అదిగో నా కోడలు.. వసంత కృష్ణ ప్రసాద్ ఆఫీస్ వద్ద.. సంచలన వీడియో బయటపెట్టిన జోగి రమేష్
Breaking News
షారుక్ ఇంటికి కొత్త హంగులు.. ఖర్ఛు ఎన్ని కోట్లంటే..
Published on Mon, 08/24/2026 - 10:18
షారుక్ ఖాన్ పేరు చెప్పగానే గుర్తొచ్చే ఇల్లు ‘మన్నత్’. బాంద్రాలో సముద్రానికి అభిముఖంగా ఉన్న ఈ విలాసవంతమైన భవనం పర్యాటక ప్రదేశంగానూ మారిపోయింది. రోజూ అభిమానులు అక్కడికి చేరుకుని తమ అభిమాన హీరోను చూసేందుకు,ఇంటి ముందు ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపుతుంటారు. ప్రస్తుతం ఇక్కడ భారీ రీడెవలప్‌మెంట్ పనులు జరుగుతున్నాయి. ప్రముఖ సినీ నిర్మాత అనంద్ పండిట్‌కు చెందిన ఓ సంస్థ దీని నిర్మాణ పనులు చేస్తోంది.
ఖర్చు ఎంతంటే..
మన్నత్‌లో రెండు అంతస్తులు నిర్మించేందుకు షారుక్ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విస్తరణలో భవనం విస్తీర్ణం 616.02 చదరపు మీటర్లు పెరగనుంది. ఈ పనులకు సుమారు రూ.25 కోట్లు ఖర్చుఅవుతుందని అంచనా. మన్నత్ వారసత్వ కట్టడం కావడంతో పాటు సముద్రానికి అత్యంత సమీపంలో ఉండడంతో విస్తరణకు మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ అనుమతి కూడా అవసరం.
తొలి ఇల్లు కూడా..
ఆనంద్ పండిట సంస్థ చేపడుతున్న మరో ప్రాజెక్ట్ కూడా షారుక్‌కు ఎంతో ప్రత్యేకమైనదేనట. బాంద్రాలోని శ్రీ అమృత్ సొసైటీలో ఉన్న 4బీహెచ్‌కే ఫ్లాట్‌ను ఈ సంస్థ రీడెవలప్ చేస్తోంది. ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చిన తర్వాత 1991లో గౌరీని వివాహం చేసుకున్న సమయంలో షారుక్ కొనుగోలు చేసిన తొలి ఇల్లు ఇది కావడంతో ఇది ఆయనకు ఎంతో ప్రత్యేకమని తెలుస్తోంది.
‘కింగ్’తో బిజీ..
సినిమాల విషయానికొస్తే.. షారుక్ ఖాన్ ప్రస్తుతం ‘కింగ్’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో ఆయన కుమార్తె సుహానా ఖాన్ తొలిసారి థియేట్రికల్ డెబ్యూ చేయనుంది. సిద్ధార్థ్ అనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ చిత్రంలో షారుక్ హిట్‌మ్యాన్‌గా కనిపించనున్నట్లు సమాచారం. దీపికా పదుకొనే, అభిషేక్ బచ్చన్, అర్షద్ వార్సీ, రాఘవ్ జుయల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Tags : 1