DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?
Breaking News
టాటా.కార్స్ నుంచి కర్వ్ ‘సిరీస్ ఎక్స్’
Published on Sat, 09/05/2026 - 09:18
టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహన విభాగం తన ‘కర్వ్’ మోడల్లో ‘సిరీస్ ఎక్స్’ కార్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ శ్రేణి ప్రారంభ ధరను రూ.9.99 లక్షలు (ఎక్స్–షోరూమ్)గా నిర్ణయించింది. కూపే తరహా డిజైన్, పనితీరు, సౌకర్యం, ప్రీమియం ఫీచర్లు, భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఈ కొత్త రేంజ్‌ను తీసుకొచి్చనట్లు కంపెనీ తెలిపింది. ‘సిరీస్ ఎక్స్’లో ప్యూర్ ఎక్స్ రూ.10.99 లక్షల ప్రారంభ ధరతో, ప్యూర్ ఎక్స్ ప్లస్ రూ.11.79 లక్షలతో, క్రియేటివ్ ఎక్స్ ప్లస్ రూ.12.91 లక్షలతో అందుబాటులోకి వచ్చాయి. ప్యూర్ ఎక్స్ ప్లస్ ఆధారిత ‘డార్క్’ ఎడిషన్‌ను రూ.11.99 లక్షల ప్రారంభ ధరతో అందిస్తోంది.
ప్యూర్ ఎక్స్ వేరియంట్లో 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, క్రూయిజ్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్‌ల్యాంప్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్యూర్ ఎక్స్ ప్లస్‌లో అదనంగా ప్రీమియం లెదరెట్ సీట్లు, 17 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ లభిస్తాయి.
క్రియేటివ్ ఎక్స్ ప్లస్ వేరియంట్లో పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్, 18 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, డిజిటల్ కాక్‌పిట్, నావిగేషన్ డిస్ప్లే వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.
అకెంప్లిష్డ్ ఎక్స్, అకెంప్లి‹Ù్డ ఎక్స్ ప్లస్ టాప్–ఎండ్ మోడళ్లలో లెవెల్–2 ఏడీఏయస్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 6–వే పవర్డ్ డ్రైవర్ సీట్, జేబీఎల్ సౌండ్ సిస్టమ్, 9 స్పీకర్లు, వైర్లెస్ ఛార్జర్, ట్విన్–జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫైయర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, అలెక్సా ఇంటిగ్రేషన్ వంటి అధునాతన ఫీచర్లు అందిస్తున్నట్లు టాటా మోటార్స్ తెలిపింది.
డార్క్ ఎడిషన్‌ను బ్లాక్–అవుట్ రూపాన్ని కోరు కునే వినియోగదారుల కోసం ప్యూర్ ఎక్స్ ప్లస్ వేరియంట్ ఆధారంగా రూ.11.99 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ సీసీఓ వివేక్ శ్రీవత్స మాట్లాడుతూ.. ‘‘భారతదేశంలో ఎస్యూవీ డిజైన్ ఆలోచనా విధానాన్ని ‘కర్వ్’ మార్చివేసింది. రూ.9.99 లక్షల ప్రారంభ ధరతో వస్తున్న కర్వ్ సిరీస్ ఎక్స్ మరింత మంది వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది. ఎలాంటి రాజీ లేకుండా ఆకర్షణీయమైన డిజైన్, పనితీరు, సౌకర్యం, ప్రీమియం ఫీచర్లు, భద్రతను అందించడమే దీని లక్ష్యం’’ అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: జీతం మొత్తం ఈఎంఐలకే సరిపోతోందా?
Tags : 1