Breaking News

అందుకే.. బంగారం, వెండికి ఇంకా డిమాండ్!

Published on Thu, 09/03/2026 - 16:25

పెట్టుబడిదారులకు బంగారం, వెండి మంచి ఎప్పుడూ మంచి ఎంపిక. అయితే.. ఇటీవలి కాలంలో వీటి ధరలు బాగా పెరగడంతో కొంతమంది ఇన్వెస్టర్లు తమ లాభాలను తీసుకున్నారు. దీంతో కొంతకాలంగా ధరలు తగ్గడం, పెరగడం వంటి మార్పులు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ.. కేంద్ర బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేయడం, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, వడ్డీ రేట్లు వంటి కారణాల వల్ల బంగారం, వెండికి డిమాండ్ భారీగానే ఉందని ఎంకే వెల్త్ మేనేజ్‌మెంట్ చెబుతోంది.

గత ఆరు వారాలుగా బంగారం 4,060 డాలర్ల వద్ద, వెండి 58 డాలర్ల దగ్గర సాగుతున్నాయి. పసిడి ధర పెరగడానికి ప్రధాన కారణాల్లో కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు ఒకటి. చాలా దేశాలు తమ విదేశీ నిల్వల్లో బంగారం వాటాను పెంచుకుంటున్నాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు తగ్గితే బంగారానికి మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే బంగారం నుంచి వడ్డీ ఆదాయం రాదు. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు బంగారం వంటివి.. పెట్టుబడిదారులకు మరింత ఆకర్షణీయంగా మారుతాయి. ఈ కారణంగానే గోల్డ్ రేటు ఇటీవల కొంత తగ్గడం జరిగింది.

వెండికి కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అయితే.. బంగారంతో పోలిస్తే వెండిలో ధరలు ఎక్కువగా మారుతుంటాయి. ఎందుకంటే వెండిని పెట్టుబడి కోసం మాత్రమే కాకుండా పరిశ్రమల్లో కూడా ఉపయోగిస్తారు. జూలై 31, 2026 నాటికి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ సిల్వర్ ఈటీఎఫ్ ఒక సంవత్సరంలో 95.24% రిటర్న్స్ ఇవ్వగా, నిప్పన్ ఇండియా సిల్వర్ ఈటీఎఫ్ 94.55% రిటర్న్స్ ఇచ్చాయి. ఇదే సమయంలో గోల్డ్ ఈటీఎఫ్స్ కూడా ఒక సంవత్సరంలో 43% కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి.

ఎంకే వెల్త్ మేనేజ్‌మెంట్ అంచనా ప్రకారం.. బంగారంలో ఇంకా సుమారు 12% వరకు పెరిగే అవకాశం ఉంది. వెండి ధరలు కూడా ఇదే విధంగా ముందుగా సాగనున్నాయి. అయితే.. బంగారం, వెండి ధరలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. మధ్యలో కొంత తగ్గడం, మళ్లీ పెరగడం సాధారణమే. ముఖ్యంగా వెండిలో ధరల వ్యత్యాసం ఎక్కువగా ఉండటం వల్ల పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలి.

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)