మిస్ వరల్డ్ ఉగాండా గౌనులో ఇంత గొప్ప సందేశమా..!

Published on Tue, 09/01/2026 - 17:41

వరల్డ్ డిజైనర్ అవార్డ్' కార్యక్రమంలో మిస్ వరల్డ్ ఉగాండా ట్రివియా ఎల్లే ముహోజా ధరించిన గౌను ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫ్యాషన్‌ని ఇలా కూడా గొప్ప సందేశంతో ప్రదర్శించొచ్చు అన్న రీతిలో డిజైన్‌ చేశారు. 73వ మిస్ వరల్డ్ (Miss World 2026) పోటీల్లో భాగంగా జరిగిన వరల్డ్ డిజైనర్ అవార్డ్' కార్యక్రమంలో ఈ గౌను అత్యంత ఆకర్షణీయంగా నిలిచింది. దీన్ని డిజైనర్ కీషా అబ్దుల్లా రూపొందించింది. 

ఈ స్పెషల్‌ గౌను ప్రసవ కథను వివరిస్తుందట. ముఖ్యంగా సీ సెక్షన్‌ చేయించుకున్న తల్లులను దృష్టిలో ఉంచుకుని ఈ గౌనుని డిజైన్‌ చేసినట్లు అబ్దుల్లా పేర్కొంది. గౌను ఆకృతి, పొరలో సహా ప్రతి భాగం ఒక్కో విషయాన్ని విరిస్తాయట. ఆ క్రియేషన్‌ ఒక కొత్త తల్లిగా తన అనుభవం నుంచి వచ్చిన ఆలోచన అని వెల్లడించిందామె. ఈ డిజైన్‌ని రూపొందించేటప్పుడూ..సీ సెక్షన్‌లో ఉండే ఏడుపొరలకు సంబంధించిన చిత్రాలు, వివరాలను అధ్యయనం చేసి..మరి గౌనుకి చక్కటి ఆకృతి ఇచ్చినట్లు తెలిపారు. 

అంతేగాదు డిజైనర్‌ కీషా ఆ గౌను డిజైన్‌కి సంబంధించిన ప్రతిదాన్ని క్షణ్ణంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా వివరించారు. "ప్రసవంలోని వివిధ దశలను ఒక కౌచర్ గౌనుగా మార్చాలనే ఐడియా స్ఫూరించింది. వెంటనే ‘లేయర్స్ ఆఫ్ లైఫ్’ కథని ఇతి వృత్తంగా తీసుకున్నా డ్రెస్‌ విజ్‌ చేశా. అదీగాక విభిన్నంగా, స్ఫూర్తిదాయకంగా ఉండేలా క్రియేట్‌ చేయాలని భావించా. అందులోనూ వియత్నాంలో జరిగిన మిస్ వరల్డ్ వేదికపై మిస్ ఉగాండా కోసం డిజైనర్ డ్రెస్‌ను రూపొందించే అవకాశం లభించినే నేపథ్యంలోనే దీన్ని ఎంచుకున్నట్లు తెలిపింది. 

ఎందుకంటే ప్రసవమనే అద్భుతంకి మించిన స్ఫూర్తి ఉండదనిపించింది. ముఖ్యంగా సీసెక్షన్‌లోని ఏడుదశలను స్కెచ్‌తో గీని చూపించగానే మిస్‌ ఉగాండ్‌ కూడా వెంటనే సమ్మతం తెలిపింది. వాస్తవ రూపానికి మాత్రం చాలా కష్టబడ్డానని, చివరికి సరైన రంగులనే ఎంచుకోగలిగిను. ఈ గౌను ప్రసవం అనే జర్నీలోని ఏడు దశలను తెలిపే సీ సెక్షన్‌ కథను వివరింస్తుంది. ఎలాగంటే మొదటిది చర్మం, ఇది శరీరాన్ని రక్షిస్తుంది. రెండవది కొవ్వు, ఇది శక్తికి, శరీరం పనిచేయడానికి అవసరం. మూడోవది ఫాసియా, ఇది శరీరంలోని వివిధ భాగాలను కలిపి ఉంచే కణజాలం. 

నాల్గవ పొర కండరం, ఇది ప్రసవంలో ఉండే బలాన్ని, శారీరక శ్రమను సూచిస్తుంది. ఐదవది పెరిటోనియం, ఇది పొత్తికడుపు లోపల ఉండే రక్షిత పొర. ఆరవది గర్భాశయం, ఇక్కడ శిశువు పెరుగుతుంది.  చివరి పొర ఆమ్నియోటిక్ శాక్, ఇది పుట్టుకకు ముందు శిశువును రక్షించి, ఆశ్రయం ఇచ్చే ప్రదేశం. అలా ప్రసవ దశలన్నింటిని పొందుపర్చేలా, సీసెక్షన్‌ ప్రక్రియని వివరిస్తూ ఈ గౌనుని డిజైన్‌ చేశా" అని వెల్లడించింది కీషా అబ్దుల్లా. 

 

(చదవండి: 47 ఏళ్ల వయసులో చెప్పులు లేకుండా మారథాన్‌..గెలిచిన అమ్మ!)

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)