన ఈ ‘డాల్ఫిన్‌ గార్డ్‌’ప్రాజెక్టు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చివరకు ఆమె వర్జీనియా స్టేట్‌ మెరిట్‌ విన్నర్‌గా నిలిచింది. ఇషాన్వికి సైన్స్‌పై మాత్రమే ఆసక్తి ఉందనుకుంటే పొరపాటే. గణితంలోనూ ఆమెకు మంచి ప్రతిభ ఉంది. ఎన్నో మెడల్స్‌ని సైతం గెలుచుకుంది.

చాలామంది పిల్లలు సైన్స్‌ను పాఠ్యపుస్తకాల్లో నేర్చుకుంటారు. కానీ ఇషాన్వి మాత్రం తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించింది. అందులోని సమస్యను గుర్తించి.. దానికి శాస్త్రీయ పరిష్కారం వెతికే ప్రయత్నం చేసింది. అదే ఆమెను నేడు బుల్లి శాస్త్రవేత్తగా నిలబెట్టింది.  

#

Tags : 1

Videos

YSRCP నేతలతో గుడివాడ అమర్నాథ్ అత్యవసర మీటింగ్

దుమ్మురేపుతున్న సామ్సంగ్.. ఫోల్డబుల్ ఫోన్ లో ఏది బెస్ట్

ప్రభుత్వ స్కూల్ లో దారుణం 9వ తరగతి విద్యార్థినిపై టీచర్....

ప్రియాంక చనిపోక ముందు రోజు... డాక్టర్ ప్రియాంక తండ్రి ఎమోషనల్ వీడియో

స్టార్టింగ్ లోనే భారీ షాక్.! చరణ్ కాదు కృష్ణుడు అవుట్?

Advocate : నేను కూడా ఏదో ఒక రోజు చనిపోతా... కానీ చనిపోయే ముందు

భారీగా తగ్గిన బంగారం ధరలు ఇప్పుడు కొనకపోతే.. తులం ఎంతంటే?

ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు!

జుట్టు పట్టి.. చీర లాగి.. ద్రౌపదికి జరిగిన అవమానమే మాకు జరిగింది

బంజారా హిల్స్ లో బిగ్ యాక్సిడెంట్ మహిళలకు తీవ్ర గాయాలు

Photos

+5

హైదరాబాద్ లో ఆకట్టుకున్న వెరైటీ గణనాథులు (ఫొటోలు)

+5

'ఇరుముడి' సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో సినీ నటి కృతి శెట్టి (ఫొటోలు)

+5

పుట్టినరోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రియ శరణ్‌ (ఫొటోలు)

+5

కేరళ కుట్టీలా మారిపోయిన 'ధురంధర్' భామ.. (ఫొటోలు)

+5

చీరలో నాజూగ్గా నభా నటేశ్.. (ఫొటోలు)

+5

సౌండ్ బాక్స్‌తో గ్లామరస్ శ్రుతి హాసన్.. (ఫొటోలు)

+5

కామాఖ్య దేవాలయాన్ని దర్శించుకున్న ఉపాసన.. (ఫొటోలు)

+5

'ఖైదీ' పాప ఇప్పుడెలా ఉందో చూశారా? ఏడేళ్ల తర్వాత మళ్లీ కలిశారు (ఫొటోలు)

+5

ఆదిలాబాద్ జిల్లాలో పోలాల అమావాస్య వేడుకలు...(ఫొటోలు)