Breaking News

ఐటీ ఫైలింగ్స్‌ @ 7.8 కోట్లు

Published on Wed, 09/02/2026 - 08:48

సరికొత్త రికార్డ్‌ నెలకొల్పుతూ 2026–27 అసెస్‌మెంట్‌ ఏడాదికిగాను 7.8 కోట్లకుపైగా ఆదాయపన్ను రిటర్ను(ఐటీఆర్‌)లు దాఖలయ్యాయి. ఆదాయపన్ను శాఖ ఎక్స్‌లో పోస్ట్‌ చేసిన తాజా వివరాల ప్రకారం ఆగస్ట్‌31కల్లా ఐటీఆర్‌లు 7.8 కోట్లను దాటాయి. గతేడాది 2025 సెప్టెంబర్‌ 16వరకూ దాఖలైన ఐటీఆర్‌ల సంఖ్య 7.3 కోట్లు మాత్రమే. 2025–26 ఏడాదికి నాన్‌ఆడిట్‌ కేసుల రిటర్ను దాఖలుకు సెప్టెంబర్‌ 16 వరకూ గడువిచ్చిన సంగతి తెలిసిందే.

ఈ ఏడాది జూలై31కల్లా ఐటీఆర్‌–1, ఐటీఆర్‌–2 ఫైలింగ్స్‌ 5.9 కోట్లను దాటినట్లు ఆదాయపన్ను శాఖ వెల్లడించింది. బిజినెస్‌లు లేదా వృత్తిపరమైన ఆదాయంకలిగిన ఆడిట్‌ అవసరంలేని పన్ను చెల్లింపుదారులు ఆగస్ట్‌31కల్లా పూర్తిచేసిన వివిధ ఫైలింగ్‌లతో కలిపి మొత్తం ఐటీఆర్‌ల సంఖ్య 7.8 కోట్లను అధిగమించినట్లు పేర్కొంది. వీటిలో వ్యక్తులు, అవిభాజ్య హిందూ కటుంబాలు(హెచ్‌యూఎఫ్‌లు) ప్రొప్రయిటరీ బిజినెస్‌ లేదా వృత్తిపరమైన ఆదాయంపై దాఖలు చేసిన ఐటీఆర్‌–3, చిన్న, మధ్యతరహా పన్ను చెల్లింపుదారుల(రూ. 50 లక్షలలోపు ఆదాయం) ఐటీఆర్‌–4, సంస్థలు, ఎల్‌ఎల్‌పీ, కోఆపరేటివ్‌ సొసైటీల ఐటీఆర్‌–5, కంపెనీల చట్టం ప్రకారం రిజిస్టరైన సంస్థల ఐటీఆర్‌–6, ట్రస్టులు, చారిటబుల్‌ సంస్థల ఐటీఆర్‌–7 ఉన్నట్లు వివరించింది. 

ఇదీ చదవండి: బెర్త్ బుక్‌ చేసినా.. పడుకోకూడదు!

Videos

Nepal Floods: ప్రియ అధికారి ఎవరు? 6 రోజులు.. 100 మిషన్లు..

లండన్ లో త్రిష.. విజయ్ వెళ్ళేది ఆమె కోసమేనా!

టైల్స్ పై పడుకొని కెమెరా కెమెరా మెన్ లకు నమస్కారం

YSR ఘాట్ వద్ద వైఎస్ జగన్.. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు

AP: 20 ఏళ్ల పగ.. వేటాడి వెంటాడి హత్య

కొట్టుకుపోతున్న పాకిస్థాన్ ఇస్లామాబాద్ ను ముంచెత్తిన వరదలు

అడిగి అడిగి అలసిపోయాం.. అందుకే పోరాటంలోకి దిగాం

ఇంజన్ ఫెయిల్.. ఇండిగో ఫ్లైట్ కు తప్పిన ఘోర ప్రమాదం

ఎవరు పూల సుబ్బయ్య.. వెలిగొండకు ఆయన పేరు ఎందుకు!

నేపాల్‌లో యాక్షన్‌లోకి ప్రధాని బాలేంద్ర షా!

Photos

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)