Breaking News

ఎప్పుడూ విమానంలో ఉంటారు.. ఎంత సంపాదిస్తారు?

Published on Fri, 09/04/2026 - 17:26

విమానంలో ఉద్యోగం చాలామందికి డ్రీమ్‌ జాబ్‌. ముఖ్యంగా విమానంలో ప్రయాణికులందరినీ చిరునవ్వుతో పలకరించే క్యాబిన్‌ క్రూ ఉద్యోగం అంటే ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ప్రయాణాలు, కొత్త వ్యక్తులతో పరిచయాలు, విమానయాన రంగంలో కెరీర్‌.. ఇలా ఎన్నో ఆకర్షణలు ఈ ఉద్యోగంలో ఉన్నాయి. దేశంలో వేగంగా విస్తరిస్తున్న విమానయాన సంస్థల్లో ఒకటైన ఇండిగోలో క్యాబిన్‌ క్రూగా పనిచేస్తున్నవారు ఎంత సంపాదిస్తున్నారో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. ఈ నేపథ్యంలో 2026లో అందుబాటులో ఉన్న పరిశ్రమ అంచనాల ప్రకారం అనుభవాన్ని బట్టి ఇండిగో క్యాబిన్‌ క్రూ సంపాదనలెంతో ఈ కథనంలో తెలుసుకుందాం..

కొత్తగా చేరేవారికి ఇలా..

ఏవియేషన్‌ A2Z నివేదిక ప్రకారం, ఇండిగోలో కొత్తగా క్యాబిన్‌ క్రూగా చేరినవారు సాధారణ ఫ్లయింగ్‌ డ్యూటీలు ప్రారంభించిన తర్వాత నెలకు సుమారు రూ.40,000 నుంచి రూ.55,000 వరకు సంపాదించవచ్చు. అయితే ఇది స్థిరమైన జీతంగా భావించకూడదు. ఫ్లయింగ్‌ గంటలు, నెలవారీ రోస్టర్‌, రూట్‌, ప్రోత్సాహకాలు, పనిచేసే బేస్‌ లొకేషన్‌ వంటి అంశాల ఆధారంగా అసలు నెలవారీ ఆదాయం మారవచ్చు.

అనుభవం పెరిగితే..

రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల అనుభవం, ఎక్కువ ఫ్లయింగ్‌ యాక్టివిటీ ఉన్న క్యాబిన్‌ క్రూకు ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. అందుబాటులో ఉన్న పరిశ్రమ అంచనాల ప్రకారం అనుభవజ్ఞులైన సిబ్బంది నెలకు రూ.60,000–రూ.85,000 వరకు సంపాదించవచ్చు. ఇందులో ఫ్లయింగ్‌ అలవెన్సులు, ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాలు, రూట్‌ అసైన్‌మెంట్లు వంటి అంశాలు ప్రభావం చూపుతాయి. అందుకే ప్రతి నెలా వచ్చే మొత్తం ఒకేలా ఉండకపోవచ్చు.

సీనియర్‌ స్థాయిలో రూ.1.2 లక్షల వరకు..

కెరీర్‌లో ముందుకు వెళ్లి లీడ్‌ క్యాబిన్‌ అటెండెంట్‌ లేదా ఇన్‌ఫ్లైట్‌ సూపర్‌వైజర్‌ వంటి బాధ్యతలు చేపట్టినవారికి ఆదాయం మరింత ఎక్కువగా ఉండొచ్చని ఏవియేషన్‌ A2Z అంచనా వేసింది. బలమైన ఫ్లయింగ్‌ షెడ్యూల్‌, అధిక బాధ్యతలు ఉన్న సమయంలో వీరి నెలవారీ సంపాదన సుమారు రూ.90,000 నుంచి రూ.1.20 లక్షల వరకు ఉండొచ్చు.

జీతంతో పాటు మరిన్ని ప్రయోజనాలు

క్యాబిన్‌ క్రూ ఆదాయం కేవలం బేసిక్‌ పేకు పరిమితం కాదు. ఫ్లయింగ్‌ అలవెన్సులు, కొన్ని సందర్భాల్లో లేఓవర్‌ సంబంధిత ప్రయోజనాలు, స్టాఫ్‌ ట్రావెల్‌ వంటి సదుపాయాలు మొత్తం ప్యాకేజీలో భాగం కావచ్చు. ముఖ్యంగా అంతర్జాతీయ కార్యకలాపాలు పెరుగుతున్న కొద్దీ రూట్‌, డ్యూటీ స్వభావం కూడా ఆదాయంపై ప్రభావం చూపే అంశంగా మారుతోంది.

మూడు నెలల శిక్షణ తప్పనిసరి

ఇండిగో అధికారిక సమాచారం ప్రకారం, విమానంలో ఫ్లయింగ్‌ క్రూగా విధులు ప్రారంభించే ముందు క్యాబిన్‌ క్రూ సిబ్బంది మూడు నెలలపాటు ఇంటెన్సివ్‌ ట్రైనింగ్‌ పొందుతారు. ప్రయాణికుల భద్రత, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడం, సేవా ప్రమాణాలు తదితర అంశాల్లో శిక్షణ ఇస్తారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)