Breaking News

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నికల సందడి

Published on Fri, 09/04/2026 - 16:01

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతల మండలి ఎన్నికల సందడి మొదలైంది.  ఎన్నికల నేపథ్యంలో ప్రోగ్రెసివ్‌ ప్యానెల్‌ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించి తమ అభిప్రాయాలను వెల్లడించారు. నిర్మాతల సమస్యల పరిష్కారంతో పాటు పరిశ్రమ అభివృద్ధికి తమ ప్యానెల్‌ కృషి చేస్తుందని తెలిపారు.

కలిసి పనిచేద్దాం..
ఈ సందర్భంగా నిర్మాత, మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రతినిధి రవి యలమంచిలి మాట్లాడుతూ.. ప్రస్తుతం ‘ఇరుముడి’ సినిమా మంచి కంటెంట్‌తో ప్రేక్షకుల ఆదరణ పొందుతోందన్నారు. పరిశ్రమలో నిర్మాతలంతా ఐక్యంగా ఉండి మంచి సినిమాలను నిర్మించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తమ సంస్థ ఇప్పటివరకు సుమారు 180 సినిమాలను డిస్ట్రిబ్యూషన్‌ చేసినట్లు తెలిపారు. నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకుంటూ అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.

నిర్మాత అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ.. నిర్మాతల మండలి ఎన్నికలు సాధారణంగా రెండేళ్లకు ఒకసారి జరగాల్సి ఉన్నప్పటికీ.. ఈసారి ఏడు నెలలు ఆలస్యంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారని అన్నారు. మండలిలో అధ్యక్షుడి మాట కూడా చెల్లని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకారం తాను నామినేషన్లు దాఖలు చేసినట్లు వెల్లడించారు.
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)