మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్
Breaking News
దైవబలమే గొప్పదా? ఈ శతకాలు ఏం చెబుతున్నాయంటే!
Published on Thu, 09/03/2026 - 09:59
మానవుడు ఏమి తలచినా చివరకు దైవనిర్ణయం ప్రకారమే జరుగుతుంది.. మనకు ఏం జరిగినా దేవుడు మంచే చేస్తాడని దైవం మీద నమ్మకం వుండాలి. అందుకు ఉదాహరణగా శతకనీతిలో ఏం చెప్పారో చూద్దాం...
‘యధా కందుక పాతేనో త్పత త్యార్య :పతన్న పి...
అంటే.. పురుషకారం కన్నా దైవమే గొప్పదంటాడు భర్తృహరి.
కింద పడ్డ బంతి పైకి ఎలా ఎగురుతుందో దైవాన్ని నమ్మినవాడు హీన స్థితి పొందినా ఉన్న స్థితిని పొందుతాడు
దీనినే దైవబలం అంటారు.
లోకంలో అన్నిటికన్నా దైవమే బలీయమైనది అని అంటూ ‘మతిమతాం చ విలోక్య దరిద్రతాం’.. బుద్ధిమంతులు దారిద్రాన్ని అనుభవించారు అని అంటారు.
మరో పద్యం ద్వారా అన్నింటికీ దైవమే శరణం అని అంటారు..
‘దైవబలమే గాని తనబల్మి కాదయ్యా‘ అని తేల్చి చెప్పేసాడు వేమన.
‘దైవము లేనిది యే కార్యము సాగదు సుమతీ ఎన్ని సాధనములున్నన్ ‘అన్నారు, సుమతి శతకం లో ‘ఈ జగమందు, దా మనుజుడెంత మహాత్ముడెయైన దైవ మా తేజము తప్పజూచునెడ ద్రిమ్మరి కోల్పోడు నెట్లనిన’ అంటూ మహారాజుకుమారుడైన రామచంద్రుడి వనవాసం ప్రస్తావన తెస్తాడు భాస్కర శతకంలో ‘మహాత్ముడైన దాసాంద్ర విభూతి బాసి యొక విíహీనుని గోల్చియుంట’అంటూ అదే శతకంలో చక్రవర్తి సత్య హరిశ్చంద్రుడు కాటికాపరి అయి వీరబాహుణ్ణి సేవించే ఘట్టాన్ని ఆవిష్కరణ చేస్తాడు. చివరగా ‘దైవే దుర్బలతాంగతే తృణమపి ్రపాయేణ వజ్రాయతే ‘ అన్న సుభాషితం మన భ్రమలను తొలగిస్తుంది.
– డా. కందాళ సత్య నారాయణ మూర్తి
నిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్
ఇవి కూడా చదవండి: బాలుని మింగిన మొసలి! శివభక్తికి నిదర్శనం! అసలే జరిగిందంటే?
Tags : 1