Breaking News

ఇక సీరియస్‌... కామెడీని బ్యాలెన్స్‌ చేస్తా: ‘అల్లరి’ నరేశ్‌

Published on Thu, 09/03/2026 - 00:13

‘‘ప్రేక్షకులు నా నుంచి ‘కితకితలు, బెండు అప్పారావు’ వంటి వినోదాత్మక సినిమాలు మిస్‌ అవుతున్నారు. అలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నప్పుడు చంద్రమోహన్‌ ‘రంభ ఊర్వశి మేనక’ కథ చెప్పారు. ఈ కథ నాతో పాటు నాగార్జున, సుప్రియ, రాజేష్, నిమ్మకాయల ప్రసాద్‌గార్లకు కూడా నచ్చింది. ఇలా చాలా రోజుల తర్వాత ‘రంభ ఊర్వశి మేనక’ వంటి వినోదాత్మక చిత్రం చేశాను’’ అని ‘అల్లరి’ నరేశ్‌ తెలిపారు. 

చంద్రమోహన్‌ చింతాడ దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్‌ హీరోగా నటించిన చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. సురభి హీరోయిన్‌గా నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌–హాస్య మూవీస్‌పై రాజేష్‌ దండా, నిమ్మకాయల ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం రేపు రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ‘అల్లరి’ నరేశ్‌ విలేకరులతో పంచుకున్న విశేషాలు...

ఫ్యాంటసీ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. ఇందులో హీరోకి ఒక డ్రామా కంపెనీ ఉంటుంది. ‘రంభ ఊర్వశి మేనక’ను దేవతల్లా పూజిస్తుంటాడు. పైగా కష్టపడకుండా హీరో అయి పోవాలనే పాత్ర. తన కుటుంబానికి ముత్తాతల నుంచి వస్తున్న ఒక పుస్తకం ఉంటుంది. అందులో ఒకప్యాట్రన్‌ గీస్తే దేవతలు వచ్చి కోరికలు తీరుస్తారనే నమ్మకం ఉంటుంది. హీరో ఆప్యాట్రన్‌ ఎలా గీశాడు? రంభ, ఊర్వశి, మేనక భువికి వచ్చిన తర్వాత ఎలాంటి ఘటనలు జరిగాయనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమాలో మంచి ఎమోషన్‌ కూడా ఉంది. 

నా బాడీ లాంగ్వేజ్‌కి సరిపడే కామెడీని చంద్రశేఖర్‌ బాగా డిజైన్‌ చేశారు. పైగా ప్రేక్షకులు స్వర్గం, నరకం, ఇంద్రలోకం లాంటి కథలు చూసి చాలా కాలమైంది. పెద్దలే కాదు... చిన్నపిల్లలూ చాలా ఎగ్జయిట్‌ అవుతారు. క్లీన్‌ కామెడీతో ఫ్యామిలీ అందరూ కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ‘రంభ ఊర్వశి మేనక’ మా నాన్నగారి (ఈవీవీ సత్యనారాయణ) శైలిలో చేసిన సినిమా. అంత పెద్ద స్టార్‌ కాస్ట్‌ ఇందులో ఉంది. 

ఇకపై రెండు కామెడీ సినిమాలు, ఒక సీరియస్‌ సినిమా ఇలా బ్యాలెన్స్‌ చేసుకుంటూ చేయాలని భావిస్తున్నాను. నటుడిగా ఇంకా విజయవంతమైన చిత్రాలు చేసిన తర్వాతే దర్శకత్వం గురించి ఆలోచిస్తాను. నేను నటించిన ‘ఆల్కహాల్‌’ మూవీ రిలీజ్‌ రెడీగా ఉంది. ‘కనకదుర్గ’ సినిమా షూటింగ్‌ జరుగుతోంది.

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు