Breaking News

ఉగాండాలో మొదలైన బయింబా ఫెస్టివల్‌.. ప్రత్యేకతలేంటో తెలుసా?

Published on Sun, 08/30/2026 - 10:08

గాండా అంటే ప్రకృతి అందాలు, వన్యప్రాణులు మాత్రమే కాదు.. వైవిధ్యమైన సంగీతం, కళలు, సంప్రదాయాలతో కళకళలాడే దేశం కూడా. ఆ దేశంలోని సాంస్కృతిక, సృజనాత్మక ప్రపంచాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రముఖ వేడుక బయింబా ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ది ఆర్ట్స్‌. ఆగస్టు 28న మొదలైన ఈ వేడుకలు 30న ముగుస్తున్నాయి. ఈ ఫెస్టివల్‌లో సంగీత నాటక నృత్యాలు సహా పలు దృశ్య కళల ప్రదర్శనలు జరుగుతాయి.

ఉగాండా సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటాలనే లక్ష్యంతో 2006లో బయింబా ఫౌండేషన్‌ ప్రారంభమైంది. ఈ ఫౌండేషన్‌ 2008లో తొలిసారిగా బయింబా ఫెస్టివల్‌ నిర్వహించింది. అప్పటి నుంచి ఏటా క్రమం తప్పకుండా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది. ఈ ఉత్సవం తూర్పు ఆఫ్రికాలోని ప్రముఖ బహుళ కళా ఉత్సవాల్లో ఒకటిగా ఎదిగింది. లంకులు ఐలండ్‌ వేదికగా ఈ ఉత్సవాన్ని మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. ఉగాండా సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే ఈ బయింబా ఫెస్టివల్‌ ప్రధాన లక్ష్యం.

అంతేకాకుండా సృజనాత్మక రంగానికి దీర్ఘకాలిక మౌలిక సదుపాయాలు, కళావిద్య, కళాకారుల అభివృద్ధి, సాంస్కృతిక వ్యాపార అవకాశాలను పెంచడం కూడా దాని కార్యక్రమాల్లో భాగం. ఉగాండా ఆర్థికాభివృద్ధిలో కూడా ఈ ఉత్సవం తోడ్పడుతుంది. బయింబా ఫెస్టివల్‌కు ఉన్న ప్రత్యేకతల్లో అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఒకటి. వివిధ దేశాలు, విభిన్న సాంస్కృతిక నేపథ్యాలకు చెందిన కళాకారులు, సంగీతకారులు, ప్రదర్శనకారులు ఇక్కడ కలుసుకుంటారు. వారంతా తమ తమ అనుభవాలను పంచుకుంటారు.

ఈ బయింబా ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ది ఆర్ట్స్‌– కళాభిమానులకు, పర్యాటకులకు, ప్రపంచ సంస్కృతులను తెలుసుకోవాలనుకునే వారికి ఒక ప్రత్యేక అనుభవంగా నిలుస్తుంది. ఈ ఫెస్టివల్‌ కోసం ఈ ఏడాది బయింబా అంతర్జాతీయ కళాకారుల నుంచి కూడా దరఖాస్తులు ఆహ్వానించింది. సంగీతం, నృత్యం, సినిమా, ఫ్యాషన్, ఫోటోగ్రఫీ, స్టోరీ టెల్లింగ్, థియేటర్‌ తదితర విభాగాలకు చెందిన కళాకారులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.

ఇవి చదవండి: ఒకే ఊరు.. కొందరికే వినిపించే వింత శబ్దం! అసలు రహస్యం ఏంటి?

Videos

మందు తాగి NEET పరీక్షకు.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ

యువ ప్రధానికి బిగ్ ఛాలెంజ్.. నేపాల్ పునర్నిర్మాణం అంత ఈజీ కాదు

ధర్మాన ప్రసాద్ పై అక్రమ కేసు

నీకే చెప్తున్నా.. జగన్ పై విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు.. ఇచ్చిపడేసిన సజ్జల

బిర్యానీ సెంటర్లో పెరుగు కోసం కొట్లాట

కీవ్ లో రష్యా డ్రోన్ల బీభత్సం.. 37 మంది మృతి

నువ్వేం ఎమ్మెల్యే అమ్మ బాబు.. తాగడానికి నీళ్లు ఇవ్వడం చేతకాలేదు నీకు..!

'అచ్చ కాంగ్రెస్' వర్సెస్ 'పచ్చ కాంగ్రెస్' రేవంత్ కు ఎమ్మెల్యేల మద్దతు ఉందా?

మనిషి కంట్రోల్ తప్పిన 700 రోబోల రహస్య దాడి!

ఇరుముడి మిస్ చేసుకున్న స్టార్ హీరోలు వీళ్ళే..!

Photos

+5

సమంత ప్రెగ్నెన్సీ గ్లో చూశారా? (ఫొటోలు)

+5

చీరకట్టుతో రీతూ వర్మ ( ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఉత్సాహంగా 10కె రన్ (ఫోటోలు)

+5

షూటింగ్‌ కోసం ఓనం మిస్‌.. ర్యాండమ్‌ ఫొటోలతో కల్యాణి సందడి..(ఫొటోలు)

+5

ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు)

+5

'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు)

+5

నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. తెరపై చూడని అరుదైన ఫొటోలు

+5

మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)