Breaking News

ఎయిర్‌టెల్ యూజర్లకు అదిరిపోయే ప్లాన్స్!

Published on Sat, 08/29/2026 - 23:19

ఎయిర్‌టెల్ యూజర్ల కోసం ప్రస్తుతం ఎన్నో రకాల ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. రోజువారీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, 5G డేటా, OTT సబ్‌స్క్రిప్షన్లు కావాలనుకునే వారికి కొన్ని ప్లాన్స్ ప్రత్యేకంగా ఉపయోగపడతాయి. ఈ కథనంలో రోజుకు 2.5GB డేటా లభించే మూడు ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.

రూ.399 ప్లాన్
ఎయిర్‌టెల్ రూ.399 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ప్రతిరోజూ 2.5జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 70జీబీ డేటాను వినియోగించుకోవచ్చన్నమాట. అన్‌లిమిటెడ్‌ కాలింగ్ పొందవచ్చు. రోజుకు 100 SMSలు కూడా లభిస్తాయి. దీంతో పాటు 28 రోజుల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే, హలో ట్యూన్స్, అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం యాక్సెస్ లభిస్తాయి.

రూ.1,199 ప్లాన్
ఎక్కువ కాలం రీచార్జ్ గురించి ఆలోచించకుండా ఉండాలనుకునే వారికి రూ.1,199 ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజూ 2.5జీబీ డేటాను అందిస్తుంది. దీంతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. సబ్‌స్క్రైబర్‌లు ప్లాన్ కాల వ్యవధిలో అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందుతారు. రోజువారీ డేటా పరిమితి అయిపోగానే, మరుసటి రోజు వరకు ఇంటర్నెట్ వేగం 64Kbpsకి తగ్గుతుంది.

రూ.3,999 ప్లాన్
తరచూ రీచార్జ్ చేసుకోవడం ఇష్టం లేని వారికి రూ.3,999 ప్లాన్ మంచి ఆప్షన్. ఈ ప్లాన్ ఏకంగా 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అంటే ఒక్కసారి రీచార్జ్ చేసుకుంటే ఏడాది పాటు రీఛార్జ్ చేసుకోవలసిన అవసరం లేదు. ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 2.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. అదనంగా మూడు నెలల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా పొందవచ్చు.

ఏ ప్లాన్ తీసుకోవాలి?
నెలనెలా రీచార్జ్ చేసుకునే అలవాటు ఉన్నవారికి రూ.399 ప్లాన్ సరిపోతుంది. 84 రోజుల వ్యాలిడిటీతో పాటు అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ కావాలనుకునే వారికి రూ.1,199 ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ఏడాది పాటు ఒకే రీచార్జ్‌తో డేటా, కాలింగ్, 5జీ సేవలు కొనసాగాలనుకునే వారికి రూ.3,999 ప్లాన్ అనుకూలంగా ఉంటుంది.

Videos

మందాకిని ఉగ్రరూపం.. వరదల్లో ఉత్తర ప్రదేశ్

2 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ ఖాతా.. సాదిక్ ఖాన్ పాత్రపై పోలీసుల దర్యాప్తు

జనసేనలో బిగ్ ఫైట్.. లోకల్ ఎన్నికల్లో భారీ ఓటమి ఖాయం

వెలిగొండ వెలుగులు జగన్ వే

నడ్డివిరిగేలా చంద్రబాబు చావుదెబ్బ.. ఎడా పెడా బాదుడే బాదుడు

అంబటి రాంబాబుకి జగన్ పరామర్శ

పాలు పారబోసిన రైతులు.. ధర పెంచాలంటూ తమిళనాడులో నిరసన

షాక్ లో యాంకర్ ఈశ్వర్.. తమాషా కాదు అడిగితే కాల్చి పడేస్తారు.. కారుమూరి సంచలన నిజాలు

సిగ్గు తెచ్చుకోండి... నిర్మలా సీతారామన్ అప్పుడే చెప్పారు.. నాగ మల్లీశ్వరి షాకింగ్ నిజాలు

ఇది సార్ మీ అసలు రూపం.. చంద్రబాబు వీడియో చూపిస్తూ ఏకిపారేసిన వరుదు కళ్యాణి

Photos

+5

చీరకట్టుతో రీతూ వర్మ ( ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఉత్సాహంగా 10కె రన్ (ఫోటోలు)

+5

షూటింగ్‌ కోసం ఓనం మిస్‌.. ర్యాండమ్‌ ఫొటోలతో కల్యాణి సందడి..(ఫొటోలు)

+5

ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు)

+5

'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు)

+5

నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. తెరపై చూడని అరుదైన ఫొటోలు

+5

మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

దేవకన్యలా మెరిసిపోతున్న రాశీ (ఫొటోలు)