Breaking News

‘మోసం.. అని చెప్పేముందు జాగ్రత్త’

Published on Thu, 08/27/2026 - 09:48

పన్ను చెల్లింపుదారులకు జారీ చేసే సెక్షన్ 74 జీఎస్టీ షోకాజ్ నోటీసులపై అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. నోటీసులో ‘మోసం, వాస్తవాలను సమర్పించలేకపోవడం లేదా దాగిన సత్యాలు’ అనే చట్టబద్ధమైన పదాలను జాగ్రత్తగా ఉపయోగించాలని స్పష్టం చేసింది. పన్ను ఎగవేతకు పన్ను చెల్లింపుదారులు ఎలాంటి కుట్ర పన్నారో ప్రాథమిక సాక్ష్యాధారాలతో నోటీసులోనే స్పష్టంగా పేర్కొనాలని తెలిపింది.

జస్టిస్ బె.బి.పార్దీవాలా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ‘మోసం లేదా దాగిఉన్న వాస్తవాలు’ అనే సందేహస్పద పదజాలాన్ని ప్రయోగించినంత మాత్రాన గడువు పొడిగింపు నిబంధనలను సవరించే వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది. అసెస్సింగ్ ఆఫీసర్ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడే ఎక్ట్సెండెడ్‌ లిమిటేషన్‌ వ్యవధిని వర్తింపజేయాలని పేర్కొంది.

మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్‌పై విచారణ సందర్భంగా.. నోటీసులోని శబ్దజాలం అసెస్సింగ్ ఆఫీసర్ల అనిశ్చితిని స్పష్టం చేస్తోందని, ‘మోసం లేదా కప్పిపుచ్చడం’ అనే పదాల వాడకంలో స్పష్టమైన నిర్ధారణ లేదని కోర్టు పేర్కొంది.

ఈ తీర్పుపై స్పందించిన డెలాయిట్ పార్టనర్ హర్‌ప్రీత్ సింగ్.. ‘ఇది పన్ను చెల్లింపుదారులకు దక్కిన గొప్ప ఉపశమనం. చట్టపరమైన పదాలను కేవలం పునరావృతం చేస్తూ నోటీసులు పంపే ధోరణికి ఈ తీర్పు చెక్ పెడుతుంది’ అని వ్యాఖ్యానించారు. అధికారులు తమ నిర్లక్ష్య వైఖరిని వదిలి ఆధారాలతో సహా వివరమైన సమాచారాన్ని అందించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ తీర్పు ద్వారా పన్ను యంత్రాంగంలో బాధ్యత, పారదర్శకత పెరుగుతాయని ఆర్థిక రంగానికి చెందిన నిపుణులు భావిస్తున్నారు. నిజాయతీ కలిగిన పన్ను చెల్లింపుదారులకు ఈ తీర్పు రక్షణ కల్పిస్తుందని కొందరు చెబుతున్నారు.

ఇదీ చదవండి: రూ.లక్షల కోట్ల ఆదా సరే.. మైలేజ్ కోతకు పరిష్కారమేది?

#

Tags : 1

Videos

రాజీనామా చెయ్! నీకు రోజులు దగ్గర పడ్డాయి ధూళిపాళ్ల నరేంద్ర... బ్రాహ్మణుల ఉసురు ఊరికే పోదు

పందితో 30 నిమిషాల ఫైట్.. 14 ఏళ్ల కుర్రాడి దమ్ము చూస్తే షాక్!

ఇరుముడి హిట్‌తో రవితేజ దశ తిరిగిందా?

నేపాల్ వరదలకు అసలు కారణమేంటి? మరో ముప్పు ఎందుకు?

మరో జలవిలయం.. ప్రాణభయంతో జనం పరుగులు

నేపాల్ వరదల్లో.. ఏపీ, తెలంగాణ యాత్రికులు గల్లంతు

జిమ్ ట్రైనర్ సతీష్ రెడ్డి హత్య.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు

అమ్మవారికి మంగళ సూత్రాలు సమర్పించిన అంబటి మురళి

"కొడుకా ఎక్కడున్నావురా నాన్నా”.. తండ్రి ఆరాటం కంటతడి పెట్టిస్తోంది!

కరెంట్ పోల్ ఎక్కిన తాగుబోతు.. గంటపాటు టెన్షన్

Photos

+5

ఓనం వేడుకలో కృతి శెట్టి.. (ఫోటోలు)

+5

సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన తార మంజు వారియర్..(ఫోటోలు)

+5

ఫ్యామిలీతో అనుపమ ఓనం సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : చార్మినార్ వద్ద ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు (ఫొటోలు)

+5

రాఖీ పౌర్ణమి.. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సందడే సందడి (ఫొటోలు)

+5

'టాక్సిక్' మూవీ ట్రెండింగ్ లో నయనతార (ఫొటోలు)

+5

హీరోయిన్ మానస వారణాసి ఓనం సెలబ్రేషన్స్.. (ఫొటోలు)

+5

నేపాల్‌లో వరద బీభత్సం... (ఫొటోలు)

+5

'రోమాంచకం' మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

దుబాయిలో తన డ్యాన్స్ స్టూడియోలో పూర్ణ ఓనం సెలబ్రేషన్స్ (ఫొటోలు)