తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి
Breaking News
‘ఐ యామ్ గేమ్’ విడుదల తెలుగులో ఆలస్యం
Published on Thu, 09/03/2026 - 11:52
నహాస్ హిదాయత్ దర్శకత్వంలో హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లేటేస్ట్ మూవీ ఐ యామ్ గేమ్. ఈ సినిమాకు దుల్కర్ స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆంటోనీ వర్గీస్, మిస్కిన్, కయాదు లోహర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా కోసం ఎదురుచూసిన తెలుగు ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. తెలుగు వెర్షన్ నేడు( సెప్టెంబర్ 3) విడుదల కావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో ఆగిపోయింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురై పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ మండిపడుతున్నారు. దీనిపై టీమ్ స్పందించి నోట్ విడుదల చేసింది.
ఇదీ చదవండి: రూ.100 కోట్లు ఇస్తా.. సినిమా నాతోనే చేయాలి: అల్లరి నరేష్
‘పలు సాంకేతిక కారణాల వల్ల ‘ఐ యామ్ గేమ్’ సినిమా తెలుగులో విడుదల ఆలస్యం కానుంది. ఇప్పటికే మలయాళ వెర్షన్లో సినిమా విడుదలైంది. ఆలస్యం అయినా తెలుగులోనూ అందుబాటులోకి తీసుకొస్తాం. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం’ అని చిత్రబృందం నోట్ విడుదల చేసింది. కామెడీ, రొమాన్స్, మిస్టరీ, సస్పెన్స్, యాక్షన్, థ్రిల్లర్, గేమింగ్ అంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే పలు అంశాలు ఇందులో ఉన్నాయని టీమ్ తెలిపింది.
Tags : 1