Breaking News

'ప్రాపర్టీ కొంటే చాలు' అనుకుంటున్నారా?.. కియోసాకి హెచ్చరిక ఇదే!

Published on Tue, 09/08/2026 - 18:59

రియల్ ఎస్టేట్ ఎప్పుడూ.. పెడుతూనే ఉంటుందని చాలామంది భావిస్తారు. కానీ, ఇది అన్ని ప్రాంతాలకు వర్తించదని రాబర్ట్ కియోసాకి అంటున్నారు. దీనికి కారణం ఏమిటి?, ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉందనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

రాబర్ట్ కియోసాకి ప్రకారం.. గతంలో జనాభా పెరుగుదల, తగ్గిన వడ్డీ రేట్లు, తక్కువ ఇన్సూరెన్స్ ఖర్చులు వంటి అంశాలు ప్రాపర్టీ మార్కెట్‌కు అనుకూలంగా ఉండేవి. కానీ.. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కాబట్టి ఏ ప్రాపర్టీ కొన్నా భవిష్యత్తులో లాభమే వస్తుందని అనుకోవడం తప్పు.

రియల్ ఎస్టేట్‌.. రెండు రకాలు!
ప్రస్తుతం రియల్ ఎస్టేట్‌ను రెండు రకాలుగా చూడాలి. ఉద్యోగాలు, జనాభా, ఆదాయాలు పెరుగుతున్న మంచి ప్రాంతాల్లో ప్రాపర్టీలకు డిమాండ్ కొనసాగుతుంది. మరోవైపు.. జనాభా తగ్గుతున్న ప్రాంతాలు, ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రాపర్టీ విలువ పెరగకపోవచ్చు. ఇలాంటి ప్రాంతాల్లో ట్యాక్స్, ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్ ఖర్చులు మాత్రం పెరిగే అవకాశం ఉంటుంది.

ప్రాపర్టీ అంటే కేవలం ఆస్తి కాదు
ఇల్లు లేదా భూమిని కొనుగోలు చేసిన తర్వాత దాని బాధ్యత కూడా మనదే. ట్యాక్స్‌లు, ఇన్సూరెన్స్, రిపేర్లు, మెయింటెనెన్స్ వంటి ఖర్చులను భరించాలి. ప్రాపర్టీ విలువ పెద్దగా పెరగకపోయినా.. ఈ ఖర్చులు పెరుగుతుంటే యజమానికి నెమ్మదిగా నష్టం రావచ్చు. అందుకే ప్రాపర్టీ కొనడం అంటే కేవలం పెట్టుబడి పెట్టడం కాదు.. దాని భవిష్యత్ బాధ్యతను కూడా తీసుకోవడం.

పెద్ద ఇన్వెస్టర్లు ఏం చూస్తారు?
పెద్ద పెట్టుబడిదారులు ప్రాపర్టీ కొనేటప్పుడు కేవలం 'ధర తక్కువగా ఉందా?' అని చూడరు. రాబోయే పదేళ్లలో ఈ ఆస్తికి డిమాండ్ ఉంటుందా, ఇన్సూరెన్స్ లభిస్తుందా, ట్యాక్స్‌లు ఎంత పెరుగుతాయి, అద్దె ఆదాయం ఎలా ఉంటుంది, అవసరమైనప్పుడు సులభంగా అమ్మగలమా వంటి విషయాలను పరిశీలిస్తారు. అంటే.. లాభం కంటే ముందు రిస్క్‌ను అర్థం చేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారు.

రియల్ ఎస్టేట్ ఇప్పటికీ సంపదను సృష్టించగల పెట్టుబడే. కానీ.. ఏ ప్రాపర్టీ అయినా సంపదను పెంచుతుందని నమ్మడం మాత్రం ప్రమాదకరం. సరైన ప్రాంతం, బలమైన డిమాండ్, భవిష్యత్ ఖర్చులు, రిస్క్‌లను అర్థం చేసుకుని పెట్టుబడి పెట్టాలి.

Videos

వైఎస్ జగన్ 27% IR ఇస్తామన్నారు, ఇచ్చారు...! నువ్వు ఏం ఇచ్చావ్ బాబు

అసలు గేమ్ ఇదేనా..? అడ్డంగా దొరికిపోయింది.. ఇక నందన చాప్టర్ క్లోజ్!

AlphaGeo: డేంజర్ జోన్ లో హైదరాబాద్.. ప్రకృతి వార్నింగ్

YS జగన్ పాదయాత్ర డేట్ ఫిక్స్

వివేకా కేసులో వీడిన మిస్టరీ...? కారుమూరి సంచలన వ్యాఖ్యలు

తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా.. పోలీసులకు సాదిక్ ఖాన్ సమాధానాలు?

Paradise: ఆ పాట లేకుండానే రిలీజ్.?

2029.. ఏ ఒక్కడిని వదిలిపెట్టను... అనిల్ కుమార్ యాదవ్ మాస్ వార్నింగ్

మజ్జి శ్రీనివాసరావు TDPలో చేరికపై కొండ రాజీవ్ స్ట్రాంగ్ రియాక్షన్

యూకేలో అల్లకల్లోలం.. వెయ్యికి పైగా విమానాలు రద్దు..

Photos

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)