Breaking News

‘జెమ్‌మ్యాక్సింగ్‌’ ట్రెండ్‌! జస్ట్‌ బ్లింగ్‌ జోడిస్తే ఆ లుక్కే అదుర్స్‌

Published on Wed, 09/09/2026 - 15:18

ఒకప్పుడు అందంగా కనిపించాలంటే ఖరీదైన వస్తువులు కొనాలి అనుకునేవారు. ఇప్పుడు మాత్రం చేతిలో ఉన్న సాధారణ వస్తువును .. కాస్త క్రియేటివిటీ జోడించి అందంగా మార్చుకోవడమే ఫ్యాషన్‌గా మారింది. అదే జెమ్‌మ్యాక్సింగ్‌. అంటే వస్తువులు, దుస్తులు, నగలు, యాక్సెసరీస్‌ వంటి వాటికి రంగు, మెరుపు, రత్నాలు, క్రిస్టల్స్‌ జోడించి వాటిని మరింత ఆకర్షణీయంగా మార్చే కళకే జెమ్‌ మ్యాక్సింగ్‌ అని పేరు. 

ఫోన్‌  కవర్‌కు రంగురంగుల రాళ్లు.. కాఫీ కప్పుకు చిన్న క్రిస్టల్స్‌.. లిప్‌స్టిక్‌ బాటిల్‌కు మెరిసే స్టోన్స్‌ .. గోళ్లపై రకరకాల జెమ్స్‌.. ఇలా కనిపించిన ప్రతిదానికీ ‘బ్లింగ్‌’ జోడిస్తే ఆ లుక్కే వేరు. సాధారణ వస్తువే అందంగా.. అద్భుతంగా కనిపిస్తుంది. కొన్నేళ్లులగా వస్తున్న మినిమలిజానికి బైబై చెప్తూ.. ‘జెమ్‌మ్యాక్సింగ్‌’, ‘విమ్సీమ్యాక్సింగ్‌’, ‘రైన్‌స్టోన్‌ మ్యాక్సింగ్‌’ పేర్లతో పిలుస్తున్న ఈ నయా ట్రెండ్‌ నేటి యువతను విపరీతంగా ఆకర్షిస్తోంది. 

ఖరీదైనవే కానక్కర్లేదు!
ఈ ట్రెండ్‌కు ఒక పరిమితి లేదు. పర్ఫ్యూమ్‌ బాటిల్, మేకప్‌ ప్యాకేజింగ్, హెయిర్‌ క్లిప్స్, హ్యాండ్‌బ్యాగ్స్, షూస్, నెయిల్స్, ఫోన్‌ కవర్, కాఫీ కప్పు, వాటర్‌ బాటిల్, లిప్‌స్టిక్, కేకులు.. ఒక్కటేమిటి, ఏదైనా కాన్వాస్‌గా మారి΄ోతుంది.. అలాగని దీనికి ఖరీదైన జెమ్స్‌తో పనిలేదు. చిన్న రైన్‌స్టోన్స్, ΄్లాస్టిక్‌ జెమ్స్, ముత్యాలు, చార్మ్స్, స్టిక్కర్లు వంటి వాటితోనూ అందమైన లుక్‌ను సృష్టి్టంచవచ్చు. జ్యువెలరీలో అయితే పెద్ద రంగురంగుల రాళ్లు, లేయర్డ్‌ నెక్లెస్‌లు, స్టేట్‌మెంట్‌ రింగులు, భారీ చెవిపోగులతో ‘ఎంత ఎక్కువైతే అంత మంచిది’ అన్నట్టుగా మాగ్జిమలిస్ట్‌ లుక్‌ కనిపిస్తోంది.  

పాత జ్ఞాపకాలకు కొత్త మెరుపు
ఈ ట్రెండ్‌ వెనుక ఓ నోస్టాల్జియా కూడా బలంగా ఉంది. 1990ల చివరి, 2000 ప్రారంభంలో బెడ్‌ జిల్డ్‌ ఫోన్‌లు, మెరిసే జీన్స్‌, రైన్‌స్టోన్‌ టాప్‌లు, గ్లిట్టర్‌ మేకప్, అలంకరించిన యాక్సెసరీస్‌ యువతలో ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి. అప్పటి ఆ మెరుపు ఇప్పుడు కొత్త తరం చేతుల్లోకి వచ్చింది. అయితే అప్పటిలా ఒకే రకమైన బ్లింగ్‌ కాకుండా.. ఇప్పుడు వ్యక్తిగత అభిరుచికి తగినట్టుగా మార్చుకుంటున్నారు.

మినిమలిజానికి బైబై!
నిన్నామొన్నటి వరకు మినిమలిజం వంటి ధోరణే లగ్జరీకి మారుపేరుగా మారింది. అంటే తక్కువ రంగులు, సింపుల్‌ నగలు, సాదాసీదా డిజైన్లు.. ఇవే ఖరీదైన స్టైల్‌కు గుర్తులుగా మారాయి. ఇప్పుడు మాత్రం పరిస్థితి మారుతోంది. ప్రతి వస్తువునూ అందంగా ఆలంకరించుకోవాలనే ఆలోచన పెరుగుతోంది. అంతేకాదు ఈ ట్రెండ్‌ వస్తువులకే కాదు బ్యూటీకి కూడా చేరింది. ముఖంపై చిన్న క్రిస్టల్స్, బాడీ జెమ్స్, జెమ్‌ నెయిల్స్‌ వంటి లుక్స్‌ సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి.

ఒకప్పుడు ‘తక్కువే’ లగ్జరీ అనేది ఫ్యాషన్‌ మంత్రంగా ఉండేది. ఇప్పుడు మాత్రం ‘ఎక్కువే’ లగ్జరీ అన్నట్టుగా మారుతోంది. ఈ మెరుపులు మాగ్జిమలిజం తిరిగి వస్తోందనడానికి మరో సంకేతంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వినూత్న ఆభరణాలు, అలంకార వస్తువుల కోసం నెట్‌లో సెర్చింగ్‌ గత ఏడాదితో పోలిస్తే 50 శాతం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. 
మహిళలకే కాదు..
సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు సైతం ఈ ట్రెండ్‌ని ఫాలో అవుతూ ప్రచారం కల్పిస్తుండటంతో.. యూత్‌ ఎక్కువగా దీనిని అనుసరిస్తోంది. ఈ జెమ్‌మ్యాక్సింగ్‌ మహిళల ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం కాదు. మగవారి దుస్తుల్లోనూ రై స్టోన్‌ షర్ట్స్, జాకెట్లు, షూస్, టోపీలు వంటి వాటిల్లోనూ దొరుకుతున్నాయి. 
 

#

Tags : 1

Videos

బెయిల్ వచ్చింది.! బిగ్ బాస్ లోకి రమానందన ఎప్పుడంటే?

జియో రూ.111 రీఛార్జ్ మతిపోగొట్టే బెనిఫిట్స్

నేషనల్ అవార్డు... క్యాష్ బహుమతిగా ఇస్తే, ఈ రోజు లోకేష్ జాబ్ ఇవ్వకుండా చేశాడు

నేను వస్తున్నానా లేదా అని నా అడ్వకేట్ ఇంటికి CCకెమెరాలు పెట్టించడం ఏంటీ

కులం గొప్పది కాదు మానవత్వం గొప్పది

మజ్జి శ్రీను పార్టీ మారడంపై బొత్స ఇంటి వద్ద అత్యవసర మీటింగ్

బాబును ఇమిటేట్ చేస్తూ ఏకిపారేసిన జగన్

కూకట్ పల్లి హోటల్ లో దారుణం కుళ్లిన 30 కేజీల మటన్, 20 కేజీల చికెన్

అందర్నీ కొనేసింది.! షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాధితుడు

పాన్ ఇండియా బరిలోకి దిగుతున్నారా? డిసెంబర్ లో ఒకేసారి సినిమాలు

Photos

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)

+5

‘కళ్యాణం కమనీయం జీవితం’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)