ఈఎమ్‌ఐ ఆరంభం

Published on Thu, 09/03/2026 - 00:05

‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో’ చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ అందుకున్న 7 పీఎం ప్రోడక్షన్స్‌ సంస్థ మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టింది. ‘ఈ.ఎమ్‌.ఐ.’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రానికి నిఖిల్‌ కువ్వరపు దర్శకుడు. సందీప్‌ అగరం, అష్మిత రెడ్డి బాసాని నిర్మాతలు. ‘లాల్‌ సలామ్, హాస్టల్‌ డేస్‌’ వంటి వెబ్‌ సిరీస్‌లతో పేరు తెచ్చుకున్న దరహాస్‌ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నారు.

‘లిటిల్‌ హార్ట్స్‌’ సినిమాలో ఓ కీలక పాత్రతో ఫేమస్‌ అయిన శైలజ ఈ సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. బుధవారం ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్‌ సాయి మార్తాండ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, హీరో ఆది సాయికుమార్‌ క్లాప్‌ ఇచ్చారు. ‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో’ చిత్రదర్శకుడు రాహుల్‌ శ్రీనివాస్‌ స్క్రిప్ట్‌ని యూనిట్‌కి అందజేశారు.

‘‘బైక్, కారు, ఫోన్‌... ఇలా ఏ వస్తువు కొన్నా ఈ.ఎమ్‌.ఐ. కట్టాల్సిందే. దాదాపు ప్రతి మధ్య తరగతి ఇంటిలో ఈ కష్టాలు తప్పవు. ఈ.ఎమ్‌.ఐ. చెల్లించేందుకు యువత ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? అనే కాన్సెప్ట్‌తో, హార్ట్‌ టచింగ్‌ ఎమోషన్స్‌తో కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం సాగుతుంది. రాహుల్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో మా బ్యానర్‌లో ఓ భారీ చిత్రాన్ని నిర్మించనున్నాం’’ అని సందీప్‌ అగరం, అష్మిత రెడ్డి బాసాని తెలిపారు.

Videos

వరదకు ఎదురీది.. ప్రాణం కాపాడిన యువకుడు

మా వెనుక శేఖర్ మాస్టర్.. సుమలత మాకు అవసరం లేదు, మాకు రఘు మాస్టర్ బెస్ట్

రేవెంత్ కు కొండా పంచ్ అదిరిపోయే పంచ్

అమెరికా పునాదులు కదిలిస్తాం?

డబ్బు కోసం స్నేహితుడినే కిడ్నాప్.. పట్టించిన వాట్సాప్ మెసేజ్

చంద్రబాబు చీప్ పబ్లిసిటీపై వైఎస్ జగన్ ఆగ్రహం

ఇచ్చి ఒక నెల కూడా కాలేదు లోకేష్ ని ఏకిపారేసిన శ్రీదేవి

నచ్చకపోతే వెళ్లిపోండి జపాన్ క్రికెట్ CEO బీసీసీఐకి షాక్

దొంగతనం ఒప్పుకోమంటూ..! పోలీసుల వేధింపులపై అర్చకుడి తల్లి కన్నీళ్లు

నేనూ సీఎం అవుతా టైం వస్తే అన్నీ అవే వస్తాయి

Photos

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)