అర్ధరాత్రి ఆపరేషన్..! పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు
Breaking News
‘అమీర్ లోగ్’ని అమితాబ్ చిత్రాలతో పోల్చడం హ్యాపీగా ఉంది: దర్శకుడు
Published on Tue, 08/18/2026 - 09:08
‘‘అమీర్ లోగ్’ చిత్రంలో అన్నిరకాల వాణిజ్య అంశాలుఉన్నాయి. ఈ సినిమా కేవలం యువతకి మాత్రమే కాదు. 13 సంవత్సరాలు దాటిన పిల్లలతో కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటుంది. ఈ మూవీని ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’’ అని దర్శకుడు రమణా రెడ్డి సోమ తెలిపారు. ఎంసీ హరి, మనోజ్, శశిధర్, వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘అమీర్ లోగ్’. అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన ఈ మూవీని రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా ఈ నెల 21న విడుదల చేస్తోంది.
ఈ నేపథ్యంలో రమణా రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ–‘‘మాది నల్గొండ జిల్లాలోని రాఘవపురం. 1997లో ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కి వచ్చాను. జేఎన్‌టీయూలో ఆర్టిటెక్ట్ చదివాను. మూడేళ్ల క్రితం షార్ట్ ఫిల్మ్ తీశాను. ‘అమీర్ లోగ్’ సినిమాని బస్తీలోనే షూట్ చేయాల్సి రావడంతో సింక్ సౌండ్‌ని వాడాం. నటీనటులు కొత్తవాళ్లు అయినప్పటికీ చాలా బాగా నటించారు. ‘అమీర్ లోగ్’కి రానాగారి సపోర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ చిత్రాన్ని చూసిన డైరెక్టర్ వీఎన్ ఆదిత్యగారు అమితాబ్‌గారి ‘ఝుండ్’, రణ్‌వీర్ సింగ్ ‘గల్లీబాయ్’ చిత్రాలతో పోల్చడం సంతోషంగా అనిపించింది’’ అని పేర్కొన్నారు.
Tags : 1