Breaking News

జయరామ్‌, సిమ్రాన్‌ జంటగా కొత్త మూవీ

Published on Sun, 08/23/2026 - 21:23

ప్రముఖ నటులు జయరామ్‌, సిమ్రాన్‌ తొలిసారి జంటగా ఓ ప్రొడెక్షన్‌ నెం4 ( వర్కింగ్‌ టైటిల్‌) తమిళ చిత్రంలో నటించనున్నారు. ఈ మేరకు ఆదివారం చిత్రం పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.  ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఫొటోలు షేర్‌ చేశారు.  ‘రాచ్చసి’, ‘కళువేతి మూర్కన్‌’ చిత్రాల దర్శకుడు ఎస్‌.వై. గౌతమ్‌రాజ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సాంకేతికంగా ఈ చిత్రానికి దీపక్‌ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. అచ్చు రాజామణి సంగీతం, అరుల్‌ ఈ సిద్ధార్థ్‌ ఎడిటింగ్‌, మహేంద్రన్‌ ఆర్ట్‌ డైరెక్షన్‌ బాధ్యతలు చేపట్టారు.

2002లో కమల్‌హాసన్‌, కేఎస్‌.రవికుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘పంచతంత్రం’లో జయరామ్‌, సిమ్రాన్‌ కలిసి నటించారు. అయితే.. తొలిసారి ఈ సినిమాలో లీడ్‌ పెయిర్‌గా కనిపించనున్నారు.  ‘వాళై’ ఫేమ్‌ పొన్వేల్‌, దేవికా సతీష్‌, భగవతి పెరుమాళ్‌ (బక్స్‌) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా..
రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. జెన్‌ జెడ్‌ తరం, 90ల తరానికి చెందిన వ్యక్తుల మధ్య ఏర్పడే సంబంధాలు, వాటి కారణంగా చోటుచేసుకునే ఆసక్తికర సంఘటనల చుట్టూ కథ సాగుతుందని సమాచారం.

సిమ్రాన్‌ చివరిగా 2025లో శశికుమార్‌తో కలిసి ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’లో నటించారు. ప్రస్తుతం రజనీకాంత్‌తో కలిసి ‘ధర్మన్‌’లో నటిస్తున్నారు.

 

 

Videos

అదిగో నా కోడలు.. వసంత కృష్ణ ప్రసాద్ ఆఫీస్ వద్ద.. సంచలన వీడియో బయటపెట్టిన జోగి రమేష్

ఎగసిపడుతున్న అలలు.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

భారీగా పెరిగిన బంగారం ధర

Watch Live: కొడుకు వివాదంపై జోగి రమేష్ సంచలన ప్రెస్ మీట్

కలిసొచ్చిన సెంటిమెంట్.. రవితేజ సక్సెస్ సీక్రెట్ ఇదే.!

నెల్లూరు జిల్లాలో గుప్తనిధుల తవ్వకాల కలకలం

భగ్గుమన్న బియ్యం ధరలు.. చోద్యం చూస్తున్న బాబు సర్కార్

కాకినాడ రూరల్ PS కు సాధిక్ ఖాన్ తరలింపు

దొరికిన ఇద్దరు వీడియో.. ఈశ్వర్ సాయి ఫస్ట్ రియాక్షన్

లింగమనేని కొడుకు వీడియో తీసింది ఎవరంటే.. అది బయటపడటానికి కారణం కూడా..

Photos

+5

హీరోయిన్ కృతిసనన్ హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఇన్నాళ్లకు మళ్లీ ఓకే వేదికపై..(ఫోటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ మూవీ హీరోయిన్‌ ప్రిషా సింగ్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ బ్యూటీ కిర్రాక్ సీత వరలక్ష్మీ వ్రతం పూజలు.. (ఫోటోలు)

+5

నటి రాధిక బర్త్‌ డే సెలబ్రేషన్స్.. సీనియర్ హీరోయిన్ల సందడి (ఫోటోలు)

+5

టాక్సిక్ ఈవెంట్.. స్పెషల్ ‍అట్రాక్షన్‌గా కియారా అద్వానీ (ఫోటోలు)

+5

గిరిజన తండాల్లో యువతుల సందడే సందడి (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా మార్వాడీల 'కావడి యాత్ర' (ఫొటోలు)

+5

టాక్సిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. ఫోటోలు

+5

ఫ్రెండ్స్‌తో ఫుల్‌ జోష్‌లో ఆనంది..(ఫోటోలు)