Breaking News

తలగడలోని డస్ట్‌మైట్స్‌తో అలర్జీలు!

Published on Sun, 09/06/2026 - 09:47

అలర్జీలతో బాధపడుతున్నప్పుడు దానికి కారణాలేమిటంటూ ఒక్కోసారి తలబద్ధలు కొట్టుకుంటూ ఉంటాంగానీ... ఒక్కోసారి అవి మన తల దగ్గరా లేదా మన కాళ్ల కిందా కూడా ఉండవచ్చు. అంటే... ఒక్కోసారి మన తలగడలోనే డస్ట్‌మైట్స్‌ నివసిస్తూ ఉండవచ్చు. లేదా మన కాళ్ల కింద ఉండే కార్పెట్‌లలోనైనా ఉండవచ్చు. 

దాదాపు 30 గ్రాముల దుమ్ములో కనీసం 14,000 వరకు డస్ట్‌మైట్స్‌ ఉండవచ్చని ఒక అంచనా. ఒక చదరపు గజం విస్తీర్ణంలో కనీసం 1,00,000 (లక్ష) డస్ట్‌ మైట్స్‌ ఉండవచ్చు. ఒక పరుపులో కనీసం కోటి డస్ట్‌మైట్స్‌ ఉంటాయని కూడా ఒక అంచనా. దుమ్ము కారణంగా అలర్జీ కలుగుతుందని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి దుమ్ములోని ఈ డస్ట్‌మైట్స్‌ వల్లనే అలర్జీ వస్తుంది. అవి విసర్జించే విసర్జకాల కారణంగా ఈ అలర్జీలు కలుగుతుంటాయి. 

ఒక్కో డస్ట్‌మైట్‌ తన జీవితకాలంలో 300 మిల్లీగ్రాముల విసర్జకాలను వెలువరిస్తుంది. ఒక్కోసారి ఆ అలర్జీలు కొన్నిసార్లు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకూ దారితీయవచ్చు. అందుకే... ఈ అలర్జీలను నివారించడానికి తాము ఉపయోగించే తలగడ తాలూకు పిల్లో కవర్లను తరచూ ఉతికి శుభ్రపరిచి వాడాలి. అలాగే వాక్యూమ్‌ క్లీనర్ల సహాయంతో మన కార్పెట్లను కూడా క్రమంతప్పకుండా శుభ్రపరుస్తూ ఉండటం ఆరోగ్యానికి చాలా మంచిది. 

(చదవండి: ఎంపీ సుప్రియా సూలే ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఇదే..! 50 ఏళ్ల వయసులోనూ..)

Videos

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..

SBI గుడ్ న్యూస్.. రూ.15 లక్షల స్కాలర్ షిప్!

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

Photos

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)