Breaking News

సంతకం చేయనందుకు ఉద్యోగం పోయిందా?

Published on Sun, 08/23/2026 - 15:02

మెటా ప్లాట్‌ఫామ్స్‌కు చెందిన మాజీ ప్రొడక్ట్ డిజైన్ మేనేజర్ 'జేమ్స్ టిల్లింగ్‌హాస్ట్'.. తనను కంపెనీ అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించిందని ఆరోపిస్తూ కేసు దాఖలు చేశారు. తన సహోద్యోగి గ్రీన్ కార్డు దరఖాస్తుకు సంబంధించిన ఒక ఇమ్మిగ్రేషన్ డాక్యుమెంట్ మీద సంతకం చేయడానికి నిరాకరించిన తర్వాతే సమస్యలు మొదలయ్యాయని ఆయన పేర్కొన్నారు.

వివాదం ఎలా మొదలైంది?
న్యూజెర్సీ ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టులో దాఖలు చేసిన దావా ప్రకారం.. 2024లో మెటా ఇమ్మిగ్రేషన్ లీగల్ టీమ్, తన విభాగంలోని ఒక ఉద్యోగికి సంబంధించిన గ్రీన్ కార్డ్ దరఖాస్తుకు (EB-2 నేషనల్ ఇంటరెస్ట్ వేవర్) మద్దతుగా ఒక సిఫార్సు లేఖపై సంతకం చేయమని టిల్లింగ్‌హాస్ట్‌ను కోరడంతో ఈ వివాదం ప్రారంభమైంది.

ముసాయిదా లేఖలో ఆ ఉద్యోగి మెటా కోసం సుమారుగా 638 మిలియన్ డాలర్ల అదనపు ప్రకటనల ఆదాయాన్ని సంపాదించిపెట్టాడని, కీలకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అల్గారిథం సాధనాలను నేరుగా అభివృద్ధి చేశాడని, పెద్ద బహుళ-కార్యాత్మక బృందాలకు నాయకత్వం వహించాడని ఆరోపించినట్లు తెలుస్తోంది.

లేఖలోని విషయాలపై అభ్యంతరం
ఆ లేఖలోని కొన్ని విషయాలు అతిశయోక్తిగా, వాస్తవ ఆధారాలు లేనివిగా టిల్లింగ్‌హాస్ట్‌కు అనిపించాయి. అందుకే తాను నిజమని నమ్మి ధృవీకరించగలిగే అంశాలను మాత్రమే ఉంచేలా లేఖను మార్చినట్లు ఆయన చెబుతున్నారు. అయినప్పటికీ, ఆ లేఖపై సంతకం చేయడానికి ఆయన నిరాకరించారు. తరువాత మరో మేనేజర్ ఆ లేఖను అప్రూవ్ చేసినట్లు సమాచారం.

USCISకి తప్పు సమాచారం ఇవ్వకూడదని నిర్ణయం
టిల్లింగ్‌హాస్ట్‌ తన నిర్ణయం వెనుక ఎలాంటి వ్యక్తిగత ఉద్దేశం లేదని చెబుతున్నారు. తనకు నిజం కాదని తెలిసిన సమాచారాన్ని యూఎస్సీఐఎస్ (యూ.ఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్)కు సమర్పించే ఇమ్మిగ్రేషన్ ప్రొసీడింగ్స్‌లో ధృవీకరించడం సరైనది కాదని భావించానని ఆయన పేర్కొన్నారు.

ఆ తర్వాత ఉద్యోగంలో ఏమైంది?
తన అభ్యంతరాలు వ్యక్తం చేసిన కొద్దికాలానికే మెటాలోని తన ఇంటర్నల్ యాక్సెస్ తొలగించినట్లు టిల్లింగ్‌హాస్ట్‌ పేర్కొన్నారు. ఆ తరువాత సెప్టెంబర్ 2024లో ఉద్యోగం కోల్పోయారు.

మెటా తనను పర్ఫామెన్స్ ఇస్స్యూ కారణంగా తొలగించిందని చెప్పినప్పటికీ, టిల్లింగ్‌హాస్ట్‌ మాత్రం ఆ కారణం నిజం కాదని అంటున్నారు. తనకు ఇంతకుముందు ఎలాంటి నెగిటీవ్ పర్ఫామెన్స్ రికార్డ్స్ లేదని, ఇమ్మిగ్రేషన్ డాక్యుమెంట్ మీద సంతకం చేయడానికి నిరాకరించినందుకు ప్రతీకార చర్యగా తనను తొలగించారని ఆయన ఆరోపిస్తున్నారు.

తనకు జరిగిన ఆర్థిక నష్టానికి 1 మిలియన్ కంటే ఎక్కువ నష్టపరిహారం కావాలని టిల్లింగ్‌హాస్ట్‌ కోర్టును కోరుతున్నారు. ఇందులో ఉద్యోగం కోల్పోవడం వల్ల వచ్చిన శాలరీ లాస్ మాత్రమే కాకుండా స్టాక్ ఈక్విటీకి సంబంధించిన నష్టాలు కూడా ఉన్నాయి.

అయితే ఈ కేసులో అసలు ప్రశ్న.. టిల్లింగ్‌హాస్ట్‌ పనితీరు సరిగా లేకపోవడం వల్లనే కంపెనీ తొలగించిందా?, లేదా ఇమ్మిగ్రేషన్ డాక్యుమెంట్ మీద సంతకం చేయకపోవడమే కారణమా?, అనే విషయాలు తెలియాల్సి ఉంది. దీనిపై కంపెనీ అధికారికంగా స్పందించలేదు.

ఇదీ చదవండి: EPFO బిగ్ అప్డేట్.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్!

Videos

ఇప్పటికీ మేఘన నా కూతురే.. కొడుకు వివాదంపై జోగిరమేష్ రియాక్షన్

అదిగో నా కోడలు.. వసంత కృష్ణ ప్రసాద్ ఆఫీస్ వద్ద.. సంచలన వీడియో బయటపెట్టిన జోగి రమేష్

ఎగసిపడుతున్న అలలు.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

భారీగా పెరిగిన బంగారం ధర

Watch Live: కొడుకు వివాదంపై జోగి రమేష్ సంచలన ప్రెస్ మీట్

కలిసొచ్చిన సెంటిమెంట్.. రవితేజ సక్సెస్ సీక్రెట్ ఇదే.!

నెల్లూరు జిల్లాలో గుప్తనిధుల తవ్వకాల కలకలం

భగ్గుమన్న బియ్యం ధరలు.. చోద్యం చూస్తున్న బాబు సర్కార్

కాకినాడ రూరల్ PS కు సాధిక్ ఖాన్ తరలింపు

దొరికిన ఇద్దరు వీడియో.. ఈశ్వర్ సాయి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హీరోయిన్ కృతిసనన్ హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఇన్నాళ్లకు మళ్లీ ఓకే వేదికపై..(ఫోటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ మూవీ హీరోయిన్‌ ప్రిషా సింగ్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ బ్యూటీ కిర్రాక్ సీత వరలక్ష్మీ వ్రతం పూజలు.. (ఫోటోలు)

+5

నటి రాధిక బర్త్‌ డే సెలబ్రేషన్స్.. సీనియర్ హీరోయిన్ల సందడి (ఫోటోలు)

+5

టాక్సిక్ ఈవెంట్.. స్పెషల్ ‍అట్రాక్షన్‌గా కియారా అద్వానీ (ఫోటోలు)

+5

గిరిజన తండాల్లో యువతుల సందడే సందడి (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా మార్వాడీల 'కావడి యాత్ర' (ఫొటోలు)

+5

టాక్సిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. ఫోటోలు

+5

ఫ్రెండ్స్‌తో ఫుల్‌ జోష్‌లో ఆనంది..(ఫోటోలు)